Flipkart Big Saving Days: Best Deals On Smartphones From iPhone 13 To Samsung Galaxy F23 - Sakshi
Sakshi News home page

Flipkart Big Saving Days: స్మార్ట్‌ఫోన్స్‌ కొనేవారికి గుడ్‌న్యూస్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్‌ డీల్స్‌

Published Sat, Jun 10 2023 5:35 PM | Last Updated on Sat, Jun 10 2023 6:02 PM

flipkart big saving days best deals on smartphones iphone 13 samsung galaxy f23 - Sakshi


ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌ (Flipkart Big Saving Days) పేరుతో తాజా సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ జూన్ 10న ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగనుంది. ఈ పరిమిత కాల సేల్‌లో ఐఫోన్ 13, శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌23, పోకో ఎక్స్‌5తో సహా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్‌ డీల్స్‌, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తోంది. వీటితోపాటు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు, బ్యాంక్‌ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

టాప్‌ బ్రాండ్స్‌.. ఫ్లాట్‌ డిస్కౌంట్స్‌

⮞ ఐఫోన్‌13 (iPhone 13) 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ రూ.58,749 నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది యాపిల్‌ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.69,900 ఉంది. అంటే రూ. 11,151 ఫ్లాట్ తగ్గింపు . అదనంగా, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ ఉన్న కస్టమర్‌లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.57,999లకే ఐఫోన్‌13ను కొనుగోలు చేయవచ్చు .

⮞ శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌23 (Samsung Galaxy F23) 5Gని రూ.13,499లకే అందిస్తోంది. మార్చిలో లాంచ్‌ అయినప్పుడు దాని అసలు ధర రూ.17,499. రూ.6,500 తగ్గింపు అంటే ఎవరు వదులుకుంటారు? ఇంకా తక్కువ ధరకు ఫోన్‌ కావాలనుకునే వారికి శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 (Samsung Galaxy F13) రూ. 10,999 లకే అందుబాటులో ఉంది. అలాగే శాంసంగ్‌ గెలాక్సీ ఎం14 (Samsung Galaxy M14)ని అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,327 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

⮞ ఇక రూ.15,499 ఉన్న మోటో జీ62 (Moto G62) రూ. 14,499లకు, 15,499 ఉన్న పోకో ఎక్స్‌5 (Poco X5 5G)ని  రూ.14,999లకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్‌ చేశారు.. ఫొటో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement