ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతమైంది. పర్యటనలో భాగంగా మోదీ అగ్రరాజ్యం, భారత్‌లలో టాప్ కంపెనీల సీఈవోలు, ఛైర్మన్లతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఇందులో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రానున్న ఏడేళ్ల కాలంలో భారత్‌లో 15 బిలియన్ డాలర్లను పెట్టుబడులు పెట్టనుంది. దీంతో ఈకామర్స్ దిగ్గజం దేశీయ పెట్టుబడుల మొత్తం 26 బిలియన్ డాలర్లకు చేరనుంది.
♦ఇక, గుజరాత్ కేంద్రంగా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ కంపెనీ (గిఫ్ట్ సిటీ) లో గూగుల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించేలా సత్యనాదెళ్ల మోదీతో చర్చలు జరిపినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ పేరుతో 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌లో దేశీయంగా ఇతర సంస్థలకు కావాల్సిన ఆర్ధిక సేవల్ని గూగుల్ అందించనుంది.
♦భారతీయులకు మెరుగైన జీవన ప్రమాణాల్ని అందించేలా, అందుకు పవర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు ఏ విధంగా తోడ్పడనున్నాయనే అంశంపై మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల చర్చించారు. ఈ ఏడాది మే’లో మైక్రోసాఫ్ట్ జూగల్ బందీ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను లాంచ్ చేసింది. ఈ చాట్‌బాట్‌తో 50 కి ప్రభుత్వ పథకాలతో పాటు వినియోగదారులకు కావాల్సిన సమాచారాన్ని 22 రకలా స్థానిక భాషల్లో అందిస్తుంది.
♦ఇక తాజాగా మోదీతో జరిగిన భేటీలో అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ భారత్‌లోని స్టార్టప్‌లతో పాటు కొత్త ఉద్యోగాల రూపకల్పన, ఎగుమతుల అనుమతి, డిజిటలైషేషన్, అంతర్జాతీయ స్థాయిలో చిన్న చిన్న వ్యాపారాలు వృద్ది జరిగేలా మద్దతు పలుకున్నట్లు తెలిపింది. అమెజాన్ 10 మిలియన్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేస్తామని, 2025 నాటికి భారత్‌లో 20 బిలియన్ల ఎగుమతులను ప్రారంభించేందుకు, 2 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తామని హామీ ఇచ్చింది.
♦ప్రధాని పర్యటన సందర్భంగా, మైక్రోన్ టెక్నాలజీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌తో పాటు, గుజరాత్‌లో 2.75 బిలియన్ డాలర్ల వ్యయంతో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ సదుపాయాన్ని నిర్మిస్తామని చెప్పింది.
♦తన అమెరికా పర్యటన చివరి రోజున ప్రధాని నరేంద్ర మోదీ హై-టెక్ హ్యాండ్‌షేక్ పేరుతో నిర్వహించిన మెగా ఈవెంట్‌లో సెమీకండక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, స్పేస్, స్టార్ట్-అప్‌లతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. యాపిల్ టిమ్ కుక్, ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి, ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, ఎఫ్‌ఎంసీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో మార్క్ డగ్లస్, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, గూగుల్ సుందర్ పిచాయ్ తదితరులు ఉన్నారు.
♦భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాటు పలువురు దిగ్గజ సంస్థల అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
♦అంతరిక్ష రంగంలో, అంతరిక్ష పరిశోధన కోసం భారత్ ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి, నాసా, ఇస్రోలు మానవ అంతరిక్ష యాత్ర కోసం కలిసి పనిచేయనున్నాయి.
చదవండి👉 భారత్‌లోకి టెస్లా రాకను కేంద్రం ఎందుకు వ్యతిరేకించింది?
Comments
Please login to add a commentAdd a comment