న్యూఢిల్లీ: ఈ–కామర్స్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కస్టమర్లను మోసపుచ్చేందుకు లేదా వారిని తప్పుదోవ పట్టించేందుకు ఈ–కామర్స్ సంస్థలు ఉపయోగించే ’డార్క్ ప్యాటర్న్స్’పై నిషేధం విధిస్తూ సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ఉపయోగించడమనేది అనుచిత వ్యాపార విధానాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలను ఇవ్వడం, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడం కిందికే వస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధిం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద జరిమానాలు ఉంటాయని తెలిపింది.
యూజరు ఇంటర్‌ఫేస్‌ను లేదా మోసపూరిత డిజైన్ విధానాలను ఉపయోగించి వినియోగదారులను తప్పుదోవ పట్టించడం, కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడాన్ని డార్క్ ప్యాటర్న్స్‌గా వ్యవహరిస్తారు. బాస్కెట్ స్నీకింగ్, ఫోర్స్‌డ్ యాక్షన్‌లాంటివి ఈ కోవలోకి వస్తాయి.
చెకవుట్ చేసేటప్పుడు యూజరు ఎంచుకున్న వాటితో పాటు వారికి తెలియకుండా ఇతరత్రా ఉత్పత్తులు, సర్వీసులు, విరాళాల్లాంటివి అదనంగా చేర్చడం ద్వారా కట్టాల్సిన బిల్లును పెంచేయడాన్ని బాస్కెట్ స్నీకింగ్ అంటారు. అలాగే ఒకటి కొనుక్కోవాలంటే దానికి సంబంధం లేని మరొకదాన్ని కూడా కొనాల్సిందేనంటూ బలవంతంగా అంటగట్టే వ్యవహారాన్ని ’ఫోర్డ్స్ యాక్షన్’గా వ్యవహరిస్తారు. సీసీపీఏ తన నోటిఫికేషన్‌లో ఇలాంటి 13 డార్క్ ప్యాటర్న్స్‌ను ప్రస్తావింంది. నోటిఫై చేసిన మార్గదర్శకాలతో అనుత వ్యాపార విధానాలపై అన్ని వర్గాలకు స్పష్టత వచ్చినట్లయిందని వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment