ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (Buy Now Pay Later).. ఈ విధానం కేవలం ఈ కామర్స్ వెబ్‌సైట్‌లలో మాత్రమే కాకుండా, కొన్ని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కూడా అవలంబించాయి. ఈ విధానం ద్వారా ఏదైనా కొనుగోలు చేసే వ్యక్తి.. ముందుగా వస్తువును కొనుగోలు చేస్తాడు. ఆ తరువాత ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో చెలించాలి. ఇంతకీ దీనివల్ల వినియోగదారునికి ఏమైనా లాభం ఉందా? లేక్ నష్టం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..
ఏదైనా అత్యవసరమైన వస్తువులను.. చేతిలో డబ్బు లేని సమయంలో కొనుగోలు చేయాలంటే 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' అనేది ఉపయోగకరమైన విధానమే. అయితే వస్తువును కొనే ముందే ఎన్ని రోజుల్లో పే చేయాలి? సమయానికి చెల్లించకపోతే వచ్చే నష్టాలు ఏంటి? అనేవన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి.
మీరు సకాలంలో డబ్బు చెల్లిస్తే.. ఎటువంటి నష్టాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ డబ్బు చెల్లించడంలో ఆలస్యం అయితే మాత్రం.. లేట్ పేమెంట్ ఫీజు, సర్వీస్ ఛార్జెస్ వంటివి ఎన్నో విధిస్తారు. కాబట్టి వీటన్నింటిని ముందుగానే తెలుసుకోవాలి.
కొన్ని ఈ కామర్స్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్.. డిస్కౌంట్స్ పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. చేతిలో డబ్బు లేకపోయినా ఇప్పుడు కోనేయండి.. మళ్ళీ చెల్లించండి అంటూ ఊరిస్తుంటాయి. ఈ మాయలో పడ్డారంటే.. సమయానికి డబ్బు చెల్లించకపోత.. మీ చెబుకు చిల్లు పడ్డట్టే.
ఇదీ చదవండి: జియో, ఎయిర్‌టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్‌లింక్
మీరు ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి విధానంలో వస్తువులను కొనుగోలు చేయాలంటే మీకు సిబిల్ స్కోర్ వంటివి ఉండాల్సిన అవసరం లేదు. అయితే మీరు సకాలంలో డబ్బు చెల్లించకపోతే.. ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోకు తెలియజేస్తుంది. ఆ తరువాత మీకు భవిష్యత్తులో లోన్ వచ్చే అవకాశం లేదు.
ఆర్ధిక పరమైన విషయాల్లో తప్పకుండా క్రమశిక్షణ ఉండాలి. సకాలంలో తప్పకుండా నేను చెల్లించగలను అనే నమ్మకం మీకున్నప్పుడు, కొనుగోలు చేసే వస్తువు అత్యవసరమైనప్పుడు ''ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి'' ఎంచుకోవచ్చు. అయితే అప్పటికే ప్రతి నెలా ఏదైనా లోన్స్ వంటివి చెల్లిస్తుంటే.. ఈ సర్వీస్ ఉపయోగించుకోకపోవడం చాలా ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment