Instrumental Violin
-
Natarajan: సంగీతానికి ఇన్స్ట్రుమెంట్ ఈ కుటుంబం..
భక్తి పాటల భజనకైనా, జానపద గీతాలకైనా, సంగీత కచేరీలకైనా తంబురా, హార్మోనియం, డోలక్, తబలా వంటి వాద్యాలు తప్పనిసరి! పాపులర్ మ్యూజిక్‌లో వీటి జాడ అరుదు ఇంకా చెప్పాలంటే కరవూ! కానీ కర్నూల్లోని నటరాజన్ ఇంట్లో ఇప్పటికీ ఇవి శ్రుతి సరిచేసుకుంటున్నాయి.. శ్రోతలకు మెలోడీ ఫెస్ట్‌ని అందివ్వడానికి!నటరాజన్ సంగీత వాద్యపరికరాలు తయారు చేయడంలో ఘనాపాఠి! ఇది ఆయనకు వారసత్వంగా అబ్బిన, అందిన విద్య, వృత్తి, సంపద కూడా! నటరాజన్ తాత, ముత్తాతల కాలం నుంచీ ఇది కొనసాగుతోంది. ఆ కుటుంబంలోని అందరూ బాగా చదువుకున్నవారే. నటరాజన్ ముత్తాత మురుగేషన్ మొదలియార్.. బ్రిటిష్ కాలంలో హార్మోనియం గురువుగా ఉన్నారు. డ్రామాలకు దుస్తులను సరఫరా చేసే కంపెనీనీ నడిపారు. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరైన రామస్వామి కొడుకే నటరాజన్ తండ్రి.. బాలసుబ్రహ్మణ్యం.పేపర్ మిల్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆ మిల్లు మూతపడటంతో తాతల వృత్తి సంగీత వాద్యపరికరాల తయారీని జీవనోపాధిగా మలచుకున్నారు. దాన్ని తన కొడుకు నటరాజన్‌కూ నేర్పారు. నటరాజన్ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అయినా తండ్రి నేర్పిన విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. హార్మోనియం, వయొలిన్, వీణ, మృదంగం, డోలక్, తబలా, ఫ్లూట్ వంటి వాయిద్యాలను యువతను ఆకర్షించేలా తయారుచేస్తున్నారు. వీరి ఈ పరికరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ డిమాండ్ ఉంది. ఈయన దగ్గర అయిదు వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల దాకా విలువ చేసే హార్మోనియం, వీణ, తబలాలు అందుబాటులో ఉన్నాయి.‘నేటి స్ట్రెస్ఫుల్ లైఫ్‌కి మంచి ఊరట సంప్రదాయ వాద్య సంగీతం. ఇది మనసును ఇట్టే తేలిక చేసి సాంత్వననిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులోకి రావడంతో అలనాటి సంగీత పరికరాలను మర్చిపోతున్నారు. గత అయిదారు సంవత్సరాల నుంచి దేవాలయాల్లో భజన కార్యక్రమాలు ఎక్కువవడంతో మళ్లీ అలనాటి సంగీత పరికరాలకు ఆదరణ పెరిగి.. మాకు మళ్లీ చేతినిండా పని దొరికినట్టయింది’ అని చెబుతున్నారు నటరాజన్. – కె.రామకృష్ణ -
పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి..
సంగీతం కోసం సంగీత వాయిద్యాలపై పట్టు ఉండాలన్నది గతకాలపు మాట. కృత్రిమ మేధ ఉండగా.. సంగీతానికి కొదవేముంది అంటోంది ఈ కాలం. ఏమిటీ వింత అనుకుంటున్నారా? ఏం లేదండీ... గూగుల్ సంగీత సృష్టికి తాజాగా ఏఐ ఆధారిత టెక్నాలజీ ఒకదాన్ని అభివృద్ధి చేసింది. పేరు ఇన్స్ట్రుమెంటల్ ప్లే గ్రౌండ్’: పేరులో ఉన్నట్లే ఈ టెక్నాలజీ ద్వారా భారతీయ వీణతోపాటు దాదాపు వంద సంగీత వాయిద్యాలను అలా అలా వాడేయవచ్చు. సరిగమలు పలికించవచ్చు. పదాలతో సంగీతాన్ని సృష్టించవచ్చు. తాజాగా గూగుల్ ఏఐ ఆధారిత సంగీత టూల్ ‘ఇన్స్ట్రుమెంట్ ప్లేగ్రౌండ్’ను పరిచయం చేసింది. వీణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 సంగీత వాయిద్యాల శిక్షణ ఇచ్చారు. వినియోగదారులు తమకు ఇష్టమైన పరికరాన్ని ఎంచుకొని పదాల రూపంలో ప్రాంప్ట్‌ను అందిస్తే చాలు. దీంట్లో సంగీతం నేర్చుకునేందుకు ఉండే సాఫ్ట్వేర్ ఇరవై సెకన్లలోనే సంగీతం క్లిప్‌ను సృష్టిస్తుంది. సంతోషం, ప్రేమ, అనురాగం వంటి భావోద్వేగాలను మన ప్రాంప్ట్‌లకు జోడించొచ్చు. ఇదీ చదవండి: ఫన్సెర్చ్ను క్రియేట్ చేసిన గూగుల్.. ఇదే ప్రత్యేకత కృత్రిమ మేధతో సంగీతాన్ని సృష్టించాలని అనుకునే వారు సౌండ్రా ఏఐ సాయమూ తీసుకోవచ్చు. దీనిలోని సంగీతమంతా కాపీరైట్ లేనిదే. ఒక బృందం రూపొందించిన సంగీతం నమూనా ఆధారంగానే దీనికి మొత్తం శిక్షణ ఇచ్చారు. కాబట్టి కాపీరైట్ సమస్యలు వస్తాయేమోననే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
ఎందాకా ఈ పరుగు?!
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో స్టేషన్లో ఒకతను దీక్షగా వయొలిన్ వాయిస్తున్నాడు. రైల్వేస్టేషన్ ఎలా ఉంటుందో తెలుసుగా! హడా వుడి, గందరగోళం, వెళ్లేవాళ్లు, వచ్చేవాళ్లు, ఎవరికీ క్షణం కూడా నిలబడే తీరిక లేదు. అందరూ పరుగెడుతున్నారు. అలా పరుగెడు తున్న వాళ్లలో ఒకతను మాత్రం ఎక్కడి నుంచో సంగీతం వినిపి స్తోందని కాసేపు అక్కడే ఆగి అటూఇటూ చూసి, మళ్లీ తన షెడ్యూల్ గుర్తుకొచ్చి పరుగెత్తాడు. అందరిదీ అదే స్థితి. పరుగులూ... ఉరకలూ! ఇంతలో మూడేళ్ల పిల్లాడొకడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. వాళ్ల అమ్మ వాణ్ణి నిలబడనివ్వలేదు. రెక్కపుచ్చుకొని ముందుకు లాక్కుపోయింది. ఇతర తల్లులూ తమ పిల్లల్ని అలాగే తీసుకుపో తున్నారు. అప్పటికి నలభై అయిదు నిమిషాలైంది. నిర్విరామంగా అతను వయొలిన్ వాయిస్తూనే ఉన్నాడు. కానీ, నిదానంగా విన్న వాళ్లని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. వారిలో డబ్బులిచ్చినవారూ తక్కు వే. అంతా లెక్కపెడితే యాభైడాలర్లు దాటవు! మరో పదిహేను నిమిషాల తర్వాత వయొలిన్ వాయించడం ఆపు చేశాడు. సంగీ తం నిలిచిపోయి నిశ్శబ్దం ఆవహించింది. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఎవరికీ తెలియని విషయమేమిటో చెప్పానా, అప్పటివరకూ మెట్రో రైల్వేస్టేషన్లో వయొలిన్ వాద్యం వినిపించింది జోషుయా బెన్ - ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడు. అత్యంత అధునాతనమైన వయొలిన్మీద చాలా క్లిష్టమైన సంగీత స్వరాల నూ, రాగాలనూ, గమకాలనూ అద్భుతంగా మనోజ్ఞంగా వినిపిం చాడు. రెండురోజుల తరువాత బోస్టన్ లో అతని సంగీతకచేరీ ఏర్పాటు చేస్తే అదే సంగీతాన్ని వినడానికి జనం వెర్రిగా ఎగబడ్డా రు. టికెట్టు కోసం తన్నుకున్నారు. ‘థియేటర్ ఫుల్ అయ్యింది, సీట్లు లేవు మహాప్రభో’ అంటే ఫరవాలేదు... నిలబడి వింటామన్నారు. ఇదేదో కల్పించి చెబుతున్న కథకాదు. నిజంగా జరిగింది. జోషుయా పేరు ప్రకటించకుండా సాదాసీదాగా ఒక సాధారణ కళాకారుడిగా ఆయన వయొలిన్ వాయిస్తే ప్రజలు ఏ మేరకు ఆస్వాదిస్తారో చూడాలన్న కుతూహలం ‘వాషింగ్టన్ పోస్ట్’కు కలి గింది. ఈ క్రమంలో ప్రజల ప్రాధాన్యాలు, అభిరుచులు, అవగా హన, స్పందన తెలుసుకోవచ్చని కూడా ఈ ప్రయోగం చేసింది. దీనితో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. బహిరంగ ప్రదేశంలో, అనువు గాని సమయంలో మనం అందాన్ని, తీయదనాన్ని ఆస్వాదించ గలమా? అభినందించగలమా? అతని ప్రతిభను, ప్రావీణ్యాన్ని గుర్తించగలుగుతామా? ఏమో! అవన్నీ ఎలావున్నా నాకు మాత్రం ఒకటనిపిస్తోంది. ఒక అద్భుతమైన కళాకారుడు నిర్మలమైన, మధురమైన, మనోహర మైన తన దివ్య సంగీతంలో పరిసరాలను ముంచెత్తుతుంటే క్షణం కూడా నిలబడి వినేందుకు మనకు తీరిక లేదంటే ఈ ప్రవహించే జీవన వాహినిలో పరుగులిడే చక్రాలమధ్య ఏది వింటున్నామో, ఏది తింటున్నామో, ఏది చూస్తున్నామో, ఏది ఆస్వాదిస్తున్నామో తెలియకుండా ఎన్ని అందాలను, ఎన్ని సౌందర్యాలను, ఎన్ని మధురిమలను, ఎన్ని సౌకర్యాలను ఎన్ని రంగుల్ని, ఎన్ని కాంతుల్ని మనం మిస్ అవుతున్నామో కదా అని దిగులేస్తోంది! ఒకే జీవితం అనేక అందాలు, తనివి తీరా ఇప్పుడే ఆస్వాదించండి. జీవితానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉంది. -ప్రయాగ రామకృష్ణ