televisions
-
బిగ్ స్క్రీన్ టీవీలకు బిగ్ డిమాండ్.. రూ.లక్షలు పెట్టి కొనేస్తున్నారు!
ఇల్లు చూడు.. ఇంటి అందం చూడు అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంతా టీవీ చూడు.. టీవీలో కనబడే పెద్ద బొమ్మ చూడు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీలు కొనేవారితో పోల్చితే ఇండియాలో పెద్ద స్కీన్ టీవీలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోందట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు చిన్న స్క్రీన్ టీవీలు కొనాలని అడిగే వారే లేరంటోంది ఓ రీసెర్చ్ సంస్ధ. ఇంతకీ ఇంతలా పెద్ద స్క్రీన్ టీవీలు ఎందుకు కొంటున్నారు? బిగ్ స్క్రీన్స్‌కు బిగ్ డిమాండ్ కార్ల కంటే కూడా ఇండియన్స్ బిగ్ స్క్రీన్ టీవీలను కొనుగోలు చేసేందుకు తెగ ఉత్సాహపడుతున్నారని ఒక సర్వే తేల్చింది. కొంత మంది చిన్న కార్ల ధరలో టీవీలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. సాధారణంగా 3, 4 లక్షల నుంచి 75 లక్షలు ధరల కలిగిన టీవీ మార్కెట్ విపరీతంగా పెరుగుతోందట. ఒటీటీలు వచ్చిన తరువాత చాలా మంది ఇండ్లలోనే హోమ్థియేటర్స్ ఏర్పాటు చేసుకుని చూడటానికి ఇష్టపడటమే ఇందుకు కారణంగా కనపడుతోంది. కరోనా సమయంలో చాలా మంది ఇంటికే పరిమితమవడం ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద టీవీలను కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది. 65 ఇంచుల టీవీలను ఎగబడి కొంటున్నారు.. జిఎఫ్‌కె మార్కెట్ రీసెర్చ్ ప్రకారం 65 ఇంచుల టీవీలు కొనుగోలు చేయడానికి జనాలు తెగ ఉత్సాహం చూపుతున్నారట దీంతో ఈ మార్కెట్ 37శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక రోజు రోజుకు చిన్నటీవీల మార్కెట్ తగ్గుతూవస్తోంది. ఈ టీవీలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపేవారే కరువయ్యారట. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో ఓవరాల్‌గా టీవీ మార్కెట్ 13 శాతం వృద్ధి సాధించింది. ఇందులో బిగ్ స్క్రీన్ మార్కెట్ వాటా 17శాతం దాకా ఉంది. కోవిడ్ కంటే ముందు ఈ వాటా కేవలం 5శాతానికి మాత్రమే పరిమితమైంది. Additional Big TV Screen pic.twitter.com/RrLJdJoyPx — rajinder kumar (@rajinder75kumar) July 7, 2023 రూ. 75 లక్షల టీవీ అమ్మకాలకు ఫుల్ క్రేజ్ ఇక వినియోగదారుల ఇష్టానికి అనుగుణంగా బ్రాండెడ్ టీవీ కంపెనీలు సైతం పెద్ద పెద్ద స్కీన్స్ ఇండియాలో లాంచ్ చేసేందుకు తెగ ఆరాటపడుతున్నాయి. ఎల్జీ కంపెనీ ఇప్పటికే భారీ తెర కలిగిన ఓఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. ఇండియాలో ఈ టీవీనే అత్యంత ఖరీదైన టీవీ . ఈ టెలివిజన్ ధర 75 లక్షలుగా ఉంది. దీన్ని ఎలా అంటే అలా చుట్టేయవచ్చు. అంతేకాదు దేశంలోని టాప్ టీవీల అమ్మకం కంపెనీ సైతం నెలకు 20 యూనిట్లు 20 లక్షల ధర కలిగిన టీవీల అమ్మకాలు చేపడుతుండగా, 10 లక్షలకు పైగా ధర ఉన్న టీవీలను నెలకు 100 దాకా అమ్ముతోంది. ఈ దీపావళికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది. టెలివిజన్ తయారీ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా వారి వారి లగ్జరీ లైఫ్ కు అనుగుణంగా ఇంట్లో ఉండే టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్లెక్సీ ఈఎమ్ఐల రూపంలో కంపెనీలు టీవీల అమ్మకాలు చేయడం కూడా వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడానికి కారణంగా కనపడుతోంది. కేవలం బ్రాండెడ్ టీవీలే కాకుండా దేశీ బ్రాండ్ టీవీలు సైతం లోకల్ మార్కెట్లో అందుబాటులోకి రావడంతో చాలా మంది తక్కువ ధరకే పెద్దస్క్రీన్ టీవీలను కొనుగోలు చేస్తున్నారని జిఎఫ్‌కె రీసెర్చ్ తెలిపింది. బిగ్ స్క్రీన్ టీవీల మార్కెట్ విలువ 32 బిలియన్ డాలర్లు ఇండియాలో స్మార్ట్ టీవీ మార్కెట్ సైజ్ 2022లో 9.88 బిలియన్ డాలర్లు కాగా 2023 చివరి నాటికి అది 11.7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2023-2030 నాటికి ఇండియా టీవీ మార్కెట్ 16.7 శాతం వృద్ధితో 32.57 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందనేది నిపుణులు చెపుతున్నమాట. భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కింద టీవీ తయారీ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలిస్తే తయారీ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పైగా టీవీలలో వాడే చిప్‌లు ఇండియాలోనే తయారవుతుండటం టీవీ తయారీ కాంపోనెంట్స్ దిగుమతులు తగ్గుతుండటంతో అతిపెద్ద టీవీ స్క్రీన్స్‌కు ధర మరింతగా తగ్గే అవకాశం ఉంది. - రాజ్ కుమార్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్, బిజినెస్, సాక్షి టీవీ -
24 ఏళ్లకే సీఈవో.. రూ.వెయ్యి కోట్ల కంపెనీ!
బిజినెస్ ప్రపంచంలో భారతీయ మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. కంపెనీలు స్థాపించి విజయవంతంగా వ్యాపారాలు నడిపిస్తున్నారు. 24 ఏళ్లకే కంపెనీ పెట్టి దాన్ని రూ.1000 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దిన ఓ యువతి కథ ఇది. (Free blue ticks: ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?) వీయూ(Vu) గ్రూప్ ఛైర్పర్సన్, సీఈవో అయిన దేవితా సరాఫ్ 24 ఏళ్ల వయసులో ఈ కంపెనీని ప్రారంభించారు. Vu టెలివిజన్ల ఆదాయం రూ. 1000 కోట్లు. ఆ కంపెనీ ఇప్పటివరకు 30 లక్షలకుపైగా టెలివిజన్లను విక్రయించింది. వీయూ టెలివిజన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న భారతీయ టీవీ బ్రాండ్. హురున్ రిపోర్ట్ 2020 ప్రకారం.. భారతదేశంలో స్వయంకృషితో ఎదిగిన 40 ఏళ్లలోపు మహిళల్లో దేవితా సరాఫ్ అత్యంత ధనికురాలు. ఫార్చ్యూన్ ఇండియా టాప్ 50 అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరు. దేవితా సరాఫ్‌ను ఫోర్బ్స్ 'ఇండియాస్ మోడల్ సీఈఓ'గా ఎంపిక చేసింది. (ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు.. వీరి వ్యాపారమేంటో తెలుసా?) దేవితా సరాఫ్ 2021లో ‘డైనమైట్ బై దేవితా సరాఫ్’అనే అనే పెర్ఫ్యూమ్ను ప్రారంభించారు. ఇది వ్యాపారంలో ఉన్న మహిళల కోసం రూపొందించిన ప్రపంచంలోనే మొట్ట మొదటి పెర్ఫ్యూమ్. కోవిడ్ సమయంలో స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేయడానికి దేవిత సరాఫ్ ఈ పెర్ఫ్యూమ్ బ్రాండ్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థిని అయిన దేవితా సరాఫ్ Vu గ్రూప్ సీఈవో మాత్రమే కాదు.. ఫ్యాషన్, లగ్జరీ ప్రపంచంలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. చాలా మంది ప్రసిద్ధ భారతీయ డిజైనర్లకు మోడల్‌గా ఉన్నారు. అనేక లగ్జరీ బ్రాండ్ల కోసం పనిచేశారు. నివేదికల ప్రకారం... దేవితా సరాఫ్ నికర ఆస్తి విలువ దాదాపు రూ.1800 కోట్లు. ఒడిస్సీ డ్యాన్సర్ కూడా అయిన ఆమె అంతర్జాతీయ హై ఐక్యూ మెన్సా సొసైటీలో సభ్యురాలు. -
టెలివిజన్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: టీవీల తయారీలో ఉపయోగించే కీలకమైన ఓపెన్ సెల్ దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని మళ్లీ అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశీయంగా వీటిని తయారు చేసేందుకు మరికాస్త సమయం కావాలని గతేడాది పరిశ్రమ కోరడంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 దాకా కస్టమ్స్ సుంకం నుంచి కేంద్రం మినహాయింపునిచ్చినట్లు వివరించాయి. ఈ గడువు తీరిపోతుండటంతో అక్టోబర్ 1 నుంచి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, సుంకం విధింపుతో టీవీల ధరలు దాదాపు 4 శాతం దాకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 32 అంగుళాల టీవీల రేట్లు రూ. 600 మేర, 42 అంగుళాల టీవీ రేటు రూ. 1,200–1,500 దాకా పెరుగుతాయని పేర్కొన్నాయి. అయితే, ఓపెన్ సెల్ ప్రాథమిక ధరను బట్టి చూస్తే దిగుమతి సుంకం భారం రూ. 150–250కి మించదని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఓపెన్ సెల్ వంటి కీలకమైన ఉత్పత్తులను ఎల్లకాలం దిగుమతి చేసుకుంటూ ఉంటే దేశీయంగా టీవీల తయారీ రంగం ఎదగలేదని పేర్కొన్నాయి. ఇలాంటి వాటిని దేశీయంగా తయారు చేయడానికి సుంకం విధింపు తోడ్పడగలదని వివరించాయి. -
ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10 వేలు తగ్గింపు
సాక్షి, ముంబై : చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్ తన స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టి 5 వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై 10 వేల రూపాయల దాకా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన ఇండియా ద్వారా ఈ ఆఫర్లు అందుబాటులోఉంటాయని ప్రకటించింది. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ ర్యామ్ ఆప్షన్ ధర రూ .42,999. ఈ ఫోన్‌ను రూ.52,999 వద్ద లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 7 ప్రో 5,000 రూపాయల తగ్గింపుతో రూ .39,999 లభిస్తోది. దీని అసలు ధర రూ .44,999 వన్‌ప్లస్ 7 ప్రో 6జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .44,999 దిగి వచ్చింది. లాంచింగ్ ప్రైస్ రూ .48,999 వన్‌ప్లస్ 7టీ రూ. 34000కు లభ్యం అసలు ధర రూ. 37,000 హెచ్డీఎఫ్సీ కస్టమర్‌కు వన్‌ప్లస్ 7 టి, వన్‌ప్లస్ 7 ప్రో కొనుగోలుపై వరుసగా రూ .1,500, రూ .2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐని కూడా అందిస్తోంది. వీటితో పాటు, వన్‌ప్లస్ తన టెలివిజన్లలో డిస్కౌంట్లను కూడా ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ / డెబిట్ కార్డు ఉపయోగించి వన్‌ప్లస్ క్యూ 1 టీవీ కొనుగోలుచేసిన రూ .4 వేల తక్షణ తగ్గింపు లభిస్తుంది. క్యూ 1 ప్రో టీవీ కొనుగోలుదారులకు తక్షణమే రూ .5 వేల తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో క్యూ 1 టీవీ ధర రూ .69,899 గా, క్యూ 1 టీవీ ప్రో ధర రూ .99,899 గా ఉంది. Get never seen before offers on OnePlus 7 Pro and OnePlus 7T on https://t.co/B7g5OoPhD5 and Partner stores. Hurry ! Offers are valid till 2nd December only! Grab them here - https://t.co/oJYzYQLHM1#OnePlusLimitedPeriodSale pic.twitter.com/2auc9qpHfu — OnePlus India (@OnePlus_IN) November 24, 2019 -
చుట్టేయగల టెలివిజన్ వచ్చేసింది...
టెలివిజన్లు, కంప్యూటర్ తెరలు, మొబైల్ఫోన్లను కాగితం మాదిరిగ ఉండచుట్టేయవచ్చునని చాలాకాలంగా వింటున్నాంగానీ.. ఈ ఏడాది అది లాస్‌వెగాస్‌లో మొదలైన సీఈఎస్ – 2018లో ప్రత్యక్షమైంది. అంతేనా.. రిమోట్ కంట్రోల్ సాయంతోనే స్క్రీన్‌ను ఎలా కావాలంటే అలా వంపుకునే అవకాశం ఉండటం ఈ సరికొత్త ఎల్జీ ఓలెడ్ టీవీ ప్రత్యేకత. ఒక్కసారి ఫొటోలను చూస్తే ఈ టీవీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఎల్జీ అని రాసి ఉన్న డబ్బాలో ఉండ చుట్టుకుని ఉండే ఈ టెలివిజన్ అవసరమైనప్పుడు పైకి వచ్చేస్తుందన్నమాట. దాదాపు 65 అంగుళాల వెడల్పు ఉంటుంది ఇది. అవసరమనుకుంటే టీవీలోని కొంతభాగాన్ని మాత్రమే పనిచేయించగలడం దీనికున్న ఇంకో ప్రత్యేకత. భలేగుందే.. మనమూ ఒకటి కొనేద్దాం అనుకుంటూ ఉంటే కొంచెం ఆగాలి. ఎందుకంటే వీటిని వినియోగదారులకు అందించే ఆలోచన ప్రస్తుతానికి తాము చేయడం లేదని ఎల్జీ అంటోంది మరి! -
అతుక్కుపోతే.. అంతే సంగతులు?
టీనేజర్లు, పెద్దవాళ్లు రోజుకు ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే టీవీలు చూడటం, వీడియోగేములు ఆడటం వంటివి చేయాలి. ఎక్కువ సమయాన్ని ఔట్‌డోర్ గేమ్స్ ఆడుతూ, పుస్తకాలు చదువుతూనో గడపాలి. సాక్షి: కంప్యూటర్, వీడియో గేమ్స్‌ను ఎక్కువ సేపు ఆడుతూ.. చైనాలోని టీనేజర్లు ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ అలవాటు ప్రమాదకరస్థాయికి చేరిందని తెలిపింది. సరైన వేళకు తినడం, నిద్రపోవటం కూడా మర్చిపోయి గంటలకొద్ది వీడియోగేమ్స్, టీవీలు చేసే టనేజర్లపై వివిధ దుష్ర్పభావాలుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోయే టీనేజర్లకు కూడా ఇది వర్తిస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ విధంగా ప్రమాదకరస్థాయిలో ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు బానిసైన టీనేజర్లకు చైనాలోని డాక్టర్లు ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పరిచి..నెలల కొద్ది ఎలాంటి మీడియాను వారికి అందుబాటులో ఉంచకుండా ఉంచి.. డ్రాకోనియన్థెరపీ ద్వారా వారిని తిరిగి మూములుగా తయారుచేస్తున్నారు. ఇటీవల కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 8-10 సంవత్సరాల మధ్య ఉండే పిల్లలు.. రోజుకి సుమారు 8 గంటలసేపు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ..ఇలా వివిధ రకాల మీడియా ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారని తేలింది. టీనేజర్లు,పెద్దవారయితే రోజుకు 11 గంటల సమయాన్ని వీటి ముందు గుడుపుతున్నారని వెల్లడైంది. రెండేళ్లలోపు పిల్లలను టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ముందు ఉంచకూడదు. ఈ కాలంలో వారి మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పసిపిల్లలు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకునేంత బాగా, ఎలక్ట్రానిక్ స్క్రీన్ల ద్వారా నేర్చుకోలేని అధ్యయనం పేర్కొంది. ఎలక్ట్రానిక్ మీడియాను ఎక్కువగా ఉపయోగించటం వల్ల పిల్లల ప్రవర్తన, ఆరోగ్యం, చదువుపై ప్రతికూల ప్రభావాలుంటాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ప్రభావాలు: ⇒టీవీలో హింసాత్మక కార్యక్రమాలు, వయలెంట్ వీడియో గేమ్‌లు ఎక్కవ సేపు ఆడే పిల్లలపై వీటి ప్రభావంగా ఎక్కువగా ఉంటోందనీ, క్రమక్రమంగా వారి ప్రవర్తన క్రూరంగా, హింసాత్మకంగా మారి, స్నేహితులు, ఉపాధ్యాయులతో దురుసుగా ప్రవరిస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. ⇒అధిక సమయం టీవీ ముందు కూర్చోవటంతో బద్దకం, స్థూలకాయం వంటి వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువ. ⇒ఎక్కువ సమయం టీవీ చూడటం, వీడియో గేములు ఆడటం కారణంగా చదవటం, హోమ్‌వర్క్ చేయటం వంటి కార్యక్రమాలపై ప్రభావంపడి చదువులో వెనకడిపోయే ప్రమాదముంది. ⇒ఎక్కువగా ఎలక్ట్రానిక్ స్క్రీన్కు అతుక్కుపోయే పిల్లలు మల్టీటాస్కింగ్ నేచర్‌కు అలవాటుపడుతున్నారు. అయితే ఈ స్వభావం ఒకే విషయంపై దృష్టిపెట్టే లక్షణాన్ని కోల్పోయేటట్టు చేస్తుందని, ఇది భవిష్యత్తులో జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లును ఎదుర్కొనేందుకు ఇబ్బందిగా పరిణమిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ⇒ఎలక్ట్రానిక్ స్క్రీన్ ద్వారా ఎక్కువగా కమ్యూనికేషన్ నెరిపే పిల్లలు ఒంటరితనాన్ని ఫీలయ్యే అవకాశంగా అధికంగా ఉండి డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదముందని అధ్యయనం పేర్కొంది. ⇒స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్లెట్..ఇలా స్క్రీన్లకు అతుక్కుపోయే టీనేజర్లకు చేతివేళ్లు, మణికట్టు నొప్పులు రావటం, కళ్లు, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో తరచూ బాధపడుతంటారని అధ్యయనం తెలిపింది. -
45 నిమిషాల ఫార్ములా
అనవసరమైనవి కొనొద్దు.. డబ్బు ఆదా చేయాలి అనుకోవడం, పక్కవాళ్లకి సలహాలు ఇవ్వడం సులభమే అయినా అమలు చేయాల్సి వస్తే మాత్రం చాలా కష్టమే. అందుకే బడ్జెట్‌కి కట్టుబడి ఉండాలని ఎంత ప్రయత్నించినా చాలా సందర్భాల్లో లక్ష్మణ రేఖ దాటేస్తూ ఉంటాం. ఇలా జరగకుండా జాగ్రత్తపడేందుకు ఎవరికి వారు కొంగొత్త ఫార్ములాలు ప్రయత్నిస్తుంటారు. అలాంటిదే 45 నిమిషాల ఫార్ములా కూడా. మన ఇళ్లలో కుర్చీలు, సోఫాలు, టీవీలు ఇలాంటివన్నీ కూడా రోజులో చాలా ఎక్కువ సేపే వినియోగంలో ఉంటాయి. ఇవి కాకుండా నిత్యావసరాలు, ఏవో కొన్ని తప్పనిసరివి పక్కన పెడితే మా ఇంట్లోనూ ఉన్నాయని చెప్పుకోవడానికి అలంకారప్రాయంగా కొనే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి. హంగూ, ఆర్భాటాల కోసం కావొచ్చు మరేదైనా ఉద్దేశంతో కావొచ్చు ఇలాంటివి కొనేటప్పుడు ఈ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది. మనం కొనే వాటిని రోజులో కనీసం ఒక 45 నిమిషాలపాటైనా ఉపయోగిస్తామా లేదా అన్నది చూసుకుంటే.. వృథా కొనుగోళ్లను మానుకోవచ్చు. ఆ మాత్రం సమయం ఉపయోగపడితే వాటిని కొన్నందుకు గిట్టుబాటు అయినట్లే. ఎందుకంటే రోజుకు 45 నిమిషాలంటే ఏడాదికి దాదాపు 11 రోజులవుతుంది. ఈ లెక్కన చూస్తే సదరు వస్తువు ఏడాదిలో కనీసం 2 వారాల పాటైనా ఉపయోగించని పక్షంలో దాన్ని కొనడం వృథానే. ఇందుకోసం 45 నిమిషాల ఫార్ములానే పెట్టుకోవాలని రూలేం లేదు. ఎవరికి వారు తమ సౌలభ్యాన్ని బట్టి మార్చుకోనూ వచ్చు. -
గృహోపకరణాల సేల్స్ బాగుంటాయ్!
జూన్ తర్వాతి నుంచి అమ్మకాలకు జోష్ ఈ ఏడాది 15 శాతం వృద్ధి ఆశిస్తున్న కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్, గృహోపకరణాల తయారీ కంపెనీలు బిజీ బిజీగా ఉన్నాయి. ఈ ఏడాది నుంచి మార్కెట్ పుంజుకుంటుందన్న విశ్వాసంతో డిమాండ్‌ను అందుకోవడానికి తగిన ఏర్పాట్లలో మునిగిపోయాయి. కొత్త కొత్త మోడళ్లతో కస్టమర్లకు దగ్గరవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. స్థిర ప్రభుత్వం రాకతో మార్కెట్ సెంటిమెంటు బలపడిందని గృహోపకరణాల కంపెనీలు అంటున్నాయి. మరోవైపు ఎండవేడిమి కూడా ఏసీ, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెంచేందుకు దోహదం చేస్తోందని చెబుతున్నాయి. మొత్తంగా 2014 నుంచి పరిశ్రమ వృద్ధి ఉంటుందని ఆనందంగా ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విపణి పరిమాణం రూ.40,000 కోట్లుంది. 15 శాతం వృద్ధి..: కొన్నేళ్లుగా భారత గృహోపకరణాల మార్కెట్ స్తబ్దుగా ఉంది. దేశీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉండడం, రూపాయి విలువ క్షీణించడంతో ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఇక్కడి కంపెనీలకు భారమయ్యాయి. దీంతో కంపెనీలు ఉపకరణాల ధర పెంచకతప్పలేదు. ఈ ప్రభావం కాస్తా అమ్మకాలపై పడింది. అయితే స్థిర ప్రభుత్వం రాకతో మార్కెట్ వాతావరణం మారిందని ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ సీఎండీ జీఎల్ మిర్చందానీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. జూన్ తర్వాతి నుంచి అమ్మకాలు పుంజుకుంటాయని ఆయన చెప్పారు. 2014లో గృహోపకరణాల విపణి 15 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2014-15లో 10-15 శాతం వృద్ధితో తమ కంపెనీ రూ.1,500-1,700 కోట్ల వ్యాపారం ఆశిస్తోందని పేర్కొన్నారు. అన్ని విభాగాల్లోనూ..: టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ ఏడాది మంచి అమ్మకాలు ఉంటాయని పరిశ్రమ చెబుతోంది. గతేడాది దేశవ్యాప్తంగా 31 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. 2014లో ఈ సంఖ్య 34 లక్షలకు చేరుకుంటుందని బ్లూ స్టార్ రూమ్ ఏసీ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సి.పి.ముకుందన్ మీనన్ తెలిపారు. ఈ ఏడాది 2.8 లక్షల ఏసీలను విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నామని, గతేడాదితో పోలిస్తే ఇప్పటికే కంపెనీ 10-12 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. ఏసీల అమ్మకాల్లో 5 శాతం వృద్ధి చెందామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ తెలిపారు. రిఫ్రిజిరేటర్ల విభాగంలో గతేడాది మాదిరిగా నిలకడైన వృద్ధి ఉంటుందని చెప్పారు. నూతన ఉత్పత్తులు కూడా..: హాయర్ ఒక అడుగు ముందుకేసి 60కిపైగా ఉత్పత్తులను ఈ ఏడాది ప్రవేశపెట్టింది. మరిన్ని ఉత్పత్తులు కస్టమర్ల ముందుకు రానున్నాయని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో తమ కంపెనీ 35 శాతం వృద్ధి ఆశిస్తోందని చెప్పారు. ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో టీవీల అమ్మకాలు రెండింతలు అవుతాయని అంచనా వేస్తున్నట్టు సోనీ వెల్లడించింది. మార్కెట్ సానుకూల పవనాలతో ఆశించిన వృద్ధి సాధిస్తామని సోనీ సేల్స్ హెడ్ సునిల్ నయ్యర్ తెలిపారు. బ్రేవియా టీవీల విభాగంలో రెండు మోడళ్లను ఇటీవలే ప్రవేశపెట్టామని చెప్పారు. జూన్ తర్వాతి నుంచి కంపెనీలకు మంచి రోజులని కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) తెలిపింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది మార్కెట్ మలుపుతిప్పుతుందని సియామా ప్రెసిడెంట్ అనిరుధ్ ధూత్ అన్నారు.