
స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో టెక్నాలజీ సహకారాన్ని పెంపొందించేందుకు రూపొందించిన 'ఫ్లిప్‌కార్ట్ లీప్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్' (FLIN) ఫ్లాగ్‌షిప్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ మూడవ కోహోర్ట్ కోసం ఐదు స్టార్టప్‌లను ఎంపిక చేసింది. మునుపటి రెండు కోహోర్ట్‌ల విజయాన్ని అనుసరించి.. మూడవ రౌండ్ జెన్ ఏఐ, ఓమ్నీ ఛానల్, అనలిటిక్, వీడియో కామర్స్‌లో స్టార్టప్‌ల డ్రైవింగ్ పురోగతిని పరిచయం చేసింది.
ఫ్లిప్‌కార్ట్ లీప్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ అనేది ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, ఇది ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. 2022 జనవరిలో ప్రారంభమైన ఎఫ్ఎల్ఐఎన్.. భారతదేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడం, డ్రైవింగ్ సహకారం, లేటెస్ట్ రిటైల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం అంకితమైంది.
ఎఫ్ఎల్ఐఎన్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్.. స్టార్టప్ వ్యవస్థలో ఆవిష్కరణలకు ఉత్ప్రేరకంగా మారుతోంది. ఇది స్టార్టప్‌ల మెరుగుదలకు ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ 'నరేన్ రావు' పేర్కొన్నారు. అంతే కాకుండా భారతదేశంలో ఈ-కామర్స్ భవిష్యత్తును రూపొందించగల పరిష్కారాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సాధ్యమవుతాయని ఆయన అన్నారు.
ఈ కోహోర్ట్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఎంచుకున్న ఐదు స్టార్టప్‌లు
•ఇంటెలిజెన్స్ నోడ్
•ఇన్వెంజో ల్యాబ్స్
•స్టోరీ బ్రెయిన్
•ఫిలో
•డీ-ఐడీ