Google ratings
-
Google: ఒకేరోజు 9.5శాతం కుంగిన ఆల్ఫాబెట్ఇంక్!
గూగుల్-ఆల్ఫాబెట్ఇంక్ క్లౌడ్ బిజినెస్‌లో మూడో త్రైమాసిక ఆదాయంలో 22.5% వృద్ధిని నమోదు చేసింది. గూగుల్ క్లౌడ్ త్రైమాసికంలో నికర లాభాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ ఆల్ఫాబెట్ఇంక్ ఫలితాల్లో వాల్ స్ట్రీట్ అంచనాలను మించలేకపోయింది. దాంతో బుధవారం మార్కెట్ ముగింపు సమయానికి కంపెనీ స్టాక్ 9.5శాతం తగ్గి 125.6 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఫలితాలు విడుదల సందర్భంగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్‌పిచాయ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత ఉపయోగకరంగా మార్చడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు. అందరికి ప్రముఖ ఏఐ మోడల్లను చేరువ చేస్తామన్నారు. ఏఐ రంగంలో అద్భుతమైన పురోగతి ఉందని చెప్పారు. కృత్రిమమేధలో పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ఎక్కువ అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఆదాయ వృద్ధి గడిచిన త్రైమాసికంతో పోలిస్తే 28% నుంచి 22.5%కి మందగించింది. యూనిట్ మూడో త్రైమాసిక ఆదాయం రూ.69వేలకోట్లుకు పెరిగింది. ఈ యూనిట్ నిర్వహణ పరంగా గతేడాది రూ.3660 కోట్ల నష్టంతో పోలిస్తే, రూ.2213కోట్ల ఆదాయాన్ని పోస్ట్ చేసింది. అయితే వాల్ స్ట్రీట్ క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహణ..రూ.3600 కోట్లు, ఆదాయం..రూ.71వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. కొందరు కస్టమర్లు కాస్ట్‌కటింగ్ పేరిట్ క్లౌడ్ సేవలు వినియోగించుకోలేదని దాంతో యూనిట్ అమ్మకాలు దెబ్బతిన్నాయని సీఎఫ్ఓ రూత్ పోరట్ తెలిపారు. గూగుల్‌క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ సేవలు, సహకార సాధనాలు, కస్టమర్ల కోసం ఇతర ఎంటర్ప్రైజ్ సేవలు అందిస్తూ ఆదాయం సంపాదిస్తుంది. -
శశికళ ఎఫెక్ట్ : గోల్డెన్ బే రిసార్ట్ ఢమాల్
చెన్నై : శశికళ ఎఫెక్ట్ గోల్డెన్ బే రిసార్ట్‌కు భారీగా తగులుతోంది. ఒక్కసారిగా తన పేరు ప్రతిష్టలన్నీ భారీగా కోల్పోతుంది. గూగుల్ రేటింగ్స్ అన్నీ తలకిందులుగా వస్తున్నాయి. శశికళ లాంటి రాజకీయ నాయకులకు సురక్షిత ప్రాంతంగా ఈ రిసార్ట్ మారడంతో దీనికి ఈ పరిస్థితి ఏర్పడింది. కనీసం ఈ రిసార్ట్ లో భద్రత ఉండదు, అక్కడ పొలికల్ మాఫీయా గ్రూప్ ఉందంటూ గూగుల్ రివ్యూలో నెటిజన్లు పేర్కొంటున్నారు. క్రిమినాల్స్ అక్కడ ఈజీగా లోపలికి రావడానికి, బయటికి వెళ్లడానికి వీలుందంటూ మరో నెటిజన్ చెప్పారు. హోటల్ మేనేజ్మెంట్ కూడా అక్కడ అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ చెబుతున్నారు. మొత్తం అక్కడ థర్డ్ క్లాస్ రౌడీలే ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లొదంటూ సూచిస్తున్నారు. మాఫియా గ్రూప్ ఉంటున్న ఈ ప్రాంతం పర్యాటకులకు ఎలా సురక్షితమో చెప్పడని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు కూడా ఈ రిసార్ట్‌పై మండిపడుతున్నారు. దీని ఫలితంగా గూగుల్ లో రిసార్ట్‌కు వస్తున్న రేటింగ్స్ చాలా ప్రతికూలంగా వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గోల్డెన్ బే రిసార్ట్ వద్ద జరుగుతున్న హైడ్రామా మనకు తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని ఎత్తులకు పై ఎత్తులు వేసిన శశికళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందర్ని అక్కడ దాచిపెట్టారు. కనీసం వారికి మొబైల్ ట్రాకింగ్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా చేశారు. రిసార్ట్ చుట్టూ శశికళ వర్గం మన్నార్ గుడి మాఫియాను దించారు. ఎమ్మెల్యేలను దాచడానికి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా శశికళ భావించడంతో గోల్డెన్ బే రిసార్ట్ ఒక్కసారిగా పొలికల్ మాఫియాగా మారిపోయింది. గోల్డెన్ బే రిసార్ట్ ఇలా మారడంతో చాలా చెత్త రిసార్ట్‌గా పేరొందుతోంది.