
టెక్నలాజి పెరుగుతున్న తరుణంలో యూజర్లకు కూడా.. కొత్త ఫీచర్స్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల ప్రారంభంలో గూగుల్ ఏఐ సెర్చింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారుల ప్రశ్నలకు తక్షణ సమాధానాలను అందిస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ కొత్త ఫీచర్ యూజర్లను తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఒక యూజర్ రోజుకు ఎన్ని రాళ్లు తినాలి అని అడిగితే.. రాళ్ళల్లో మినరల్స్ ఉంటాయి. కాబట్టి రోజుకు కనీసం ఒక చిన్న రాయి తినండి అని సమాధానం ఇచ్చింది.
మరో యూజర్ పిజ్జా మీద చీజ్ నిలబడలేదు, ఏం చేయాలి అని అడిగినప్పుడు.. గ్లూ (గమ్) వేసుకోండి అని.. సింపుల్‌గా సమాధానం ఇచ్చింది. ఇంకొకరు ఎంత మంది ముస్లింలు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడయ్యారు అని గూగుల్ ఏఐని అడిగినప్పుడు.. యునైటెడ్ స్టేట్స్‌లో ఒక ముస్లిం అధ్యక్షుడు ఉన్నారు. ఆయన పేరు బరాక్ హుస్సేన్ ఒబామా అని సమాధానం ఇచ్చింది.
గూగుల్ ఇచ్చిన సమాధానాలను యూజర్లు స్క్రీన్‌షాట్‌లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. గూగుల్ ఏఐను విమర్శిస్తున్నారు.
Google AI is diabolical 💀 pic.twitter.com/YDw34414TO
— no context memes (@weirddalle) May 24, 2024
Comments
Please login to add a commentAdd a comment