ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10 వేలు తగ్గింపు | OnePlus, Amazon 5th anniversary offer: Rs 5,000 discount on OnePlus 7Pro | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10 వేలు తగ్గింపు

Published Mon, Nov 25 2019 4:04 PM | Last Updated on Mon, Nov 25 2019 8:55 PM

OnePlus, Amazon 5th anniversary offer: Rs 5,000 discount on OnePlus 7Pro - Sakshi

సాక్షి, ముంబై :  చైనా మొబైల్‌ మేకర్‌ వన్‌ప్లస్‌ తన స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అడుగుపెట్టి 5 వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లపై 10 వేల రూపాయల దాకా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన​ ఇండియా ద్వారా ఈ ఆఫర్లు అందుబాటులోఉంటాయని ప్రకటించింది. 

వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ ర్యామ్ ఆప్షన్‌  ధర రూ .42,999.  ఈ ఫోన్‌ను రూ.52,999 వద్ద లాంచ్ చేసింది.
వన్‌ప్లస్ 7 ప్రో 5,000 రూపాయల తగ్గింపుతో రూ .39,999  లభిస్తోది. దీని అసలు ధర  రూ .44,999 
వన్‌ప్లస్ 7 ప్రో 6జీబీ ర్యామ్ /128 జీబీ  స్టోరేజ్    వేరియంట్‌ ధర రూ .44,999 దిగి వచ్చింది. లాంచింగ్‌ ప్రైస్‌  రూ .48,999 
వన్‌ప్లస్ 7టీ  రూ. 34000కు లభ్యం అసలు ధర  రూ. 37,000 

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్‌కు వన్‌ప్లస్ 7 టి, వన్‌ప్లస్ 7 ప్రో కొనుగోలుపై వరుసగా రూ .1,500, రూ .2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐని కూడా అందిస్తోంది. వీటితో పాటు, వన్‌ప్లస్ తన టెలివిజన్లలో డిస్కౌంట్లను కూడా ప్రవేశపెట్టింది.  హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ / డెబిట్ కార్డు ఉపయోగించి వన్‌ప్లస్ క్యూ 1 టీవీ కొనుగోలుచేసిన  రూ .4 వేల తక్షణ తగ్గింపు లభిస్తుంది. క్యూ 1 ప్రో టీవీ కొనుగోలుదారులకు తక్షణమే రూ .5 వేల తగ్గింపు లభిస్తుంది.  ఈ తగ్గింపుతో క్యూ 1 టీవీ ధర రూ .69,899 గా, క్యూ 1 టీవీ ప్రో ధర రూ .99,899 గా ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement