Pixel
-
దేశీ స్టార్టప్‌కు నాసా కాంట్రాక్టు
న్యూఢిల్లీ: దేశీ ప్రైవేట్ స్పేస్‌క్రాఫ్ట్ స్టార్టప్ సంస్థ పిక్సెల్ తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు భూగోళ పరిశీలన డేటా సంబంధ సర్వీసులను అందించే కాంట్రాక్టు దక్కించుకుంది. 476 మిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టుకు సంబంధించి మొత్తం ఎనిమిది కంపెనీలు ఎంపికవగా, వాటిలో పిక్సెల్ కూడా ఒకటి. భూమిపై జీవనాన్ని మెరుగుపర్చేందుకు నాసా సాగిస్తున్న పరిశోధన కార్యకలాపాలకు ఉపయోగపడేలా ఈ కంపెనీలు ఎర్త్–అబ్జర్వేషన్ డేటాను అందిస్తాయి. కాంతి తరంగధైర్ఘ్యాల వ్యాప్తంగా ఉండే డేటాను హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజ్‌ల రూపంలో సేకరించి, వాతావరణ మార్పులు, వ్యవసాయం, జీవ వైవిధ్యం, వనరుల నిర్వహణ మొదలైన వాటి సూక్ష్మ వివరాలను పిక్సెల్ టెక్నాలజీ అందిస్తుంది.ఇదీ చదవండి: నాలుగేళ్లలో రెట్టింపు ఎగుమతులునేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) కాంట్రాక్టు దక్కడంపై పిక్సెల్ సహ–వ్యవస్థాపకుడు అవైస్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్ష ఆధారిత భూ పరిశోధనల్లో హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ కీలకంగా మారబోతోందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మరింత అధిక రిజల్యూషన్‌తో ఇమేజ్‌లు ఇచ్చే ఫైర్‌ఫ్లైస్ ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు పిక్సెల్ తెలిపింది. భూగోళ అధ్యయనానికి అవసరమయ్యే వివరాలను తక్కువ వ్యయాలతో సేకరించేందుకు తాజా కాంట్రాక్టు ఉపయోగపడగలదని నాసా పేర్కొంది. -
గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: సెలబ్రిటీలు ఉపయోగించే స్మార్ట్ఫోన్లపై ఆసక్తి ఉంటుంది. అందులోనూ టెక్ నిపుణులు, స్వయంగా స్మార్ట్‌ఫోన్ మేకర్స్ తమ సొంత ఫోన్లనే వాడతారా లేక వేరే కంపెనీలవి వాడతారా అనేది ఆరా తీస్తాం. తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దీనికి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు. గూగుల్ కంపెనీ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘పిక్సెల్ ఫోల్డ్’ను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వార్షిక డెవలపర్ల సమావేశంలో పిక్సెల్ ఫోల్డ్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సందర్ పిచాయ్ స్వయంగా పిక్సెల్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా అనుమానం రాకమానదు. ఈ క్రమంలో అడిగిన ప్రశ్నకు సుందర్ పిచాయ్ తనదైన శైలిలో జవాబు చెప్పారు. గూగుల్ ఉత్పత్తులను వినియోగించే తొలి యూజర్లలో తానూ ఒకడినని వెల్లడించారు. గూగుల్ ఇటీవల విడుదల అయిన పిక్సల్ ఫోల్డ్ , పిక్సల్ 7ఏ ఫోన్లను (టెస్టింగ్) వినియోగిస్తున్నట్టు చెప్పారు. (Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పిచాయ్ తాను పిక్సెల్ ఫోల్డ్‌ను చాలా కాలంగా పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. అయితే గూగుల్ పిక్సల్ 7 ప్రోను తన ప్రైమరీ ఫోన్‌గా వినియోగిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ నుంచి, కొత్త గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, ఐఫోన్దాకా దాదాపు అన్ని ఫోన్లను టెస్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మల్టీటాస్కింక్, ఒకేసారి వివిధ యాప్‌లలో పని చేయడానికి పిక్సెల్ ఫోల్డ్ వాడడాన్ని ఇష్టపడతారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వేర్వేరు సిమ్ కార్డులకు వేర్వేరు ఫోన్లను వినియోగిస్తానన్నారు. (Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్‌లో ఉద్యోగులు!) ఇక స్మార్ట్ఫోన్ల భవిష్యత్తుపై మాట్లాడిన సుందర్ పిచాయ్ ప్రజల అవసరాలకు అనుగుణంగా వారు మెచ్చే స్మార్ట్ఫ్లోన్లను అందించాలనుకుంటున్నామని, ఇందులో ఫోల్డబుల్ ఫోన్లు మాత్రమే తమ అంతిమ లక్ష్యం కాదని చెప్పుకొచ్చారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) సాంకేతికత ప్రారంభ దశలో ఉన్న ఈనాటిలా కాకుండా ఏఐ మరింత నేచురల్‌గా ఉండబోతోందన్నారు. రానున్న సంవత్సరాల్లో మరింత ఇంటరాక్టివ్‌గా, సహజమైన భాషలతో ఫోన్లు ప్రతిదీ అర్థం చేసుకునేలా ఉంటుందన్నారు. అలాగే ఇప్పటివరకు మానవులు ఏఐకి అనుగుణంగా ఉన్నారు.కానీ అయితే భవిష్యత్తులో ఏఐ అనేది మానవులకు అనుగుణంగా మారిపోయేలా కంప్యూటర్లను ఎనేబుల్ చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, సక్సెస్ స్టోరీలు, ఇతర అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి,బిజినెస్ View this post on Instagram A post shared by Arun Maini (@mrwhosetheboss) -
ఐఫోన్ 15 ప్రో మాక్స్ కొత్త ఫీచర్స్...
-
ఓ ఫర్ ఓరియో వచ్చేసింది...కానీ..
సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓ (O) 8.0 ను విడుదల చేసింది. అందరూ ఊహించినట్టుగా ఈ కొత్త ఓఎస్‌కు ఓరియో (Oreo) అని గూగుల్ పేరు పెట్టింది. అయితే ఈ కొత్త ఆండ్రాయిడ్ ఓ (O) 8.0 ముందుగా నెక్సస్ , పిక్సెల్ డివైస్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్ 5ఎక్స్, నెక్సస్ 6పి, నెకసస్ ప్లేయర్, పిక్సెల్ సి, పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ డివైస్‌లలో ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) రూపంలో అందుబాటులో ఉంటుందని గూగుల్ వెల్లడించింది. ఎసెన్షియల్, హువాయ్, హెచ్‌టిసి, క్యోసెరా, మోటరోలా, హెచ్ఎమ్డి గ్లోబల్ హోమ్ ఆఫ్ నోకియా ఫోన్లు, శాంసంగ్, షార్ప్, సోనీ ఆండ్రాయిడ్ ఒరియో అప్‌గ్రేడ్ ఉంటుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ఇంజనీరింగ్) డేవ్ బుర్కే లాంచింగ్ సందర్భంగా ప్రకటించారు. ఓ ఫర్ ఓరియో అంటూ కొత్త ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ప్రకటించింది. తమకొత్త ఆండ్రాయిడ్ 8.0 ఓఎస్ స్మార్టర్, ఫాస్టర్, మోర్ పవర్ఫుల్, అండ్ స్వీటర్ దేన్ ఎవర్ అని పేర్కొంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే పిక్చర్-ఇన్-పిక్చర్, నోటిఫికేషన్ డాట్స్, ఆటోఫిల్, ఇంటిగ్రేటెడ్ ఇన్స్టెంట్ యాప్స్ , గూగుల్ ప్లే ప్రొటెక్ట్, వేగవంతమైన బూట్ టైమ్ లాంటి ఫీచర్లను ఇందులో జోడించింది. ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఫీచర్లు డివైస్ బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువగా వచ్చేలా, బ్యాటరీ ఉపయోగాన్ని నియంత్రించేలా ఆండ్రాయిడ్ 8.0ను తీర్చిదిద్దారు. దీంతో డివైస్‌లలో బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది. నోటిఫికేషన్ కంట్రోల్ కోసం కొత్తగా నోటిఫికేషన్ చానల్స్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒకే యాప్ నుంచి వచ్చే మెసేజ్‌లు కొత్త లుక్‌లో, ఒకే గ్రూప్‌లో కనిపిస్తాయి. డివైస్‌లో ఉండే ఆటోఫిల్ సదుపాయాన్ని మరింత సులభంగా వాడుకునేలా తీర్చిదిద్దారు. యూజర్ తన ఫోన్ నంబర్లు, కార్డు నంబర్లు, చిరునామా, పాస్వర్డ్లు ఎంటర్ చేసే సమయంలో వాటిని స్టోర్ చేసుకోవాలా, వద్దా అనే ఆప్షన్‌ను ఆటో ఫిల్ ఇస్తుంది. దీంతో ఆటో ఫిల్‌ను ఎంచుకుంటే సదరు సమాచారం సేవ్ అవుతుంది. దాన్ని కావాలనుకున్నప్పుడు వేరే యాప్‌లో, సైట్లలో వాడుకోవచ్చు. ఫాంలో ఆటోఫిల్‌ను సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతాయి. ఆండ్రాయిడ్ 8.0లో కొత్తగా పిక్చర్ ఇన్ పిక్చర్ (పీఐపీ) ఫీచర్ ద్వారా ఫొటోలు, వీడియోలు చూస్తూ కూడా కాల్స్ ఆన్సర్ చేయవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. భిన్నమైన ఫొటో సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఎడిట్ చేసిన వివిధ రకాల ఫొటో ఫార్మాట్లలో ఉన్న ఇమేజ్‌లను కూడా వేగంగా ఓపెన్ చేసుకునేలా ఆండ్రాయిడ్ 8.0ను తీర్చిదిద్దారు. డాటా ఈజీ పెయిరింగ్ సౌలభ్యం కూడా ఉంది. డివైస్‌లో బ్రౌజర్‌ను ఓపెన్ చేసి సైట్లను దర్శిస్తున్నప్పుడు డివైస్ వైరస్ల బారిన పడకుండా ఉండేలా గూగుల్ సేఫ్ బ్రౌజింగ్‌ను ఆండ్రాయిడ్ 8.0లో అందుబాటులోఉంటుంది. పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా 2 రెట్లు యాప్‌లు వేగంగా ఓపెన్ అయ్యేలా ఆండ్రాయిడ్ 8.0 ను డెవలప్ చేశారు. కాగా ప్రస్తుతానికి పిక్సెల్, నెక్సెస్ డివైస్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఓఎస్ ఇతర డివైస్‌లలో అందుబాటులోకి వచ్చేంతవరకు మిగిలిన యూజర్లు వెయిట్ చేయక తప్పదు మరి.