‘మేరా సాయా’కు మేగ్నట్‌లా అతుక్కుపోయా!
కీరవాణి
అమితంగా ఆకర్షించిన సినీ గీతం
నేను ఇంటర్ చదువుతున్న రోజులవి. రేడియోలో ఏవో హిందీ పాటలు వస్తుంటే వింటున్నాను. ‘మేరా సాయా’ అనే సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘తూ జహా... జహా ఛలేగా... మేరా సాయా సాథ్ హోగా’ పాట మొదలైంది. దాని అర్థం నాకు తెలియదు కానీ, ఆ పాటలోని మెలోడీకి మేగ్నట్‌లా అతుక్కుపోయాను. ఇప్పటికీ ఆ పాట విన్నప్పుడల్లా నాలో అదే ఫీలింగ్. లత పాడిన తీరు, సంగీత దర్శకుడు మదన్‌మోహన్ కంపోజ్ చేసిన విధానం, ముఖ్యంగా పాటలో వయొలిన్‌లను వాడిన శైలితో... ఆ పాట నన్ను వశపరుచుకుంది.
అభిమాన గాయనీ గాయకులు
నాటి తరంలో పి. సుశీల, ఆశా భోంస్లే. నేటి తరంలో బాంబే జయశ్రీ, శ్రుతీ పాఠక్. ఇక మేల్ సింగర్స్ విషయానికొస్తే... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, భీమ్‌సేన్ జోషీ, కిశోర్ కుమార్.
ఫేవరెట్ మ్యూజిక్ డెరైక్టర్స్
నుస్రత్ ఫతే అలీఖాన్, ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్
అభిమానించే ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్: వయొలిన్‌లో మేరునగధీరుడైన ద్వారం వెంకటస్వామి నాయుడు
ఇష్టమైన రాగం: కల్యాణి ప్రియమైన తాళం: ఆది తాళం
నొటేషన్ కాదు కొటేషన్:
‘‘కళ్లు మూసుకుని చెవులతో మాత్రమే సంగీతాన్ని ఆస్వాదించేవాడు నా దృష్టిలో నిజమైన మ్యూజిక్ లవర్. పాట వింటున్నప్పుడు హీరో గుర్తుకు రాకూడదు. డాన్స్, దేహ సౌందర్యం, మేకప్, లైట్లు, లేజర్ బీమ్స్, కులం, మతం, ప్రాంతం... ఇవేవీ గుర్తుకు రాకూడదు. నిజ మైన సంగీతాస్వాదన అలాగే ఉంటుంది.’’