సాక్షి, ముంబై: దేశీయ టీవీ మార్కెట్‌లో సూపర్ టీవీ లాంచ్ చేసింది. ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసిన వూ కంపెనీ దీనికి అప్‌గ్రేడెడ్‌గా వు 100 సూపర్ టీవీ పేరుతో మరో కొత్త టీవీని లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీ వచ్చే వారం నుండి భారతీయ వినియోగదారుల కోసం కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ 100 అంగుళాల 4 కె సూపర్ టీవీ ధర అక్షరాలా రూ. 8 లక్షలు.
వు 100 సూపర్ టీవీ ఫీచర్లు
100 అంగుళాల 4కె డిస్‌ప్లే
ఆండ్రాయిడ్, విండోస్ 10 ఆధారం
ఇంటెల్ కోర్ ఐ 3 , కోర్ ఐ 5 ప్రాసెసర్ ఆప‍్షన్స్
4జీబీ డిడిఆర్ ర్యామ్/ 120జీబీ ఆన్‌బోర్ట్ స్టోరేజ్
టీవీ ట్యూనర్ టెక్నాలజీన, స్కైప్ కాల్స్, వైర్‌లెస్ క్వార్ట్లీ కీబోర్డ్, ఎయిర్ మౌస్, రిమోట్ కంట్రోల్, డాల్బీ, డిటిఎస్ ఆడియో సపోర్ట్, ఇన్‌బిల్ట్ వూఫర్, 2,000 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో జెబీఎల్ స్పీకర్లు లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మెరుగైన మల్టీమీడియా అనుభవాన్ని అందించే ఈ సూపర్ టీవీ కనెక్టివిటీ పరంగా, మూడు యుఎస్‌బి పోర్ట్‌లు, బ్లూటూత్ వి 5.0, హెచ్‌డిఎంఐ,ఎవి, వైపిబిపిఆర్,ఆర్‌ఎఫ్ సపోర్ట్‌లతో పనిచేస్తుంది. లగ్జరీ, టెక్నాలజీ చాలా సాధారణంగా మారిన ప్రస్తుత తరుణంలో భారతదేశంలో ప్రీమియం టీవీ విభాగంలో లీడర్‌గా వుండటం గర్వంగా ఉందని వు టెలివిజన్ ఛైర్మన్ దేవితా సరాఫ్ తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అధిక నాణ్యత, విలాసవంతమైన వీక్షణ అనుభవాలను అందించడం కొనసాగించాలని ఆశిస్తున్నామన్నారు.
కాగా వూ టెలివిజన్ ఇటీవల తన అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీని భారతదేశంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీవీ సిరీస్ అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంది. ఇవి మూడు వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో(32 అంగుళాల మోడల్ రూ.11,499కు, 40 అంగుళాల టీవీ రూ.18,999కు లభిస్తుంది. 43 అంగుళాల టీవీ రూ .20,999) లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment