
టెలివిజన్లు, కంప్యూటర్ తెరలు, మొబైల్‌ఫోన్లను కాగితం మాదిరిగ ఉండచుట్టేయవచ్చునని చాలాకాలంగా వింటున్నాంగానీ.. ఈ ఏడాది అది లాస్‌వెగాస్‌లో మొదలైన సీఈఎస్ – 2018లో ప్రత్యక్షమైంది. అంతేనా.. రిమోట్ కంట్రోల్ సాయంతోనే స్క్రీన్‌ను ఎలా కావాలంటే అలా వంపుకునే అవకాశం ఉండటం ఈ సరికొత్త ఎల్‌జీ ఓలెడ్ టీవీ ప్రత్యేకత. ఒక్కసారి ఫొటోలను చూస్తే ఈ టీవీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.
ఎల్‌జీ అని రాసి ఉన్న డబ్బాలో ఉండ చుట్టుకుని ఉండే ఈ టెలివిజన్ అవసరమైనప్పుడు పైకి వచ్చేస్తుందన్నమాట. దాదాపు 65 అంగుళాల వెడల్పు ఉంటుంది ఇది. అవసరమనుకుంటే టీవీలోని కొంతభాగాన్ని మాత్రమే పనిచేయించగలడం దీనికున్న ఇంకో ప్రత్యేకత. భలేగుందే.. మనమూ ఒకటి కొనేద్దాం అనుకుంటూ ఉంటే కొంచెం ఆగాలి. ఎందుకంటే వీటిని వినియోగదారులకు అందించే ఆలోచన ప్రస్తుతానికి తాము చేయడం లేదని ఎల్‌జీ అంటోంది మరి!
Comments
Please login to add a commentAdd a comment