సంగీతం కోసం సంగీత వాయిద్యాలపై పట్టు ఉండాలన్నది గతకాలపు మాట. కృత్రిమ మేధ ఉండగా.. సంగీతానికి కొదవేముంది అంటోంది ఈ కాలం. ఏమిటీ వింత అనుకుంటున్నారా? ఏం లేదండీ... గూగుల్ సంగీత సృష్టికి తాజాగా ఏఐ ఆధారిత టెక్నాలజీ ఒకదాన్ని అభివృద్ధి చేసింది. పేరు ఇన్‌స్ట్రుమెంటల్ ప్లే గ్రౌండ్’: పేరులో ఉన్నట్లే ఈ టెక్నాలజీ ద్వారా భారతీయ వీణతోపాటు దాదాపు వంద సంగీత వాయిద్యాలను అలా అలా వాడేయవచ్చు. సరిగమలు పలికించవచ్చు. పదాలతో సంగీతాన్ని సృష్టించవచ్చు.
తాజాగా గూగుల్ ఏఐ ఆధారిత సంగీత టూల్ ‘ఇన్‌స్ట్రుమెంట్ ప్లేగ్రౌండ్’ను పరిచయం చేసింది. వీణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 సంగీత వాయిద్యాల శిక్షణ ఇచ్చారు. వినియోగదారులు తమకు ఇష్టమైన పరికరాన్ని ఎంచుకొని పదాల రూపంలో ప్రాంప్ట్‌ను అందిస్తే చాలు. దీంట్లో సంగీతం నేర్చుకునేందుకు ఉండే సాఫ్ట్‌వేర్ ఇరవై సెకన్లలోనే సంగీతం క్లిప్‌ను సృష్టిస్తుంది. సంతోషం, ప్రేమ, అనురాగం వంటి భావోద్వేగాలను మన ప్రాంప్ట్‌లకు జోడించొచ్చు.
ఇదీ చదవండి: ఫన్‌సెర్చ్‌ను క్రియేట్ చేసిన గూగుల్.. ఇదే ప్రత్యేకత
కృత్రిమ మేధతో సంగీతాన్ని సృష్టించాలని అనుకునే వారు సౌండ్‌రా ఏఐ సాయమూ తీసుకోవచ్చు. దీనిలోని సంగీతమంతా కాపీరైట్ లేనిదే. ఒక బృందం రూపొందించిన సంగీతం నమూనా ఆధారంగానే దీనికి మొత్తం శిక్షణ ఇచ్చారు. కాబట్టి కాపీరైట్ సమస్యలు వస్తాయేమోననే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment