బిజినెస్ ప్రపంచంలో భారతీయ మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. కంపెనీలు స్థాపించి విజయవంతంగా వ్యాపారాలు నడిపిస్తున్నారు. 24 ఏళ్లకే కంపెనీ పెట్టి దాన్ని రూ.1000 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దిన ఓ యువతి కథ ఇది.
(Free blue ticks: ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?)
వీయూ(Vu) గ్రూప్ ఛైర్‌పర్సన్, సీఈవో అయిన దేవితా సరాఫ్ 24 ఏళ్ల వయసులో ఈ కంపెనీని ప్రారంభించారు. Vu టెలివిజన్ల ఆదాయం రూ. 1000 కోట్లు. ఆ కంపెనీ ఇప్పటివరకు 30 లక్షలకుపైగా టెలివిజన్‌లను విక్రయించింది. వీయూ టెలివిజన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న భారతీయ టీవీ బ్రాండ్.
హురున్ రిపోర్ట్ 2020 ప్రకారం.. భారతదేశంలో స్వయంకృషితో ఎదిగిన 40 ఏళ్లలోపు మహిళల్లో దేవితా సరాఫ్ అత్యంత ధనికురాలు. ఫార్చ్యూన్ ఇండియా టాప్ 50 అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరు. దేవితా సరాఫ్‌ను ఫోర్బ్స్ 'ఇండియాస్ మోడల్ సీఈఓ'గా ఎంపిక చేసింది.
(ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు.. వీరి వ్యాపారమేంటో తెలుసా?)
దేవితా సరాఫ్ 2021లో ‘డైనమైట్ బై దేవితా సరాఫ్’అనే అనే పెర్ఫ్యూమ్‌ను ప్రారంభించారు. ఇది వ్యాపారంలో ఉన్న మహిళల కోసం రూపొందించిన ప్రపంచంలోనే మొట్ట మొదటి పెర్ఫ్యూమ్. కోవిడ్ సమయంలో స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేయడానికి దేవిత సరాఫ్ ఈ పెర్ఫ్యూమ్ బ్రాండ్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశారు.
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థిని అయిన దేవితా సరాఫ్ Vu గ్రూప్ సీఈవో మాత్రమే కాదు.. ఫ్యాషన్, లగ్జరీ ప్రపంచంలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. చాలా మంది ప్రసిద్ధ భారతీయ డిజైనర్లకు మోడల్‌గా ఉన్నారు. అనేక లగ్జరీ బ్రాండ్‌ల కోసం పనిచేశారు. నివేదికల ప్రకారం... దేవితా సరాఫ్ నికర ఆస్తి విలువ దాదాపు రూ.1800 కోట్లు. ఒడిస్సీ డ్యాన్సర్ కూడా అయిన ఆమె అంతర్జాతీయ హై ఐక్యూ మెన్సా సొసైటీలో సభ్యురాలు.
Comments
Please login to add a commentAdd a comment