సాక్షి, ముంబై: వీయూ టెలివిజన్స్ 43 అంగుళాల సరికొత్త టీవీని ప్రారంభించింది. ముఖ్యంగా అధునాతన క్రికెట్ మోడ్ ,సినిమా మోడ్‌తో ఈ అద్భుతమైన టీవీని లాంచ్ చేసింది. వీయూ గ్లో ఎల్‌ఈడీ టీవీ నవంబర్ 27 నుండి మధ్యాహ్నం నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీని ధర 29,999గా ఉంచింది.
వీయూ గ్లో ఎల్‌ఈడీ టీవీ ఫీచర్లు
ఈ టీవీలో తాజా గూగుల్ టీవీ ఓఎస్‌తోపాటు ఏఐ ప్రాసెసర్‌తో కూడిన గ్లోప్యానెల్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ కోర్ GPU, డాల్బీ అట్మోస్ వర్చువలైజేషన్‌తో వస్తుంది. తమ ఏఐ ప్రాసెసర్ ద్వారా ఓటీటీ కంటెంట్ మరింత మెరుగు పడుతుందనీ, అలాగే అధునాతన క్రికెట్ మోడ్‌తో వినియోగదారులు ప్రత్యక్ష స్టేడియం అనుభవాన్ని, 100 శాతం బాల్ విజిబిలిటీని పొందుతారనీ, డీజీ సబ్ వూఫర్, సొగసైన ఫ్రేమ్‌తో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాల్యూమ్ 100 శాతం పెంచినా కూడా తమ టీవీలోని సౌండ్ వైబ్రేట్ అవ్వదని తెలిపింది. 84వాట్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇచ్చేలా రెండు స్పీకర్‌లతో కూడిన ఇన్‌బిల్ట్ సౌండ్‌బార్‌ను ఇందులో జోడించింది.
కేవలం రెండు నెలల్లో 46675 యూనిట్లను విక్రయించామనీ, 2023లో రెండు లక్షల టీవీలను విక్రయించాలని భావిస్తున్నామని వీయూ టెక్నాలజీస్ సీఈఓ అండ్ ఛైర్మన్ దేవితా సరాఫ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment