Training Arrangement
-
ఏఐ ఫండ్‌కు గూగుల్ రూ.వెయ్యి కోట్లు! ఏం చేస్తారంటే..
యూఎస్‌లో జరిగిన ‘యూఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో ‘గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్’ పేరుతో గూగుల్ సీఈఓ సుందర్‌పిచాయ్ 120 మిలియన్ డాలర్ల(రూ.వెయ్యి కోట్లు) నిధిని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో ఏఐ ఎడ్యుకేషన్, ట్రెయినింగ్ కోసం దీన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.న్యూయార్క్‌లో జరిగిన 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు పాల్గొన్నారు. ‘యూఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో భాగంగా ‘గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్’ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈఓ సుందర్‌పిచాయ్ ప్రకటించారు. గూగుల్ తరఫున ఈ ఫండ్‌లో భాగంగా 120 మిలియన్ డాలర్లు(రూ.వెయ్యి కోట్లు) సమకూరుస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో ఏఐ ఎడ్యుకేషన్, ట్రెయినింగ్ కోసం దీన్ని ఖర్చు చేస్తామన్నారు. ఇందుకోసం లాభాపేక్షలేని సంస్థలు, ఎన్జీఓలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని తెలిపారు. ఈ ఏఐ ఎడ్యుకేషన్, శిక్షణను స్థానిక భాషల్లో అందిస్తామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్!ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా 15 గూగుల్ ఉత్పత్తులు ఒక్కోటి 50 కోట్ల వినియోగదారుల చొప్పున సేవలందిస్తోంది. వాటిలో ప్రధానంగా గూగుల్ సెర్చింజన్, మ్యాప్స్, డ్రైవ్ ఉన్నాయి. కంపెనీ రెండు దశాబ్దాలుగా ఏఐ సెర్చ్, టెక్నాలజీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెడుతోంది. ఏఐని ఉపయోగించి గతేడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి అందుబాటులో ఉండే 110 కొత్త భాషల్లోకి గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను విస్తరించాం. దాంతో ప్రస్తుతం గూగుల్ సేవలందించే ఈ భాషల సంఖ్య 246కు చేరుకుంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 1,000 భాషల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఏఐ ప్రపంచ శ్రామిక ఉత్పాదకతను 1.4 శాతం పాయింట్లకు పెంచుతుంది. రాబోయే దశాబ్దంలో ఏఐ ప్రపంచ జీడీపీ ఏడు శాతం పెరిగేలా తోడ్పడుతుంది. ఉదాహరణకు ప్రపంచంలో కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాఫిక్ రద్దీ పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో కార్యకలాపాలు, లాజిస్టిక్‌లను మెరుగుపరచడంలో ఏఐ సాయం చేస్తోంది’ అన్నారు. -
ఆర్మీ ర్యాలీలో ‘సింగరేణి’ ప్రతిభ
సింగరేణి(కొత్తగూడెం)/గోదావరిఖని: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ పొందిన యువత అధిక సంఖ్యలో అర్హత సాధిస్తోంది. సింగరేణి సంస్థవ్యాప్తంగా 450 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి శ్రీరాంపూర్, కొత్తగూడెం, రామగుండం–2 ఏరియాల రీజినల్ క్యాంపుల్లో శిక్షణనిచ్చింది. వీరిలో 240 మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. కరీంనగర్లో ఈ నెల 7న ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 17వ తేదీ వరకు జరగ నుంది. సింగరేణి ద్వారా శిక్షణ పొందిన యువకులు.. ఈ నెల 13వ తేదీ వరకు శరీర ధారుడ్య పరీక్షకు187 మంది హాజరు కాగా 107 మంది అర్హత సాధించారు. శ్రీరాంపూర్ రీజియన్ నుంచి 66 మంది హాజరుకాగా 43 మంది, ఆర్జీ–2 రీజియన్ నుంచి 65 మంది హాజరుకాగా 38 మంది, కొత్తగూడెం రీజియన్ నుంచి 56 మంది హాజరుకాగా 26 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మెడికల్ పరీక్షకు ఎంపికయ్యారు. మిగిలిన ఐదు రోజుల్లో మరో 50 మంది సింగరేణి అభ్యర్థులు ర్యాలీకి హాజరుకానున్నారు. దశలవారీగా నిర్వహిస్తున్న పరీక్షల్లో ఇప్పటికే సింగరేణి ప్రాంత యువత 30 మంది ఎంపికయ్యారని కోఆర్డినేషన్ జీఎం ఆంటోనిరాజా వెల్లడించారు. ఆర్మీ ర్యాలీలో ఎంపికైన అభ్యరులకు నవంబర్ 24వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ‘సింగరేణి’అభ్యర్థులకు ఆర్జీ–2 ఏరియాలోని యైటింక్లయిన్‌కాలనీలో ఈ నెల 20వ తేదీ నుంచి రెసిడెన్షియల్ తరహాలో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్తిస్తామని అధికారులు తెలిపారు. -
సర్వం సిద్ధం
జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్లను స్వీకరించే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరిజాశంకర్ పేర్కొన్నారు. పటిష్టమైన బందోబస్తుతో పాటు ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిల్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ బృందాలు 24 గంటలూ పనిచేస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని ఎనిమి ది మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు మూడు వార్డులకో అసిస్టెంట్ ఎన్నికల అధికారి చొప్పున 96మందిని నియమించి, వారికి ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి గిరిజాశంకర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారులే నామినేషన్ల స్వీకరణతో పాటు పరిశీలన, ఉపసంహరణ, బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని చె ప్పారు. పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు 2800మంది సిబ్బంది నియామకాన్ని పూర్తి చేశామని, వారందరికీ త్వరలోనే శిక్షణ ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తామన్నారు.అయిజలో నామినేషన్లు వేసేందుకు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు. ఇతర మున్సిపాలిటీల్లో ఆయా మున్సిపల్ , నగర పంచాయతీ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్ల వరకు వేసుకోవచ్చని, అంతకంటే ఎక్కువగా వేస్తే వాటిని తిరస్కరిస్తామని తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్థులకు స్థానిక మున్సిపాలిటీలో ఓటు కలిగి ఉండి, మున్సిపల్ పరంగా పన్నులన్నింటినీ పూర్తిగా చెల్లించి ఉండాలని పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థిని అదే వార్డుకు చెందిన ఇద్దరు ఓటర్లు బలపర్చాలన్నారు. ఫిబ్రవరి 28 వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారికే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. సోమవారం నుంచి ఎన్నికలు ముగిసే వరకు అభ్యర్థుల ఖర్చును పరిగణలోకి తీసుకుంటామని, ఈసీ నిబంధనల ప్రకారం ఒక్కో వార్డు అభ్యర్థి ఖర్చు లక్ష రూపాయలు దాటరాదని వెల్లడించారు.