Vu
-
రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే..
ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ.. చాలా మంది సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. కొందరికి వ్యాపారాలు వారసత్వంగా వస్తే.. మరి కొందరు జీరో నుంచి ప్రారంభమవుతారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు 'దేవిత సరఫ్' (Devita Saraf). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె బిజినెస్ బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1981 జూన్ 25న ముంబైలో జన్మించిన 'దేవిత సరఫ్' క్వీన్ మేరీ స్కూల్లో చదివింది, ఆ తరువాత హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే బిజినెస్ మీద పట్టు సాధించిన దేవిత చదువు పూర్తయిన తరువాత కేవలం 24 సంవత్సరాల వయసులోనే.. టీవీలను తయారు చేయడానికి ఒక కంపెనీని ప్రారంభించింది. దేవిత సరఫ్ తండ్రి రాజ్‌కుమార్ సరఫ్.. జెనిత్ కంప్యూటర్స్ బిజినెస్ ప్రారంభించారు. తండ్రి వ్యాపారంలో చిన్నప్పటి నుంచి సహాయం చేయడం అలవాటు చేసుకున్న దేవితా.. టెక్నాలజీ వ్యాపారంలో కొంత నైపుణ్యం సంపాదించింది. అంతే కాకుండా ఈమె తన అన్నయ్యతో కలిసి ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇతర సమావేశాలకు వెళ్లడం వల్ల వ్యాపారంలోని చిక్కులను గురించి తెలుసుకుంది. కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేసిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చి.. 'వియు' (VU) గ్రూప్ పేరుతో టీవీలను తయారు చేసే కంపెనీ ప్రారంభించింది. ప్రారంభంలో వ్యాపారం కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, అతి తక్కువ కాలంలోనే బాగా పుంజుకుంది. నేడు ఈ సంస్థ విలువ ఏకంగా రూ. 1000 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్ వియు కంపెనీ టీవీలను కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని దాదాపు 60 దేశాల్లో విక్రయిస్తోంది. అయితే మనదేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీ బ్రాండ్‌గా వియు అవతరించింది. కంపెనీ అభివృద్ధి విశేషమైన కృషి చేసిన దేవితను ఫార్చ్యూన్ ఇండియా (2019) భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ఒకరుగా ప్రకటించింది. -
‘వ్యూ’ లక్ష్యం రూ.1,000 కోట్లు
ముంబై: టీవీల తయారీలో ఉన్న వ్యూ టెలివిజన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో రూ.1,000 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. ‘కంపెనీ లాభదాయకంగా ఎదగాలని కోరుకుంటోంది. అది నిలకడగా లేకుంటే మార్కెట్ వాటా కోసం వెంబడించబోము’ అని సంస్థ ఫౌండర్, చైర్పర్సన్ దేవితా షరాఫ్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక, వ్యూహాత్మక వాటాదారుల కోసం వెతకడానికి ఇది సరైన సమయం అని ఆమె యోచిస్తున్నారు. ‘2022–23లో రూ.900 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లను దాటతాం. టర్నోవర్ గర్వం అయితే, లాభదాయకత చిత్తశుద్ధి లాంటిది. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం లాభాలు మూడు రెట్లు అధికం. లాభదాయకత కోసం ఎక్కువ శ్రద్ధ వహిస్తాం’ అని తెలిపారు. 40 లక్షలకుపైగా టీవీలు.. వ్యూ ఇప్పటి వరకు 40 లక్షల పైచిలుకు టీవీలను విక్రయించింది. 2022–23లో మొత్తం ఆదాయంలో 80 శాతం వాటా 50 అంగుళాలు ఆపైన సైజులో లభించే ప్రీమియం మోడళ్లు కైవసం చేసుకున్నాయి. ‘అన్ని టీవీ విభాగాల్లో ప్రీమియం కేటగిరీ అత్యంత లాభదాయకంగా ఉంటుంది. భారత్‌లో ఆదాయ స్థాయిలు పెరుగుతున్నందున టీవీ సెట్స్‌కు చాలా డిమాండ్ ఉంది. వినియోగ విధానాలు మారుతున్నాయి. లిమిటెడ్ ఎడిషన్‌లో రూ.20 లక్షల ధరతో 100 అంగుళాల టీవీని కొన్నేళ్ల క్రితం ప్రవేశపెట్టాం. 100 యూనిట్లు విక్రయించాం. 85 అంగుళాల టీవీలు 2012 నుంచి 5,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. వచ్చే ఒకట్రెండేళ్లలో 85, 98 అంగుళాల టీవీలు 10,000 యూనిట్ల అమ్మకాలను ఆశిస్తున్నాం’ అని దేవితా షరాఫ్ చెప్పారు. ధర పెంపు ప్రభావం ఉండదు.. ఈ మధ్యకాలంలో ప్యానెళ్ల ధరలు పెరిగాయి. అయితే కోవిడ్ కాలం మాదిరిగా ప్యానెళ్ల కొరత లేదని దేవితా షరాఫ్ తెలిపారు. ‘ధరల పెంపు కారణంగా వ్యూ వంటి ప్రీమియం బ్రాండ్ ప్రభావితం కాలేదు. కంపెనీ సేవలందించే వివేకం గల వినియోగదారులు ప్రపంచ పోకడలను అర్థం చేసుకోగలుగుతారు. తక్కువ ధర విభాగాల్లో పోటీపడే బ్రాండ్లకు ఇది కష్టంగా మారుతుంది. ఈ కంపెనీలు ధరపై మాత్రమే విక్రయించగలుగుతాయి’ అని వివరించారు. కంపెనీ తాజాగా 98, 85 అంగుళాల్లో నూతన టీవీల శ్రేణిని ప్రవేశపెట్టింది. ధర రూ.6 లక్షల వరకు ఉంది. -
24 ఏళ్లకే సీఈవో.. రూ.వెయ్యి కోట్ల కంపెనీ!
బిజినెస్ ప్రపంచంలో భారతీయ మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. కంపెనీలు స్థాపించి విజయవంతంగా వ్యాపారాలు నడిపిస్తున్నారు. 24 ఏళ్లకే కంపెనీ పెట్టి దాన్ని రూ.1000 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దిన ఓ యువతి కథ ఇది. (Free blue ticks: ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?) వీయూ(Vu) గ్రూప్ ఛైర్పర్సన్, సీఈవో అయిన దేవితా సరాఫ్ 24 ఏళ్ల వయసులో ఈ కంపెనీని ప్రారంభించారు. Vu టెలివిజన్ల ఆదాయం రూ. 1000 కోట్లు. ఆ కంపెనీ ఇప్పటివరకు 30 లక్షలకుపైగా టెలివిజన్లను విక్రయించింది. వీయూ టెలివిజన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న భారతీయ టీవీ బ్రాండ్. హురున్ రిపోర్ట్ 2020 ప్రకారం.. భారతదేశంలో స్వయంకృషితో ఎదిగిన 40 ఏళ్లలోపు మహిళల్లో దేవితా సరాఫ్ అత్యంత ధనికురాలు. ఫార్చ్యూన్ ఇండియా టాప్ 50 అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరు. దేవితా సరాఫ్‌ను ఫోర్బ్స్ 'ఇండియాస్ మోడల్ సీఈఓ'గా ఎంపిక చేసింది. (ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు.. వీరి వ్యాపారమేంటో తెలుసా?) దేవితా సరాఫ్ 2021లో ‘డైనమైట్ బై దేవితా సరాఫ్’అనే అనే పెర్ఫ్యూమ్ను ప్రారంభించారు. ఇది వ్యాపారంలో ఉన్న మహిళల కోసం రూపొందించిన ప్రపంచంలోనే మొట్ట మొదటి పెర్ఫ్యూమ్. కోవిడ్ సమయంలో స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేయడానికి దేవిత సరాఫ్ ఈ పెర్ఫ్యూమ్ బ్రాండ్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థిని అయిన దేవితా సరాఫ్ Vu గ్రూప్ సీఈవో మాత్రమే కాదు.. ఫ్యాషన్, లగ్జరీ ప్రపంచంలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. చాలా మంది ప్రసిద్ధ భారతీయ డిజైనర్లకు మోడల్‌గా ఉన్నారు. అనేక లగ్జరీ బ్రాండ్ల కోసం పనిచేశారు. నివేదికల ప్రకారం... దేవితా సరాఫ్ నికర ఆస్తి విలువ దాదాపు రూ.1800 కోట్లు. ఒడిస్సీ డ్యాన్సర్ కూడా అయిన ఆమె అంతర్జాతీయ హై ఐక్యూ మెన్సా సొసైటీలో సభ్యురాలు. -
వ్యూ నుంచి ప్రీమియం ఫీచర్లతో టీవీలు
హైదరాబాద్: వ్యూ టెలివిజన్స్ 2023 ఎడిషన్ ప్రీమియం టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో, బ్రైట్ డిస్ ప్లేతో, చక్కని సౌండ్ పరిజ్ఞానంతో, మంచి వీక్షణ అనుభవాన్నిస్తాయని సంస్థ ప్రకటించింది. 43 అంగుళాలు, 55 అంగుళాల సైజులో టీవీలను తీసుకొచ్చింది. (ఇదీ చదవండి: 7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!) వీటిల్లో ఏప్లస్ గ్రేడ్ 400 నిట్స్ అధిక బ్రైట్‌నెస్‌తో కూడిన ఐపీఎస్ డిస్ప్లే ఉంటుందని తెలిపింది. గూగుట్ టీవీ ఓఎస్‌తో, 50 వాట్ ఇన్‌బిల్ట్ సౌండ్‌బార్‌తో వస్తుందని పేర్కొంది. 43 అంగుళాల ధర రూ.23,999, 55 అంగుళాల టీవీ ధర రూ.32,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వూటీవీస్ డాట్ కామ్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. (జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్) -
కళ్ళు చెదిరే ధరలో.. 43 ఇంచెస్ LED TV..
-
క్రికెట్, సినిమా మోడ్‌తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!
సాక్షి, ముంబై: వీయూ టెలివిజన్స్ 43 అంగుళాల సరికొత్త టీవీని ప్రారంభించింది. ముఖ్యంగా అధునాతన క్రికెట్ మోడ్ ,సినిమా మోడ్‌తో ఈ అద్భుతమైన టీవీని లాంచ్ చేసింది. వీయూ గ్లో ఎల్ఈడీ టీవీ నవంబర్ 27 నుండి మధ్యాహ్నం నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీని ధర 29,999గా ఉంచింది. వీయూ గ్లో ఎల్ఈడీ టీవీ ఫీచర్లు ఈ టీవీలో తాజా గూగుల్ టీవీ ఓఎస్‌తోపాటు ఏఐ ప్రాసెసర్‌తో కూడిన గ్లోప్యానెల్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ కోర్ GPU, డాల్బీ అట్మోస్ వర్చువలైజేషన్తో వస్తుంది. తమ ఏఐ ప్రాసెసర్ ద్వారా ఓటీటీ కంటెంట్ మరింత మెరుగు పడుతుందనీ, అలాగే అధునాతన క్రికెట్ మోడ్‌తో వినియోగదారులు ప్రత్యక్ష స్టేడియం అనుభవాన్ని, 100 శాతం బాల్ విజిబిలిటీని పొందుతారనీ, డీజీ సబ్ వూఫర్, సొగసైన ఫ్రేమ్‌తో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాల్యూమ్ 100 శాతం పెంచినా కూడా తమ టీవీలోని సౌండ్ వైబ్రేట్ అవ్వదని తెలిపింది. 84వాట్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇచ్చేలా రెండు స్పీకర్లతో కూడిన ఇన్‌బిల్ట్ సౌండ్‌బార్‌ను ఇందులో జోడించింది. కేవలం రెండు నెలల్లో 46675 యూనిట్లను విక్రయించామనీ, 2023లో రెండు లక్షల టీవీలను విక్రయించాలని భావిస్తున్నామని వీయూ టెక్నాలజీస్ సీఈఓ అండ్ ఛైర్మన్ దేవితా సరాఫ్ తెలిపారు. -
వెరైటీ ఫీచర్లతో.. వీయు ప్రీమియం 4కె టీవీ..
సాక్షి, సిటీబ్యూరో:టీవీల ఉత్పత్తికి పేరొందిన వీయు టెలివిజన్ ఆధునిక టెక్నాలజీతో వీయు ప్రీమియం 4కె టీవీని రూపొందించింది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా వియు టెలివిజన్ సీఈఓ దేవిత సరఫ్ మాట్లడుతూ.. ఈ ప్రీమియం 4కె టీవీలో అత్యున్నత శ్రేణి ఫీచర్స్‌ను జోడించి, నూతన హంగులతో డిజైన్ చేశారు. దీన్ని 3 విభిన్న పరిమాణాల్లో (43, 50, 55 అంగుళాలు) çతయారు చేశామని, ఆండ్రాయిడ్ 9.0 సాంకేతికతతో, ప్రత్యేకమైన డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో రూపొందించామని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్‌పై ఫ్రీడెమో కెల్లీ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న అమీర్‌పేట్‌లో డిజిటల్ మార్కెటింగ్‌పై ఉచిత డెమోను ఇవ్వనున్నారు. ఇందులో డిజిటల్ మార్కెటింగ్‌లో భాగమైన ఎస్ఈఓ, ఎస్ఎమ్ఏ, ఎస్ఈఎమ్ తదితర అంశాలపైన అనుభవజ్ఞులతో శిక్షణ ఉంటుంది. కొత్తగా ఈ రంగంలో ఉద్యోగం ఆశిస్తున్నవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. స్వాద్ అప్నేపన్ కా... సాక్షి, సిటీబ్యూరో: ట్రాన్స్ జెండర్ల సమస్యలపై మానవతా దృక్పథంతో ఆలోచించాలనే సందేశంతో రూపొందించిన స్వాద్ అప్నేపన్ కా క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఒక్కరినీ ఆదరించాలనే ఆలోచనను కలిగించాలనే ఈ ప్రచార చిత్రం రూపకల్పన చేశామని, మనసున్న ప్రతి ఒక్కరికీ ఇది స్పందనలు కలిగిస్తుందని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. -
మార్కెట్లోకి మరో సూపర్ టీవీ వచ్చేసింది
సాక్షి, ముంబై: దేశీయ టీవీ మార్కెట్లో సూపర్ టీవీ లాంచ్ చేసింది. ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన వూ కంపెనీ దీనికి అప్‌గ్రేడెడ్‌గా వు 100 సూపర్ టీవీ పేరుతో మరో కొత్త టీవీని లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీ వచ్చే వారం నుండి భారతీయ వినియోగదారుల కోసం కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ 100 అంగుళాల 4 కె సూపర్ టీవీ ధర అక్షరాలా రూ. 8 లక్షలు. వు 100 సూపర్ టీవీ ఫీచర్లు 100 అంగుళాల 4కె డిస్ప్లే ఆండ్రాయిడ్, విండోస్ 10 ఆధారం ఇంటెల్ కోర్ ఐ 3 , కోర్ ఐ 5 ప్రాసెసర్ ఆప్షన్స్ 4జీబీ డిడిఆర్ ర్యామ్/ 120జీబీ ఆన్‌బోర్ట్ స్టోరేజ్ టీవీ ట్యూనర్ టెక్నాలజీన, స్కైప్ కాల్స్, వైర్లెస్ క్వార్ట్లీ కీబోర్డ్, ఎయిర్ మౌస్, రిమోట్ కంట్రోల్, డాల్బీ, డిటిఎస్ ఆడియో సపోర్ట్, ఇన్‌బిల్ట్ వూఫర్, 2,000 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో జెబీఎల్ స్పీకర్లు లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మెరుగైన మల్టీమీడియా అనుభవాన్ని అందించే ఈ సూపర్ టీవీ కనెక్టివిటీ పరంగా, మూడు యుఎస్బి పోర్ట్‌లు, బ్లూటూత్ వి 5.0, హెచ్డిఎంఐ,ఎవి, వైపిబిపిఆర్,ఆర్ఎఫ్ సపోర్ట్‌లతో పనిచేస్తుంది. లగ్జరీ, టెక్నాలజీ చాలా సాధారణంగా మారిన ప్రస్తుత తరుణంలో భారతదేశంలో ప్రీమియం టీవీ విభాగంలో లీడర్‌గా వుండటం గర్వంగా ఉందని వు టెలివిజన్ ఛైర్మన్ దేవితా సరాఫ్ తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అధిక నాణ్యత, విలాసవంతమైన వీక్షణ అనుభవాలను అందించడం కొనసాగించాలని ఆశిస్తున్నామన్నారు. కాగా వూ టెలివిజన్ ఇటీవల తన అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీని భారతదేశంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీవీ సిరీస్ అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంది. ఇవి మూడు వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో(32 అంగుళాల మోడల్ రూ.11,499కు, 40 అంగుళాల టీవీ రూ.18,999కు లభిస్తుంది. 43 అంగుళాల టీవీ రూ .20,999) లభిస్తుంది. -
100 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ, ధర వింటే షాక్
ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ భారత మార్కెట్లోకి వచ్చింది. పాపులర్ లగ్జరీ టెలివిజన్ బ్రాండ్ ఈ సరికొత్త స్మార్ట్ టీవీని వీయూ 100 పేరుతో మన మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ.20 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే తమ అత్యంత ఖరీదైన స్మార్ట్ టీవీగా కంపెనీ తెలిపింది. ఈ కొత్త టీవీ 100 అంగుళాల ప్యానల్, 224 ఐఫోన్ల సైజుతో సమానమని కంపెనీ అభివర్ణించింది. వీయూ సుపీరియర్ ప్యానల్ టెక్నాలజీతో ఇది రూపొందింది. 4కే ఆల్ట్రా హెచ్డీఆర్ డిస్ప్లేను ఇది కలిగి ఉంది. దీంతో ప్రీమియం వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను టెలివిజన్ వీక్షకులు పొందవచ్చు. 2.5 బిలియన్ కలర్స్‌ను ఇది రీప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టీవీ ద్వారా ఏ+ గ్రేడ్ ప్యానల్‌ను కంపెనీ అందిస్తోంది. 5 డోల్బే-సర్టిఫైడ్ స్పీకర్స్‌తో ఈ పెద్ద టీవీని వీయూ తీసుకొచ్చింది. ఇది ప్రతి స్వరం కూడా స్పష్టంగా వినిపించేలా.. 2000 వాట్ స్పీకర్స్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో స్మార్ట్ ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న ఈ టీవీ, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను, 2.5జీబీ ర్యామ్‌తో రూపొందింది. గూగుల్ ప్లే స్టోర్ ఇంటిగ్రేషన్, క్రోమోకాస్ట్ సపోర్ట్ ఈ డివైజ్‌లో ఉన్నాయి. వీయూ 100ను మొబైల్స్‌కు, ల్యాప్‌టాప్స్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్లతో లైటింగ్‌ను, ఎయిర్ కండీషనింగ్‌ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మూడు హెచ్డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్బీ పోర్ట్‌లు, హెచ్డీఎంఐ ఏఆర్సీ/సీఈబీ, బ్లూటూత్, వైఫై, ఏవీ ఇన్పుట్, ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఇది కలిగి ఉంది. యూట్యూబ్, హాట్‌స్టార్, హంగామా వంటి ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్స్‌తో ఇది వచ్చింది. దీని బరువు 104కేజీలు. వీయూ స్టోర్‌కి వెళ్లి, దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఏడాది వారెంటీతో ఇది లభ్యమవుతుంది. వీయూ అధికారిక స్టోర్లలో దీన్ని ప్రస్తుతం కంపెనీ అందిస్తుంది. పార్టనర్ల స్టోర్ల వద్ద కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. -
శాంసంగ్, ఎల్జీలకు వియూ చెక్ పెడుతుందా?
న్యూఢిల్లీ: స్మార్ట్ టీవీల రంగంలో శాంసంగ్, ఎల్జీ కు పోటీగా వియూ శరవేగంగా ముందుకొస్తోంది. తాజాగా వియూ టెక్నాలజీస్ మూడు టీవీలను మార్కెట్ లో లాంచ్ చేసిన మిగిలిన పోటీ సంస్థలకు భారీ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్స్ తో, తక్కువ ధరకే బడ్జెట్ స్మార్ట్ టీవీలతో వియూ వినియోగదారులను ఊరిస్తోంది. స్మార్ట్ ఫీచర్స్ ద్వారా అటు వినోదాన్ని, ఇటు సోషల్ మీడియాను టీవీ తెరపై వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ, టీవీ మార్కెట్ లో హల్ చల్ చేయడానికి సిద్ధమౌతోంది. 32 అంగుళం నుంచి 55 అంగుళాల పరిధిలో మూడు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వీటిధరలను రూ .20,000 నుంచి, రూ.52,000 గా నిర్ణయించింది. 32 అంగుళాల టీవీని అతి తక్కువ ధరలో రూ .20,000 లకే అందిస్తున్నట్టు వియు ప్రకటించింది. ప్రఖ్యాత వీడియో చానల్స్ యప్ టీవీ, రెడ్ బుల్ సహా, మిగిలిన అన్ని యాప్ లను ఈ టీవీలో అనుసంధానం చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, లాంటి సోషల్ మీడియా లకు కనెక్ట్ అవడమే కాకుండా, స్ర్కీన్ షేరింగ్ అవకాశం కూడా ఉందని తెలిపింది. క్వాడ్-కోర్ ఇంటర్నెట్ వీడియో ప్రాసెసర్ తో పూర్తి హెచ్‌డిలో కంటెంట్ తో రెండు టీవీలను అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ రోజు నుంచే ఈ టీవీలను బుక్ చేసుకోవచ్చు.