CEO Sundar Pichai
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతున్న గూగుల్!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతోంది. కంపెనీ ఇటీవలి మూడో త్రైమాసిక 2024 అర్నింగ్ కాల్ సందర్భంగా ఆయన గూగుల్ కొత్త కోడ్‌లో 25 శాతం ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ద్వారానే రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.దీని వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడర్లు కలవరపడాల్సిన పనేంటి అంటే ఇది కోడింగ్ ల్యాండ్‌స్కేప్‌లో ప్రాథమిక మార్పును సూచిస్తోంది. ఇక్కడ పనిభారాన్ని ఏఐ ఎక్కువగా పంచుకుంటోంది. దీనివల్ల కోడర్లు పూర్తి తమ ఉద్యోగాలను కోల్పోతారని చెప్పడం లేదు. కానీ ఇంజనీర్లు ఉన్నత-స్థాయి సమస్య-పరిష్కారం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఏఐ గుర్తు చేస్తోంది.నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే..ఆటోమేషన్ సామర్థ్యం పెరుగుతున్నకొద్దీ ఎంట్రీ-లెవల్, రొటీన్ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇంజనీర్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి గూగుల్ ఎంత ప్రాధాన్యత ఇస్తోందనే దానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది."గూగుల్ కొత్త కోడ్లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఏఐ ద్వారా రూపొందింది" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అర్నింగ్ కాల్‌పై బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. కోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఏఐని వినియోగిండం ద్వారా ఆవిష్కరణ అభివృద్ధిలో సమయం ఆదా చేయడంలో ఇంజినీర్లకు తోడ్పాటు అందించడం కంపెనీ లక్ష్యమని సుందర్ పిచాయ్ చెప్పారు. -
గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: సెలబ్రిటీలు ఉపయోగించే స్మార్ట్ఫోన్లపై ఆసక్తి ఉంటుంది. అందులోనూ టెక్ నిపుణులు, స్వయంగా స్మార్ట్‌ఫోన్ మేకర్స్ తమ సొంత ఫోన్లనే వాడతారా లేక వేరే కంపెనీలవి వాడతారా అనేది ఆరా తీస్తాం. తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దీనికి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు. గూగుల్ కంపెనీ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘పిక్సెల్ ఫోల్డ్’ను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వార్షిక డెవలపర్ల సమావేశంలో పిక్సెల్ ఫోల్డ్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సందర్ పిచాయ్ స్వయంగా పిక్సెల్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా అనుమానం రాకమానదు. ఈ క్రమంలో అడిగిన ప్రశ్నకు సుందర్ పిచాయ్ తనదైన శైలిలో జవాబు చెప్పారు. గూగుల్ ఉత్పత్తులను వినియోగించే తొలి యూజర్లలో తానూ ఒకడినని వెల్లడించారు. గూగుల్ ఇటీవల విడుదల అయిన పిక్సల్ ఫోల్డ్ , పిక్సల్ 7ఏ ఫోన్లను (టెస్టింగ్) వినియోగిస్తున్నట్టు చెప్పారు. (Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పిచాయ్ తాను పిక్సెల్ ఫోల్డ్‌ను చాలా కాలంగా పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. అయితే గూగుల్ పిక్సల్ 7 ప్రోను తన ప్రైమరీ ఫోన్‌గా వినియోగిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ నుంచి, కొత్త గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, ఐఫోన్దాకా దాదాపు అన్ని ఫోన్లను టెస్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మల్టీటాస్కింక్, ఒకేసారి వివిధ యాప్‌లలో పని చేయడానికి పిక్సెల్ ఫోల్డ్ వాడడాన్ని ఇష్టపడతారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వేర్వేరు సిమ్ కార్డులకు వేర్వేరు ఫోన్లను వినియోగిస్తానన్నారు. (Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్‌లో ఉద్యోగులు!) ఇక స్మార్ట్ఫోన్ల భవిష్యత్తుపై మాట్లాడిన సుందర్ పిచాయ్ ప్రజల అవసరాలకు అనుగుణంగా వారు మెచ్చే స్మార్ట్ఫ్లోన్లను అందించాలనుకుంటున్నామని, ఇందులో ఫోల్డబుల్ ఫోన్లు మాత్రమే తమ అంతిమ లక్ష్యం కాదని చెప్పుకొచ్చారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) సాంకేతికత ప్రారంభ దశలో ఉన్న ఈనాటిలా కాకుండా ఏఐ మరింత నేచురల్‌గా ఉండబోతోందన్నారు. రానున్న సంవత్సరాల్లో మరింత ఇంటరాక్టివ్‌గా, సహజమైన భాషలతో ఫోన్లు ప్రతిదీ అర్థం చేసుకునేలా ఉంటుందన్నారు. అలాగే ఇప్పటివరకు మానవులు ఏఐకి అనుగుణంగా ఉన్నారు.కానీ అయితే భవిష్యత్తులో ఏఐ అనేది మానవులకు అనుగుణంగా మారిపోయేలా కంప్యూటర్లను ఎనేబుల్ చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, సక్సెస్ స్టోరీలు, ఇతర అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి,బిజినెస్ View this post on Instagram A post shared by Arun Maini (@mrwhosetheboss) -
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు!
మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు పోటీగా ఏఐ చాట్ జీపీటీని అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. టెక్నాలజీ రంగంలో మకుటం లేని మహరాజు విరాజిల్లుతున్న గూగుల్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ జీమెయిల్ సృష్టికర్త పాల్ బుచిత్తో పాటు పలువురు ఐటీ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ విపత్తు నుంచి బయట పడేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘బార్డ్’ అనే పేరుతో గూగుల్ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడీ ప్రకటనపై గూగుల్ ఉద్యోగులు సుందర్ పిచాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపులు, హడావిడిగా బార్డ్ అందుబాటులోకి తెస్తామని ప్రకటన చేయడం, బార్డ్ టెస్టింగ్ చేసే సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా తప్పుడు జవాబులు ఇవ్వడాన్ని విమర్శలు చేస్తున్నారు. రష్ట్(తొందరగా), బాచ్డ్( నిర్లక్ష్యంగా), కామిక్లీ షార్ట్-సైటెడ్ (హాస్యా స్పదం) అంటూ ఇంటర్నల్ ఫోరమ్ మీమ్జెన్లో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు నేరుగా సుందర్ పిచాయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. బార్డ్, లేఆఫ్స్‌ను మయోపిక్‌గా(అస్పష్టంగా) అభిర్ణిస్తున్నారు. పిచాయ్ తొందరపాటు నిర్ణయాల వల్ల ఉద్యోగులకు, సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చర్చించుకుంటున్నారు. Wait! What 😲 ?????? Google Bard AI failed during the testing phase 🤔 . Google lost $100B of a market cap today as its rival for ChatGPT AI (BARD) platform gave an incorrect answer in a live demo.#googlebard pic.twitter.com/ayjUWJvTzZ — Aamir Malik (@aamirmmalikg) February 9, 2023 ముఖ్యంగా బార్డ్ ప్రమోషనల్ వీడియోలో తప్పలు దొర్లడాన్ని హైలెట్ చేస్తున్నారు. ప్రమోషనల్ వీడియోలో ‘9 ఏళ్ల పిల్లలకు చెప్పేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ (జేఎంఎస్టీ) కొత్తగా గుర్తించినవి ఏంటి?’ అనే ప్రశ్నకు బార్డ్ వివిధ సమాధానాలిచ్చింది. ఇందులో ఇందులో ‘భూమికి వెలుపల సోలార్ సిస్టమ్ ఫోటో తీసిన మొదటి శాటిలైట్ జేడబ్ల్యూఎస్‌టీ’ అనే ఆన్సర్ ఉంది. కానీ, నిజానికి యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలీస్కోప్ (వీఎల్టీ) 2004 లో మొదటిసారి ఈ ఫోటో తీసింది. దీన్ని నాసా నిర్ధారించింది కూడా. ఈ ప్రమోషనల్ వీడియోలో తలెత్తిన తప్పులతో గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ షేర్లు 9 శాతం క్రాష్ అయ్యాయి. ఒక్క రోజులోనే 100 బిలియన్ డాలర్లు (రూ.8.20 లక్షల కోట్లు) పడిపోయిందంటూ గుర్తు చేస్తూ సుందర్ పిచాయ్ తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నిస్తున్నారు. -
గూగుల్ ప్రధాన కార్యాలయంలో మోదీ
కాలిఫోర్నియా: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత ఫేస్ బుక్ ప్రధాన కార్యలయాన్నిసందర్శించిన ఆయన అక్కడ ఫేస్ బుక్ ఖాతాదారులతో జరిగిన ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్న అనంతరం సిలికాన్ వ్యాలీలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ మాజీ సీఈవో ఎరిక్ మిట్తో ప్రధానిమోదీ మాట్లాడారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి గూగుల్ మద్దతును ప్రధాని కోరారు. ఈ సందర్భంగా గూగుల్ ఎర్త్ గురించి సుందర్ పిచాయ్ ప్రధానికి వినిపించారు. దీంతోపాటు రానున్న రోజుల్లో 100 భారతీయ రైల్వే స్టేషన్లలో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని, అది వచ్చే ఏడాదినాటికి 400కు పెంచుతామని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.