న్యూయార్క్ : ఇంటర్‌నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ మార్కెట్ విలువ లక్ష కోట్ల డాలర్లకు ఎగిసి ఈ ఘనత సాధించిన నాలుగవ అమెరికన్ టెక్నాలజీ కంపెనీగా నిలిచింది. అల్ఫాబెట్ షేర్లు గురువారం 0.76 శాతం పెరగడంతో ట్రేడ్ ముగిసే సమయానికి కంపెనీ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరింది. ఇక 2018లో యాపిల్ తొలిసారిగా లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరగా ఇప్పుడు దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.38 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 1.26 లక్షల కోట్ల డాలర్లు కాగా, మరో టెక్ దిగ్గజం అమెజాన్ సెప్టెంబర్ 2018లో లక్ష కోట్ల డాలర్లకు చేరింది. కాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు ఇటీవల అల్ఫాబెట్ సీఈఓ బాధ్యతలను సైతం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. పిచాయ్ ప్రమోషన్‌తో గూగుల్ సహ వ్యవస్ధాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌లు కంపెనీ రోజువారీ వ్యవహారాల నుంచి వైదొలిగారు.
Comments
Please login to add a commentAdd a comment