మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు పోటీగా ఏఐ చాట్ జీపీటీని అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. టెక్నాలజీ రంగంలో మకుటం లేని మహరాజు విరాజిల్లుతున్న గూగుల్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ జీమెయిల్ సృష్టికర్త పాల్ బుచిత్‌తో పాటు పలువురు ఐటీ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఈ విపత్తు నుంచి బయట పడేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘బార్డ్’ అనే పేరుతో గూగుల్ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
ఇప్పుడీ ప్రకటనపై గూగుల్ ఉద్యోగులు సుందర్ పిచాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపులు, హడావిడిగా బార్డ్ అందుబాటులోకి తెస్తామని ప్రకటన చేయడం, బార్డ్ టెస్టింగ్ చేసే సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా తప్పుడు జవాబులు ఇవ్వడాన్ని విమర్శలు చేస్తున్నారు. రష్ట్(తొందరగా), బాచ్డ్( నిర్లక్ష్యంగా), కామిక్లీ షార్ట్-సైటెడ్ (హాస్యా స్పదం) అంటూ ఇంటర్నల్ ఫోరమ్ మీమ్‌జెన్‌లో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
కొంతమంది ఉద్యోగులు నేరుగా సుందర్ పిచాయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. బార్డ్, లేఆఫ్స్‌ను మయోపిక్‌గా(అస్పష్టంగా) అభిర్ణిస్తున్నారు. పిచాయ్ తొందరపాటు నిర్ణయాల వల్ల ఉద్యోగులకు, సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చర్చించుకుంటున్నారు.
Wait! What 😲 ?????? Google Bard AI failed during the testing phase 🤔 .
— Aamir Malik (@aamirmmalikg) February 9, 2023
Google lost $100B of a market cap today as its rival for ChatGPT AI (BARD) platform gave an incorrect answer in a live demo.#googlebard pic.twitter.com/ayjUWJvTzZ
ముఖ్యంగా బార్డ్ ప్రమోషనల్ వీడియోలో తప్పలు దొర్లడాన్ని హైలెట్ చేస్తున్నారు. ప్రమోషనల్ వీడియోలో ‘9 ఏళ్ల పిల్లలకు చెప్పేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ (జేఎంఎస్‌టీ) కొత్తగా గుర్తించినవి ఏంటి?’ అనే ప్రశ్నకు బార్డ్ వివిధ సమాధానాలిచ్చింది. ఇందులో ఇందులో ‘భూమికి వెలుపల సోలార్ సిస్టమ్ ఫోటో తీసిన మొదటి శాటిలైట్ జేడబ్ల్యూఎస్‌టీ’ అనే ఆన్సర్ ఉంది. కానీ, నిజానికి యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలీస్కోప్ (వీఎల్‌టీ) 2004 లో మొదటిసారి ఈ ఫోటో తీసింది. దీన్ని నాసా నిర్ధారించింది కూడా.
ఈ ప్రమోషనల్ వీడియోలో తలెత్తిన తప్పులతో గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ షేర్లు 9 శాతం క్రాష్ అయ్యాయి. ఒక్క రోజులోనే 100 బిలియన్ డాలర్లు (రూ.8.20 లక్షల కోట్లు) పడిపోయిందంటూ గుర్తు చేస్తూ సుందర్ పిచాయ్ తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment