ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్న పర్సనల్ ఫొటోలు, వీడియోలు భద్రంగా ఉంటాయా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సైబర్ నేరస్తులు మాల్ వేర్ సాయంతో ఫోన్లలో ఉన్న పర్సనల్ డేటాను లీక్ చేస్తున్నారు.డార్క్ వెబ్‌లో అసాంఘిక కార్యకలపాల కోసం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఈ బాధ మీకు తొలగనుంది. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ వినయోగదారులకు లీకుల బెడద తప్పనుంది. తొలుత 'గూగుల్ ఫిక్సెల్' వినియోగదారుల కోసం ఫొటో, వీడియో ఫోల్డర్‌కి లాక్ వేసే ఫీచర్ ఆప్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే పెరుగుతున్న టెక్నాలజీతో పొంచి ఉన్న ప్రమాదం నుంచి గూగుల్ ఫిక్సెల్ ఫోన్ వినియోగదారుల్ని రక్షించేందుకు ఈ ఏడాది జూన్‌లో గూగుల్ లాక్ ఫీచర్‌ను విడుదల చేసింది. అయితే ఆ ఫీచర్‌ను మరింత అప్‌డేట్ చేసి త్వరలో విడుదల చేయనుందని టెక్ న్యూస్ వెబ్‌సైట్ 'ది వెర్జ్' ఓ కథనాన్ని ప్రచురించింది.
ది వెర్జ్ రిపోర్ట్ ప్రకారం..గూగుల్ ఫిక్సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0 యూజర్లు తమ ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు సురక్షితంగా ఉండేందుకు లాక్ పెట్టుకోవచ్చు.గూగుల్ ఫోటోస్ నుంచి వచ్చే నోటిఫికేషన్ సాయంతో పాస్‌వర్డ్‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ లాక్ ఫీచర్‌ను వినియోగిస్తే ప్రమాదకరమైన థర్డ్ పార్టీ యాప్స్ ఫోన్‌లో ఉన్న ఫొటోల్ని, వీడియోల డేటాను సేకరించ లేవు. ఆ యాప్స్‌కు చిక్కకుండా ఈ లాక్ ఫీచర్ వాటిని హైడ్ చేస్తుంది.
వీటితో పాటు గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా ఫోన్‌లో ఉన్న ఫొటోల్ని బ్యాకప్ తీసుకోవడానికి లేదా షేర్ చేసే అవకాశం ఉండదు. తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్' నుంచి వచ్చే నోటిఫికేషన్‌తో ఫోల్డర్‌కి లాక్ చేయడం వల్ల సురక్షితంగా ఉండొచ్చని వెర్జ్ తన కథనంలో పేర్కొంది.
చదవండి: గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment