కాలిఫోర్నియా: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత ఫేస్ బుక్ ప్రధాన కార్యలయాన్నిసందర్శించిన ఆయన అక్కడ ఫేస్ బుక్ ఖాతాదారులతో జరిగిన ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్న అనంతరం సిలికాన్ వ్యాలీలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ మాజీ సీఈవో ఎరిక్ మిట్తో ప్రధానిమోదీ మాట్లాడారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి గూగుల్ మద్దతును ప్రధాని కోరారు. ఈ సందర్భంగా గూగుల్ ఎర్త్ గురించి సుందర్ పిచాయ్ ప్రధానికి వినిపించారు. దీంతోపాటు రానున్న రోజుల్లో 100 భారతీయ రైల్వే స్టేషన్లలో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని, అది వచ్చే ఏడాదినాటికి 400కు పెంచుతామని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.
గూగుల్ ప్రధాన కార్యాలయంలో మోదీ
Published Mon, Sep 28 2015 1:16 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM
Advertisement