జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్లను స్వీకరించే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరిజాశంకర్ పేర్కొన్నారు. పటిష్టమైన బందోబస్తుతో పాటు ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిల్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ బృందాలు 24 గంటలూ పనిచేస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని ఎనిమి ది మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు మూడు వార్డులకో అసిస్టెంట్ ఎన్నికల అధికారి చొప్పున 96మందిని నియమించి, వారికి ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి గిరిజాశంకర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారులే నామినేషన్ల స్వీకరణతో పాటు పరిశీలన, ఉపసంహరణ, బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని చె ప్పారు.
పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు 2800మంది సిబ్బంది నియామకాన్ని పూర్తి చేశామని, వారందరికీ త్వరలోనే శిక్షణ ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తామన్నారు.అయిజలో నామినేషన్లు వేసేందుకు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు. ఇతర మున్సిపాలిటీల్లో ఆయా మున్సిపల్ , నగర పంచాయతీ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్ల వరకు వేసుకోవచ్చని, అంతకంటే ఎక్కువగా వేస్తే వాటిని తిరస్కరిస్తామని తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్థులకు స్థానిక మున్సిపాలిటీలో ఓటు కలిగి ఉండి, మున్సిపల్ పరంగా పన్నులన్నింటినీ పూర్తిగా చెల్లించి ఉండాలని పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థిని అదే వార్డుకు చెందిన ఇద్దరు ఓటర్లు బలపర్చాలన్నారు. ఫిబ్రవరి 28 వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారికే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. సోమవారం నుంచి ఎన్నికలు ముగిసే వరకు అభ్యర్థుల ఖర్చును పరిగణలోకి తీసుకుంటామని, ఈసీ నిబంధనల ప్రకారం ఒక్కో వార్డు అభ్యర్థి ఖర్చు లక్ష రూపాయలు దాటరాదని వెల్లడించారు.
సర్వం సిద్ధం
Published Mon, Mar 10 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
Advertisement
Advertisement