Offer Sales
-
స్మార్ట్‌ఫోన్స్ కొనేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days) పేరుతో తాజా సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ సేల్ జూన్ 10న ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగనుంది. ఈ పరిమిత కాల సేల్‌లో ఐఫోన్ 13, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23, పోకో ఎక్స్5తో సహా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్స్, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తోంది. వీటితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్.. ఫ్లాట్ డిస్కౌంట్స్ ⮞ ఐఫోన్13 (iPhone 13) 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.58,749 నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో రూ.69,900 ఉంది. అంటే రూ. 11,151 ఫ్లాట్ తగ్గింపు . అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.57,999లకే ఐఫోన్13ను కొనుగోలు చేయవచ్చు . ⮞ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 (Samsung Galaxy F23) 5Gని రూ.13,499లకే అందిస్తోంది. మార్చిలో లాంచ్ అయినప్పుడు దాని అసలు ధర రూ.17,499. రూ.6,500 తగ్గింపు అంటే ఎవరు వదులుకుంటారు? ఇంకా తక్కువ ధరకు ఫోన్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) రూ. 10,999 లకే అందుబాటులో ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం14 (Samsung Galaxy M14)ని అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,327 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ⮞ ఇక రూ.15,499 ఉన్న మోటో జీ62 (Moto G62) రూ. 14,499లకు, 15,499 ఉన్న పోకో ఎక్స్5 (Poco X5 5G)ని రూ.14,999లకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్ -
వీ–మార్ట్‌లో వినాయక చవితి ఆఫర్లు
హైదరాబాద్: ఫ్యాషన్ రిటైల్ సంస్థ వీ–మార్ట్... రాబోయే వినాయక చవితి సందర్భంగా గొప్ప ఆఫర్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో సహా ఒడిషా, కర్ణాటక, గోవా, పుణెల్లోని అన్ని వీ–మార్ట్ షోరూంలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 19 నుంచే మొదలైన ఈ పండుగ ఆఫర్లు.. నెలాఖరుదాకా కొనసాగనున్నాయి. రూ.3 వేల కొనుగోలుపై రూ.1,500 డిస్కౌంట్ వోచర్, హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 7.5% వరకు తక్షణ డిస్కౌంట్లను ఇస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
డిస్కౌంట్ల పండగొచ్చింది..!
న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో డిస్కౌంట్ సేల్స్ నిర్వహించడాన్ని చూశాం. కానీ, ఈ విడత పండుగలకు ముందే ఆఫర్ల విక్రయాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్ గూడ్స్ అయిన టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, వస్త్రాలు, నిత్యావసర ఉత్పత్తులను సైతం తగ్గింపు ధరలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. బిస్కెట్లు, పప్పులపైనా ఈ తగ్గింపు ధరలు అమలవుతుండడం విశేషం. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల ప్రభావంతో అధిక వ్యయాలను అధిగమించేందుకు, కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ వచ్చాయి. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపించింది. ఈ విడత పండుగల నాటికి విక్రయాలు జోరందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, సోనీ టీవీల ధరలు గత కొన్ని వారాల్లో 5–8% వరకు తగ్గాయి. మధ్య శ్రేణి నుంచి అధిక ధరల ల్యాప్‌టాప్ ధరలను సైతం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు కంపెనీలు తగ్గించి విక్రయిస్తున్నాయి. ఇక స్మార్ట్ఫోన్లపై కంపెనీలు 4–5% డిస్కౌంట్ ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నూనెలు సైతం.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగి వస్తుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. వంట నూనెల ధరలు 15–20 శాతం వరకు తగ్గాయి. పెద్ద బిస్కెట్ ప్యాక్‌ల ధరలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు 15–20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. ‘‘తయారీ వ్యయాలు తగ్గినందున ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ఆగస్టు 15 నుంచి మా బిస్కెట్ ప్యాక్‌లపై 10–15 శాతం తగ్గింపు ఇస్తున్నాం’’అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. మరికొంత కాలం పాటు ముడి సరుకుల ధరల తీరును గమనించిన తర్వాత, అన్ని రకాల ఉత్పత్తులపై ధరల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెమీకండక్టర్లు, ఓపెన్ సెల్ ధరలు ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ మేర తగ్గాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సైతం తయారీ వ్యయాలు 15 శాతం వరకు శాంతించాయి. ధరలు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తుల ధరలు కరోనా మహమ్మారి ముందు నాటితో పోలిస్తే అధికంగానే ఉండడం గమనించాలి. దీనికి కారణం కంపెనీలు గత రెండేళ్ల కాలంలో ధరలను గణనీయంగా పెంచాయి. -
ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10 వేలు తగ్గింపు
సాక్షి, ముంబై : చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్ తన స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టి 5 వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై 10 వేల రూపాయల దాకా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన ఇండియా ద్వారా ఈ ఆఫర్లు అందుబాటులోఉంటాయని ప్రకటించింది. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ ర్యామ్ ఆప్షన్ ధర రూ .42,999. ఈ ఫోన్‌ను రూ.52,999 వద్ద లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 7 ప్రో 5,000 రూపాయల తగ్గింపుతో రూ .39,999 లభిస్తోది. దీని అసలు ధర రూ .44,999 వన్‌ప్లస్ 7 ప్రో 6జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .44,999 దిగి వచ్చింది. లాంచింగ్ ప్రైస్ రూ .48,999 వన్‌ప్లస్ 7టీ రూ. 34000కు లభ్యం అసలు ధర రూ. 37,000 హెచ్డీఎఫ్సీ కస్టమర్‌కు వన్‌ప్లస్ 7 టి, వన్‌ప్లస్ 7 ప్రో కొనుగోలుపై వరుసగా రూ .1,500, రూ .2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐని కూడా అందిస్తోంది. వీటితో పాటు, వన్‌ప్లస్ తన టెలివిజన్లలో డిస్కౌంట్లను కూడా ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ / డెబిట్ కార్డు ఉపయోగించి వన్‌ప్లస్ క్యూ 1 టీవీ కొనుగోలుచేసిన రూ .4 వేల తక్షణ తగ్గింపు లభిస్తుంది. క్యూ 1 ప్రో టీవీ కొనుగోలుదారులకు తక్షణమే రూ .5 వేల తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో క్యూ 1 టీవీ ధర రూ .69,899 గా, క్యూ 1 టీవీ ప్రో ధర రూ .99,899 గా ఉంది. Get never seen before offers on OnePlus 7 Pro and OnePlus 7T on https://t.co/B7g5OoPhD5 and Partner stores. Hurry ! Offers are valid till 2nd December only! Grab them here - https://t.co/oJYzYQLHM1#OnePlusLimitedPeriodSale pic.twitter.com/2auc9qpHfu — OnePlus India (@OnePlus_IN) November 24, 2019 -
ఇండిగో సమ్మర్ ఆఫర్ సేల్
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో... రూ.999కే టికెట్ అందిస్తోంది. ‘3–డే సమ్మర్ సేల్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉండనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్ వర్తిస్తుంది. ఢిల్లీ–అహ్మదాబాద్, ముంబై–హైదరాబాద్, హైదరాబాద్–దుబాయ్, చెన్నై– కువైట్, ఢిల్లీ–కౌలాలంపూర్, బెంగళూరు–మాల్దీవ్ రూట్లలో ఆఫర్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘వేసవి సెలవులు మొదలవడంతో ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించాం. మే16 వరకు జరిగే బుకింగ్స్‌పై ఆఫర్ వర్తిస్తుంది’ అని సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విలియం బౌల్టర్ పేర్కొన్నారు. ప్రీ–పెయిడ్ అధిక బ్యాగేజీపై 30% వరకు డిస్కౌంట్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
భారీ డీల్స్‌తో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెడీ
సాక్షి, న్యూఢిల్లీ : అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ సేల్‌ను ప్రకటించిన క్రమంలో ఫ్లిప్‌కార్ట్ అవే తేదీల్లో రిపబ్లిక్‌డే సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌ను ఈనెల 21 నుంచి 24 వరకూ నిర్వహిస్తుండగా, ఈనెల 21 నుంచి 23 వరకూ రిపబ్లిక్ డే సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసింది. ఈ కామర్స్ దిగ్గజాలు ఈ ఆఫర్ సమయంలో పలు బ్రాండ్లపై 70 నుంచి 80 శాతం వరకూ డిస్కౌంట్‌ను ప్రకటించాయి.స్మార్ట్ ఫోన్లు, ఫ్యాషన్, హోం అప్లయెన్సెస్‌పై భారీ తగ్గింపును వర్తింపచేసేందుకు ఇరు కంపెనీలు సన్నద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, దుస్తులు, ఫుట్‌వేర్, ఫర్నిషింగ్‌పై 80 శాతం డిస్కౌంట్‌ను, టీవీ ఇతర ఉపకరణాలపై 70 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. పూర్తిగా భారతీయ ఉత్పత్తులతో కూడిన ది ఇండియా స్టోర్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రదర్శిస్తోంది. నూతన స్మార్ట్‌ఫోన్ లాంఛ్‌లతో పాటు శాంసంగ్, యాపిల్, గూగుల్ ఫోన్లపై గ్రేట్ డీల్స్, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇదే తరహలో అమెజాన్ ఇండియా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, ఎలక్ర్టానిక్స్, హోం, కిచెన్ ఉత్పత్తులపై ఆసక్తికర డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. జనవరి 20 నుంచి గ్రేట్ ఇండియా సేల్‌లో ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందు గ్రేట్ ఇండియన్ సేల్ అందుబాటులోకి వస్తుంది. పలు ప్రోడక్ట్‌లకు సంబంధించి పదివేలకు పైగా బ్రాండ్లపై భారీ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. -
డిస్కౌంట్ సేల్స్ అదుర్స్!
* లక్షల సంఖ్యలో ఉత్పత్తుల అమ్మకాలు * ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ ప్రకటన న్యూఢిల్లీ: పండుగల డిస్కౌంట్ అమ్మకాల్ని ప్రారంభించగానే లక్షలాది ఉత్పత్తుల అమ్మకాలు తమ సైట్ల ద్వారా జరిగినట్టు ఈ కామర్స్ అగ్రశ్రేణి సంస్థలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ ప్రకటించాయి. అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ పేరుతో ఈ నెల 1 నుంచి 5 వరకు డిస్కౌంట్లతో ఆఫర్ సేల్స్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో, స్నాప్ డీల్ అన్‌బాక్స్ దివాళీ పేరుతో ఈ నెల 2 నుంచి ఐదు రోజుల పాటు విక్రయాలు నిర్వహిస్తున్నాయి. భారీ తగ్గింపులతో ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తెలిపాయి. 30 నిమిషాల్లో లక్ష ఉత్పత్తుల విక్రయం సాధారణ రోజుల్లో నిర్వహించే వ్యాపారం కంటే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ మొదటి రోజు ( ఈనెల 1న) ఆరు రెట్లు అధికంగా లావాదేవీలు జరిగాయని అమేజాన్ ప్రకటించింది. మొదటి 30 నిమిషాల్లో లక్ష ఉత్పత్తులు అమ్ముడుపోయినట్టు తెలిపింది. మొదటి 12 గంటల్లో 15 లక్షల వస్తువులు విక్రయించామని వెల్లడించింది. 16 గంటల్లో 11 లక్షల లావాదేవీలు: అన్‌బాక్స్ దివాళీ పేరుతో ఆదివారం నుంచి ప్రత్యేక అమ్మకాలు ప్రారంభించిన స్నాప్‌డీల్ మొదటి రోజు మొదటి 16 గంటల్లో 2,800 ప్రాంతాల నుంచి 11 లక్షల మంది కొనుగోళ్లు చేసినట్టు తెలిపింది. శనివారం అర్ధరాత్రి తర్వాత అమ్మకాలు ప్రారంభం కాగా, సెకనుకు 180 ఆర్డర్లు బుక్ అయ్యాయని సంస్థ పేర్కొంది. సాయంత్రం 4 గంటల వరకు లావాదేవీల ప్రకారం... సాధారణ రోజుల్లో జరిగే లావాదేవీల విలువ కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నట్టు స్నాప్‌డీల్ వెల్లడించింది. గంటలో 5 లక్షల ఉత్పత్తులు: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ విక్రయాలు ఆదివారం ప్రారంభం కాగా మొదటి గంటలోనే ఐదు లక్షల ఉత్పత్తులు అమ్ముడుపోయాయని సంస్థ ప్రకటించింది. ఒక నెలలో ఆఫ్‌లైన్, ఆన్లైన్లో అమ్ముడుపోయే యాపిల్ వాచీల సంఖ్య కంటే అధికంగా తాము తొలి 10 నిమిషాల్లోనే విక్రయించినట్టు ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో పేర్కొంది. 2015లో బిగ్ బిలియన్ డేస్ మొదటి రోజు మొత్తం నమోదైన విక్రయాలను ఈ ఏడాది బిగ్‌బిలియన్ డేస్ మొదటి రోజు తొలి ఆరు గంటల్లోనే అధిగమించినట్టు తెలిపింది. తమ ఫ్యాషన్ ఉత్పత్తుల ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ మింత్రా సైతం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి రోజు మొదటి గంటలో మూడు రెట్లు అధిక విలువ వ్యాపారాన్ని నమోదు చేసినట్టు తెలిపింది. తగ్గింపు అంతా కల్పితం... ఈ కామర్స్ సైట్లు ఇస్తున్న తగ్గింపు ఏమీ లేదంటూ ట్వీట్టర్లో కొందరు యూజర్లు కామెంట్లు పోస్ట్ చేయడం గమనార్హం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ షాపింగ్ ఫెస్టివల్ తగ్గింపు అంతా కల్పితమని, మార్కెటింగ్ గిమ్మిక్కు అనేది ఓ యూజర్ అభిప్రాయం. కొందరు యూజర్లు అయితే ఇతర సైట్లతో పోలిస్తే ఈ సైట్లలో ధరలు అధికంగా ఉన్నాయనేందుకు నిదర్శనంగా స్క్రీన్షాట్లను కూడా పోస్ట్ చేశారు. పేమెంట్ గేట్‌వే సమస్యలను కూడా కొందరు ప్రస్తావించారు. మరోవైపు ఈ కామర్స్ సైట్ల బిగ్ సేల్స్ ఎఫ్‌డీఐ పాలసీ ఉల్లంఘనగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పేర్కొంది.