Instrument Player
-
పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి..
సంగీతం కోసం సంగీత వాయిద్యాలపై పట్టు ఉండాలన్నది గతకాలపు మాట. కృత్రిమ మేధ ఉండగా.. సంగీతానికి కొదవేముంది అంటోంది ఈ కాలం. ఏమిటీ వింత అనుకుంటున్నారా? ఏం లేదండీ... గూగుల్ సంగీత సృష్టికి తాజాగా ఏఐ ఆధారిత టెక్నాలజీ ఒకదాన్ని అభివృద్ధి చేసింది. పేరు ఇన్స్ట్రుమెంటల్ ప్లే గ్రౌండ్’: పేరులో ఉన్నట్లే ఈ టెక్నాలజీ ద్వారా భారతీయ వీణతోపాటు దాదాపు వంద సంగీత వాయిద్యాలను అలా అలా వాడేయవచ్చు. సరిగమలు పలికించవచ్చు. పదాలతో సంగీతాన్ని సృష్టించవచ్చు. తాజాగా గూగుల్ ఏఐ ఆధారిత సంగీత టూల్ ‘ఇన్స్ట్రుమెంట్ ప్లేగ్రౌండ్’ను పరిచయం చేసింది. వీణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 సంగీత వాయిద్యాల శిక్షణ ఇచ్చారు. వినియోగదారులు తమకు ఇష్టమైన పరికరాన్ని ఎంచుకొని పదాల రూపంలో ప్రాంప్ట్‌ను అందిస్తే చాలు. దీంట్లో సంగీతం నేర్చుకునేందుకు ఉండే సాఫ్ట్వేర్ ఇరవై సెకన్లలోనే సంగీతం క్లిప్‌ను సృష్టిస్తుంది. సంతోషం, ప్రేమ, అనురాగం వంటి భావోద్వేగాలను మన ప్రాంప్ట్‌లకు జోడించొచ్చు. ఇదీ చదవండి: ఫన్సెర్చ్ను క్రియేట్ చేసిన గూగుల్.. ఇదే ప్రత్యేకత కృత్రిమ మేధతో సంగీతాన్ని సృష్టించాలని అనుకునే వారు సౌండ్రా ఏఐ సాయమూ తీసుకోవచ్చు. దీనిలోని సంగీతమంతా కాపీరైట్ లేనిదే. ఒక బృందం రూపొందించిన సంగీతం నమూనా ఆధారంగానే దీనికి మొత్తం శిక్షణ ఇచ్చారు. కాబట్టి కాపీరైట్ సమస్యలు వస్తాయేమోననే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
‘మేరా సాయా’కు మేగ్నట్లా అతుక్కుపోయా!
కీరవాణి అమితంగా ఆకర్షించిన సినీ గీతం నేను ఇంటర్ చదువుతున్న రోజులవి. రేడియోలో ఏవో హిందీ పాటలు వస్తుంటే వింటున్నాను. ‘మేరా సాయా’ అనే సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘తూ జహా... జహా ఛలేగా... మేరా సాయా సాథ్ హోగా’ పాట మొదలైంది. దాని అర్థం నాకు తెలియదు కానీ, ఆ పాటలోని మెలోడీకి మేగ్నట్లా అతుక్కుపోయాను. ఇప్పటికీ ఆ పాట విన్నప్పుడల్లా నాలో అదే ఫీలింగ్. లత పాడిన తీరు, సంగీత దర్శకుడు మదన్మోహన్ కంపోజ్ చేసిన విధానం, ముఖ్యంగా పాటలో వయొలిన్లను వాడిన శైలితో... ఆ పాట నన్ను వశపరుచుకుంది. అభిమాన గాయనీ గాయకులు నాటి తరంలో పి. సుశీల, ఆశా భోంస్లే. నేటి తరంలో బాంబే జయశ్రీ, శ్రుతీ పాఠక్. ఇక మేల్ సింగర్స్ విషయానికొస్తే... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, భీమ్సేన్ జోషీ, కిశోర్ కుమార్. ఫేవరెట్ మ్యూజిక్ డెరైక్టర్స్ నుస్రత్ ఫతే అలీఖాన్, ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్ అభిమానించే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్: వయొలిన్లో మేరునగధీరుడైన ద్వారం వెంకటస్వామి నాయుడు ఇష్టమైన రాగం: కల్యాణి ప్రియమైన తాళం: ఆది తాళం నొటేషన్ కాదు కొటేషన్: ‘‘కళ్లు మూసుకుని చెవులతో మాత్రమే సంగీతాన్ని ఆస్వాదించేవాడు నా దృష్టిలో నిజమైన మ్యూజిక్ లవర్. పాట వింటున్నప్పుడు హీరో గుర్తుకు రాకూడదు. డాన్స్, దేహ సౌందర్యం, మేకప్, లైట్లు, లేజర్ బీమ్స్, కులం, మతం, ప్రాంతం... ఇవేవీ గుర్తుకు రాకూడదు. నిజ మైన సంగీతాస్వాదన అలాగే ఉంటుంది.’’ -
ఆ పాట విన్న ప్రతిసారీ నా మనసు కన్నీరు పెడుతుంది!
దేవిశ్రీ ప్రసాద్ ప్రేమలో పడేసిన పాట విన్న తొలిసారే ఆ పాటతో ప్రేమలో పడిపోయాను. విన్న ప్రతిసారీ నా మనసు కన్నీరు పెట్టుకుంటూనే ఉంటుంది. కమలహాసన్ - మణిరత్నం - ఇళయరాజా వంటి హేమాహేమీలు చేసిన సినిమా ‘నాయగన్’. అందులో ‘తెన్‌పాండి సీమయిలే.. తేరోడుమ్ వీధియిలే..’ అనే పాట చాలా హాంటింగ్గానూ, హార్ట్ టచింగ్గానూ ఉంటుంది. కన్నీళ్లు ఆపుకోవడం కష్టం. విన్న ప్రతిసారీ అదే తంతు నాకు. ఈ పాట ఒక వెర్షన్ ఇళయరాజానే స్వయంగా ఆలపించారు. రెండో చరణంలో ఓ చోట ఫ్లూట్ బిట్ వస్తుంది. అసలప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఈసారి కన్నీళ్లు పెట్టుకోకూడదని ప్రతిసారీ అనుకుని విఫలమవుతుంటాను. నాకు తెలిసి అది గ్రేటెస్ట్ కంపోజిషన్. ఫేవరెట్ సింగర్స్ మైకేల్ జాక్సన్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, చిత్ర అభిమాన సంగీత దర్శకుడు: ఇళయరాజా ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఇంకెవరుంటారు... మా గురువుగారు ‘మ్యాండలిన్’ శ్రీనివాస్ ప్రియమైన రాగం ఒక్కటని చెప్పడం చాలా కష్టం. ఒక్కో రాగంలో ఒక్కో అర్థం ఉంటుంది. ఒక్కో అందం ఉంటుంది. దేని గొప్పతనం దానిదే. అయితే నాకు తెలియకుండానే నేను ఎక్కువగా అభేరి రాగంలో పాటలు చేస్తుంటాను. ఎందుకో నాకు అభేరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నట్టుంది. హ్యాపీగా ఏం చెప్పాలన్నా అభేరితో బాగా చెప్పొచ్చనిపిస్తుంది. సంగీతం గురించి... నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పమంటే నేను సంగీతం అనే చెబుతాను. సంగీతం సమక్షంలో ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తాను. ఆనందిస్తాను. ఈ ప్రపంచంలో మ్యూజిక్‌తో దేన్ని కంపేర్ చేయలేం. అదో గొప్ప ప్రపంచం... అంతే!