pay later
-
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి: ఇది లాభామా? నష్టమా?
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (Buy Now Pay Later).. ఈ విధానం కేవలం ఈ కామర్స్ వెబ్సైట్లలో మాత్రమే కాకుండా, కొన్ని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కూడా అవలంబించాయి. ఈ విధానం ద్వారా ఏదైనా కొనుగోలు చేసే వ్యక్తి.. ముందుగా వస్తువును కొనుగోలు చేస్తాడు. ఆ తరువాత ఇన్స్టాల్మెంట్ రూపంలో చెలించాలి. ఇంతకీ దీనివల్ల వినియోగదారునికి ఏమైనా లాభం ఉందా? లేక్ నష్టం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ఏదైనా అత్యవసరమైన వస్తువులను.. చేతిలో డబ్బు లేని సమయంలో కొనుగోలు చేయాలంటే 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' అనేది ఉపయోగకరమైన విధానమే. అయితే వస్తువును కొనే ముందే ఎన్ని రోజుల్లో పే చేయాలి? సమయానికి చెల్లించకపోతే వచ్చే నష్టాలు ఏంటి? అనేవన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి.మీరు సకాలంలో డబ్బు చెల్లిస్తే.. ఎటువంటి నష్టాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ డబ్బు చెల్లించడంలో ఆలస్యం అయితే మాత్రం.. లేట్ పేమెంట్ ఫీజు, సర్వీస్ ఛార్జెస్ వంటివి ఎన్నో విధిస్తారు. కాబట్టి వీటన్నింటిని ముందుగానే తెలుసుకోవాలి.కొన్ని ఈ కామర్స్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్.. డిస్కౌంట్స్ పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. చేతిలో డబ్బు లేకపోయినా ఇప్పుడు కోనేయండి.. మళ్ళీ చెల్లించండి అంటూ ఊరిస్తుంటాయి. ఈ మాయలో పడ్డారంటే.. సమయానికి డబ్బు చెల్లించకపోత.. మీ చెబుకు చిల్లు పడ్డట్టే.ఇదీ చదవండి: జియో, ఎయిర్టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్లింక్మీరు ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి విధానంలో వస్తువులను కొనుగోలు చేయాలంటే మీకు సిబిల్ స్కోర్ వంటివి ఉండాల్సిన అవసరం లేదు. అయితే మీరు సకాలంలో డబ్బు చెల్లించకపోతే.. ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోకు తెలియజేస్తుంది. ఆ తరువాత మీకు భవిష్యత్తులో లోన్ వచ్చే అవకాశం లేదు.ఆర్ధిక పరమైన విషయాల్లో తప్పకుండా క్రమశిక్షణ ఉండాలి. సకాలంలో తప్పకుండా నేను చెల్లించగలను అనే నమ్మకం మీకున్నప్పుడు, కొనుగోలు చేసే వస్తువు అత్యవసరమైనప్పుడు ''ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి'' ఎంచుకోవచ్చు. అయితే అప్పటికే ప్రతి నెలా ఏదైనా లోన్స్ వంటివి చెల్లిస్తుంటే.. ఈ సర్వీస్ ఉపయోగించుకోకపోవడం చాలా ఉత్తమం. -
సూపర్ ఆఫర్.. డబ్బులు లేకుండా ఓయో రూమ్!
హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో (OYO) భారతీయ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. స్టే నౌ పే లేటర్ (SNPL) సౌకర్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ-కామర్స్ వెబ్సైట్లు, రిటైల్ షాపులు ఇలాంటి బై నౌ పే లేటర్ ఆఫర్లను అందిస్తుంటాయి. ఆఫర్ వివరాలు SNPL సౌకర్యం కింద కస్టమర్లకు రూ. 5,000 వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తారు. 15 రోజుల బస తర్వాత మొత్తాన్ని సెటిల్ చేయాలి. ఈ ఫీచర్ కోసం క్రెడిట్ ఆధారిత చెల్లింపుల సేవ అయిన Simplతో ఓయో భాగస్వామ్యం కలిగి ఉంది. ఓయో యాప్ హోమ్ స్క్రీన్‌పై ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు లేదా చెల్లింపు మోడ్ ఎంపిక సమయంలో Simplని ఎంచుకోండి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఈ SNPL ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఓయో గ్లోబల్ సీవోవో, చీఫ్ టెక్నాలజీ & ప్రోడక్ట్ ఆఫీసర్ అభినవ్ సిన్హా చెప్పారు. Simpl ద్వారా హోటల్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు 65 శాతం వరకు తగ్గింపుతోపాటు రూ. 50 క్యాష్‌బ్యాక్‌ను లభిస్తుంది. అయితే Simpl యాప్‌లో చెల్లింపును 15 రోజులకు మించి ఆలస్యం చేస్తే, మీ బిల్లు మొత్తాన్ని బట్టి వడ్డీ, రూ. 250 వరకు ఆలస్య రుసుముతోపాటు జీఎస్టీని విధిస్తుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా?
డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లో ట్రావెల్ నౌ పే లేటర్ (TNPL) ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందు కోసం క్యాషీ (CASHe)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ సదుపాయంతో ప్రయాణికులు తమ రైలు టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. టికెట్ మొత్తాన్ని మూడు నుంచి ఆరు నెలలలో ఈఎంఐల ద్వారా తర్వాత చెల్లించవచ్చు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం పేటీఎంలో పోస్ట్‌పెయిడ్ సదుపాయం ఉండటం వల్ల రైల్వే టికెటింగ్ సర్వీసుల్లో బుక్ నౌ పే లేటర్ ఆప్షన్ ను పేటీఎం యూజర్లు వినియోగించుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇటీవలి కాలంలో పేటీఎం తమ యూజర్ల కోసం టికెట్ల బుకింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, షాపింగ్ లలో బై నౌ పే లేటర్ సదుపాయాన్ని విరివిగా కల్పిస్తోంది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 30 రోజుల వ్యవధికి రూ. 60 వేల వరకు వడ్డీ రహిత రుణాన్ని అందిస్తోంది. టికెట్ బుకింగ్ ఇలా.. ఐఆర్సీటీసీ అధికారిక పోర్టల్ లేదా మొబైల్లో ఐఆర్సీటీసీ యాప్‌లో లాగిన్ అవ్వాలి. మీ వెళ్లాల్సిన ప్రాంతం, ప్రయాణ తేదీ తదితర వివరాలను నమోదు చేయాలి. తర్వాత చెల్లింపు విభాగానికి వెళ్లి 'పే లేటర్'పై క్లిక్ చేయండి. పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ని ఎంచుకుని, మీ పేటీఎం వివరాలతో లాగిన్ చేయండి. తర్వాత OTPని నమోదు చేస్తే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్! -
లడ్డూ కావాలా నాయనా! పెళ్లికీ ఈఎంఐ ఆఫర్: మ్యారీ నౌ పే లేటర్!
సాక్షి,ముంబై: ‘బై నౌ..పే లేటర్’ అనే ఆఫర్ స్మార్ట్ఫోన్లు లేదా కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోళ్లపైనా, అలాగే రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలోను లభిస్తోంది. ఇకపై ఇలాంటి బంపర్ ఆఫర్ పెళ్లిళ్లకు కూడా లభించనుంది. తాజాగా మేరీ నౌ పే లేటర్ (ఎంఎన్పీఎల్) ఆప్షన్‌తో పెళ్లిక ఈఎంఐ ఆఫర్ సెన్సేషన్‌గా మారింది. లావిష్‌గా, జబరదస్త్‌గా పెళ్లి చేసుకోవానుకునేవారికి తీపికబురు ఇది. ట్రావెల్ ఫిన్‌టెక్ సంస్థ సంకాష్, రాడిసన్ హోటల్స్ భాగస్వామ్యంతో మ్యారీ నౌ పే లేటర్‌ను ప్రారంభించింది. దేశంలో పెరుగుతున్న వివాహ మార్కెట్ ట్రెండ్‌ను అందిపుచ్చు కునేందుకు ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంఎన్పీఎల్ పథకం రాడిసన్ హోటల్లలో లభిస్తోంది. అంటే పెళ్లి ఖర్చుల కోసం ఇక్కడ రుణాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి ఈ ఆఫర్ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అందుబాటులో ఉంది. ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని ప్రముఖ ప్రదేశాల తోపాటు, జైపూర్, చండీగఢ్, పూణేలోని హోటళ్లలో త్వరలోనే ప్రారంభిస్తున్నారు. అలాగే దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నామని సంకాష్ సహ వ్యవస్థాపకుడు సీఈవోఆకాష్ దహియా తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి తమ రాడిసన్ హోటళ్లలో ఈ ఆఫర్ అందుబాటులో రానుందని చెప్పారు. ఈ స్కీం అందుబాటులో ఉన్న హోటళ్లలో సగటున రోజుకు 50కి పైగా ఎంక్వయిరీలు వస్తున్నాయట. గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు పేరుగాంచిన రాజస్థాన్, ఆగ్రా తదితర చోట్ల ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందించడంపై దృష్టి పెట్టామని ఉద్యోగ్ విహార్‌లోని రాడిసన్ గురుగ్రామ్ జనరల్ మేనేజర్ నమిత్ విజ్ అన్నారు. ఎంఎన్పీఎల్ ఎలా పని చేస్తుంది? ► గరిష్టంగా రూ. 25 లక్షలు దాకా రుణం పొందవచ్చు. ఆరు లేదా 12 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ►ఎంచుకున్న కాల వ్యవధిలో ఆరు నెలలు వడ్డీ లేకుండా లేదా 12 నెలలకు 1 శాతం వడ్డీతో సంకాష్ NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) లకు EMI (సమానమైన నెలవారీ వాయిదా) చెల్లించాలి. ► కస్టమర్ల ఐడీ, డ్రస్ పప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్లు, పేస్లిప్, ITR (ఆదాయపు పన్ను రిటర్న్‌లతో కూడిన థర్డ్-పార్టీ డేటా ద్వారా రుణం ఎంత ఇవ్వాలి అనేది అంచనా వేస్తారు. ఈ ఏడాది దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు దేశీయంగా మ్యారేజ్ మార్కెట్ దాదాపు 4 ట్రిలియన్ డాలర్లని అంచనా. ఈనేపథ్యంలో .ఈ పథకం కింద 24లో రూ. 100 కోట్లరుణాలివ్వాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 35 లక్షల జంటలు పెళ్లి చేసుకోబోతున్నాయి. కనీసం 3 వేల జంటలను పట్టుకున్నా. తమకు రూ.500 కోట్ల మార్కెట్‌ను వస్తుందని కంపెనీ భావిస్తోంది. . తమ పెళ్లి కుటుంబాలకు ఆర్థికభారం కాకూడదని భావిస్తున్న యువకులు/విద్యావంతులైన జంటలకు ఇది ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు -
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు: ‘పే లేటర్’ జోలికి వెళ్లకండి, ఎందుకంటే!
ప్ర. నేను 31–07–2022న రిటర్న్ దాఖలు చేశాను. ఆ రోజు నాటికి రూ. 1,00,000 ట్యాక్స్ చెల్లించాలి. నగదు లేకపోవటం వల్ల ‘పే లేటర్‘ అని ఆప్షన్ పెట్టి ఫైల్ చేశాను. నిన్ననే ఆర్డర్లు వచ్చాయి. రూ. 5,000 పెనాల్టీ కట్టమని. ఏం చేయాలి? – విశ్వనాధ లక్ష్మీ, హైదరాబాద్ జ. చట్టప్రకారం ట్యాక్స్ కట్టలేని పరిస్థితుల్లో గడువు తేదీ లోపల రిటర్ను వేసుకోవడానికి అవకాశం ఇది. సాధారణంగా పూర్తిగా పన్నులు చెల్లించి, రిటర్నులు వేయాలి. విధిలేని పరిస్థితుల్లో ‘పే లేటర్‘ ఆప్షన్‌ను ఉపయోగించి కూడా రిటర్ను వేయవచ్చు. నిజానికి చాలామంది మీలాగే రిటర్నులు వేశారు. కానీ పెనాల్టీ రూ. 5,000 పడకుండా బయటపడవచ్చు. అయితే, జరుగుతున్నది ఏమిటంటే.. ► సాధారణంగా ఇలాంటి రిటర్నుని డిఫెక్టివ్ రిటర్నుగా భావిస్తారు. ►డిఫెక్టివ్ రిటర్నుగా భావించినప్పుడు నోటీసు ఇచ్చి 15 రోజుల లోపు సర్దుబాటు చేస్తారు. ►అలా చేయకపోతే రిటర్ను వేసినట్లు కాదు. 31–07–2022 లోపల రిటర్ను వేసి, ఆ తేదీలోపల ‘వెరిఫికేషన్‘ పూర్తయితే, ఇటువంటి కేసుల్లో రూ. 5,000 చెల్లించమని ఆర్డర్లు రావటం లేదు. కానీ ఏదో ఒక కారణం వల్ల .. ఉదాహరణకు, సైటు మొరాయించడమో, రిజక్ట్ అవ్వటమో, ఇతర సాంకేతికలోపం వల్లో 31–07–2022 లోగా రిటర్ను వెరిఫికేషన్ పూర్తి కాకపోతే, రూ. 5,000 చెల్లించమని నోటీసులు వస్తున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ►మీ రిటర్ను ..డిఫెక్టివ్ రిటర్ను అయినట్లు ►మీరు పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఎందుకంటే, రిటర్ను లేటుగా వేశారు కాబట్టి. ►ఆలస్యంగా వేసినందుకు 234 అ ప్రకారం వడ్డీ కూడా చెల్లించాలి. ►పన్నుభారం లేకపోతే 234 అ వడ్డీ పడదు. ►రిఫండు మీద వడ్డీ రాదు. ►నష్టాలుంటే రాబోయే సంవత్సరానికి సర్దుబాటు చేయరు. ►చెల్లించాల్సిన పన్నులు చెల్లించాలి. ►రివైజ్డ్ రిటర్న్ వేయనవసరం లేదు. రిటర్న్‌ని రివైజ్ చేయనక్కర్లేదు. ►నోటీసుకి జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వటం అంటే కట్టిన చలాన్ల వివరాలు ఇవ్వడమే. చివరిగా చెప్పాలంటే ఈ ‘పే లేటర్‘ ఆప్షన్ కంటికి ఆకర్షణీయంగా కనబడేది. ‘దూరపు కొండలు నునుపు‘ అన్న సామెతలాంటిది. ఇదొక ‘చిక్కు‘ లాంటిది. పెనాల్టీ తప్పదు. వడ్డీ తప్పదు. వివరణ తప్పదు. సవరణ తప్పదు. జవాబు తప్పదు. చెల్లింపూ తప్పదు. అందుకే ‘పే లేటర్‘ జోలికి పోకండి. ఎలాగూ ట్యాక్స్ చెల్లించక తప్పదు, రిటర్ను వేయకాతప్పదు. ’ఆలస్యం అమృతం విషం’ అని గుర్తెరిగి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
పండగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ మరో ఆఫర్ !
Flipkart Pay Later Limit: పండగ వేళ కస్టమర్లకు మరో ఆఫర్‌ని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ కామర్స్ ఫ్టాట్ఫామ్పై తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసి తదుపరి నెలలో బిల్ పే చేసే అవకాశాన్ని పే లేటర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. కొత్త వారికి అవకాశం ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పది కోట్ల మంది కష్టమర్లకే ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. పండగ సీజన్‌ని పురస్కరించుకుని మరింత మందికి పే లేటర్ అవకాశం కల్పిస్తోంది. పే లేటర్ ఆప్షన్ పొందాలని అనుకునే వారు ఆధార్‌కార్డు, బ్యాంకు డిటైల్స్ అందివ్వడం ద్వారా పే లేటర్‌ని ఏనేబుల్ చేసుకోవచ్చు. కొత్తగా పది కోట్ల మందిని ఈ ఆప్షన్ పరిధిలోకి తేవాలని ఫిప్కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో మోర్ ఆన్ ఫ్లిప్‌కార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి క్రెడిట్ ఆప్షన్‌లోకి వెళితే పే లేటర్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈ ఆప్షన్ని పొందవచ్చు. లిమిట్ పెంపు పే లేటర్ ఆప్షన్లో ప్రస్తుతం క్రెడిట్ లిమిట్ కేవలం రూ. 10,000గానే ఉంది. తాజాగా ఈ మొత్తాన్ని రూ. 70,000లకు పెంచుతూ ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్లో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్రెడిట్ లిమిట్‌ను పెంచినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. పే లేటర్ ఆప్షన్లో వినియోగించిన మొత్తాన్ని కస్టమర్లు తమ వెసులుబాటును బట్టి ఏడాదిలోగా ఈఎంఐ పద్దతిలో చెల్లించే వీలు సైతం కల్పించింది. పే లేటర్ ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు సందర్భంగా పదే పదే బిల్లులు చెల్లింపులు చేయడానికి బదులు నెలలో జరిగిన చెల్లింపులకు ఒకే సారి బిల్లును పొంది,ఆ మొత్తాన్ని తదుపరి నెలలో ఒకే సారి చెల్లించవచ్చు. అంతేకాదు క్రెడిట్కార్లు లేక కోనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న వారికి సైతం ఈ పే లేటర్ ఆప్షన్ ఉపయుక్తంగా ఉంటుంది. చదవండి: వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు...! -
కరోనా అనిశ్చితి: చేతిలో డబ్బున్నా.. వాయిదాల్లోనే!
చెన్నై: కరోనా వైరస్ మహమ్మారిపరమైన అనిశ్చితితో కొనుగోలుదారుల ఆలోచనా విధానాలు మారుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఉద్యోగాల్లో కోత, జీతాల్లో కటింగ్‌లు వంటి పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏం అవసరం వస్తుందోనని చేతిలో ఉన్న డబ్బును కొనుగోళ్లకు ఖర్చు చేయకుండా, దాచిపెట్టుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. నగదు పెట్టి కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ నెలవారీ వాయిదా చెల్లింపు (ఈఎంఐ) విధానాల్లో కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫ్రిజ్‌లు, టీవీలు, ఫోన్లు మొదలుకుని ద్విచక్ర వాహనాలు దాకా అన్నీ ఈఎంఐల్లో లేదా ’బై నౌ పే లేటర్’ (ముందు కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం–బీఎన్‌పీఎల్) మార్గాల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో బీఎన్‌పీఎల్ స్కీములకు ఆదరణ పెరుగుతోంది. చదవండి: పసిడి బాండ్ ధర @ రూ. 4,732 డిజిటల్ చెల్లింపుల సంస్థ ఈజీట్యాప్ ద్వారా జరిగే ఈఎంఐ లావాదేవీల పరిమాణం గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 220 శాతం వృద్ధి చెందడం ఇందుకు నిదర్శనం. ‘‘క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పాయింట్ ఆఫ్ సేల్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా కూడా ఈఎంఐలను ప్రాసెస్ చేసే సౌలభ్యం ఉండటం .. అలాగే యువతలో బీఎన్‌పీఎల్ స్కీములకు పెరుగుతున్న ప్రాధాన్యత తదితర అంశాలు నెలవారీ వాయిదాల మార్గంలో కొనుగోళ్లు జరగడానికి దోహదపడుతున్నాయి’’ అని ఈజీట్యాబ్ ప్రోడక్ట్స్ విభాగం హెడ్ భాస్కర్ చటర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా పలు బీఎన్‌పీఎల్ పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తమ యాప్‌లో పే–లేటర్ సర్వీసులను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ తమ అనుబంధ సంస్థ ఫ్రీచార్జి ద్వారా కొత్త కస్టమర్ల కోసం బీఎన్‌పీఎల్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ లావాదేవీల జోరు.. కరోనా వైరస్ కట్టడి కోసం తొలిసారి లాక్డౌన్ అమలు చేసిన 250 రోజులతో పోలిస్తే (2020 మార్చి 25 నుంచి నవంబర్ 29 మధ్యకాలం), తర్వాతి 250 రోజుల్లో (2020 నవంబర్ 30 నుంచి 2021 ఆగస్టు 6 వరకూ) డిజిటల్ లావాదేవీలు ఏకంగా 80 శాతం పెరిగాయని ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే వెల్లడించింది. వ్యాపార సంస్థలు ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చే కొద్దీ డిజిటల్ లావాదేవీల పరిమాణం సదరు 500 రోజుల్లో గణనీయంగా పెరిగినట్లు ఒక నివేదికలో వివరించింది. పే లేటర్, కార్డురహిత ఈఎంఐలు వంటి కొత్త విధానాల వినియోగం కూడా పెరిగినట్లు పేర్కొంది. పే లేటర్ లావాదేవీలు 220 శాతం, కార్డురహిత ఈఎంఐ లావాదేవీలు 207 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. చౌకైన చెల్లింపు విధానాలకు కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని రేజర్‌పే తెలిపింది. మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డిజిటల్ చెల్లింపుల గణాంకాల ప్రకారం.. తరచుగా జరిగే డెబిట్ లావాదేవీలు (ఈఎంఐలు, బీమా ప్రీమియం మొదలైనవి) 4.13 కోట్ల నుంచి 5.77 కోట్లకు పెరిగాయి. విలువపరంగా చూస్తే రూ. 35,351 కోట్ల నుంచి రూ. 61,303 కోట్లకు ఎగిశాయి. ‘‘కోవిడ్ కారణంగా దాదాపు అందరి ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం పడింది. దీంతో చాలా మంది వీలైనంత ఎక్కువగా డబ్బు చేతిలో ఉంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారని, ఈఎంఐల వైపు మొగ్గుచూపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి’’ అని మొబైల్ ఆధారిత ఇన్స్టంట్ క్రెడిట్ కార్డుల సంస్థ గెలాక్సీకార్డ్ వ్యవస్థాపకుడు అమిత్ కుమార్ తెలిపారు. చదవండి:బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. -
మేక్ మై ట్రిప్‌లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ‘మేక్ మై ట్రిప్’ బంపర్ ఆఫర్ ప్రకటించింది. విమాన ప్రయాణీకుల సౌలభ్యం కోసం వినూత్న ఆఫర్‌ను శుక్రవారం ప్రకటించింది. ప్రయాణీకుల చెల్లింపులకు సంబంధించి 'పే లేటర్' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ అవకాశాన్ని ఇంకా విస్తరించే వ్యూహంలో భాగంగా వివిధ వ్యాపార సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్టు వెల్లడించింది. గోఐబిబో, రెడ్‌బస్ లాంటి అన్ని ఫ్లాట్‌ఫాంలలో పే లేటర్ ఫీచర్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నామని మేక్‌మై ట్రిప్ ఒక ప్రకటనలో తెలిపింది. 'పే లేటర్' ఫీచర్‌తో తమకు అత్యంత విలువైన వినియోగదారుల కోసం ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ అనుభవంలో సౌలభ్యాన్ని విశ్వాసాన్ని, పటిష్టం చేయడంతో పాటు క్రెడిట్ యాక్సెస్ అవసరాన్ని నెరవేర్చడమే లక్ష్యమని మేక్ పై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఇండియా రాజేష్ మాగో అన్నారు. దేశీయ అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్కంపెనీగా తాము అడ్వాన్స్స్డ్ మెషీన లెర్నింగ్ ద్వారా టార్గెట్ సెగ్మెంట్స్‌ను గుర్తించే సామర్ధ్యాన్ని, కస్టమర్ల కొనుగోలు శైలిని గమనించే ఇంటర్నల్ డేటాను కలిగి ఉన్నామని పేర్కొన్నారు. పలు విమానయాన సంస్థల విమాన టికెట్ బుకింగ్‌లో విశిష్ట సేవలను అందిస్తున్న మేక్ మై ట్రిప్ ..దేశవ్యాప్తంగా 45వేల హోటళ్ళు, 13,500 ప్రత్యామ్నాయ వసతి గృహాలతోపాటు, 5లక్షలకు పైగా విదేశీ హోటళ్ళ బుకింగ్ సదుపాయం, ఇంకా ఇతర సేవలను అందిస్తుంది. -
రైల్వే తత్కాల్ ప్రయాణీకులకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్న రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ ఊరట నిచ్చింది. ముఖ్యంగా అత్యవసరంగా ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు టికెట్‌ను ఆన్లైన్లో తక్షణం బుక్ చేసుకుని, పేమెంట్ తరువాత చేసే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటివద్ద చెల్లించే (పే ఆన్ డెలీవరీ) సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు బుధవారం ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్టీసీ) వెబ్ సైట్లో తత్కాల్ కోటా కింద బుక్ చేసుకున్న టిక్కెట్లకు డబ్బును తరువాత చెల్లించవచ్చని ఐఆర్సీటీసీ బుధవారం ప్రకటించింది. ఇంతవరకు, ఈ సేవ సాధారణ రిజర్వేషన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. తాజా నిర్ణయం ద్వారా తత్కాల్ బుకింగ్‌ల కోసం ఆ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం వినియోగదారులు irctc.payondelivery.co.in తో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ లేదా పాన్ వివరాలు జతచేయాలి. అలాగే టికెట్ బుకింగ్ చేస్తున్నప్పుడు పే-ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. డిజిటల్ డెలివరీ ఎస్ఎంఎస్ / ఇ-మెయిల్ ద్వారా తక్షణమే జరుగుతుంది. 24 గంటల లోపు పేమెంట్ స్వీకరణ జరుగుతుంది. ఒకవేళ టికెట్ల డెలివరీ లోపు క్యాన్సిల్ చేసుకుంటే చట్ట ప్రకారం భారీ జరిమానా తప్పదు. అంతేకాదు ఐఆర్సీటీసీ ఖాతా శాశ్వతంగా క్లోజ్ అవుతుంది. టికెట్లు తమ ఇంటి దగ్గర బట్వాటా చేయాలనుకుంటే, వినియోగదారులు నగదు, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ చెల్లింపు ప్రొడ్యూసర్ ఆండూరిల్ టెక్నాలజీస్ తెలిపింది. ఈ పే డెలివరీ ఫీచర్ ద్వారా వినియోగదారులు కొన్ని సెకండ్లలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కలుగుతుందని ఆండూరిల్ టెక్నాలజీస్ సీఈవో అనురాగ్ బాజ్‌పాయ్ తెలిపారు. తద్వారా ఇది లక్షలాది మంది ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తత్కాల్ బుకింగ్ సమయంలో తరచుగా డబ్బు డెబిట్ అయినా, టికెట్ బుక్ కాకపోవడం, అలాగే డబ్బులు తిరిగి మన ఖాతాలోకి చేరడానికి కనీసం 7 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఈ కొత్త ఈ లావాదేవీల వైఫల్యాలను తొలగిస్తుందని ఆయన వివరించారు. కాగా ఐఆర్సీటీసీ రోజువారీ లక్షా 30వేల తత్కాల్ లావాదేవీలను నిర్వహిస్తుంది. అయితే ఈ టికెట్ల మెజారిటీ కోటా ప్రారంభపు నిమిషాల్లోనే ఖతం కావడం కూడా తెలిసిందే. -
ఇ-టికెట్లపై రైల్వే బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: రైల్వే శాఖ ప్రయాణీకులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందు ప్రయాణించండి, తర్వాత డబ్బులు చెల్లించండి అనే కొత్త ఆప్షన్‌ను రైల్వే ప్రయాణీకులకుఅందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ కొత్త పథకం ద్వారా ఐదు రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది . అలాగే ప్రయాణించిన 14రోజుల లోపు డబ్బులు చెల్లించాలి . దీని కోసం ఐఆర్సీటీసీ ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఈ విధానాన్ని ఎంచుకునే ఇ-టికెట్లలో మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. 3.5 శాతం సేవా చార్జీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ‘బుక్ టికెట్స్ నౌ అండ్ పే లేటర్’ సర్వీసులను తమ కస్టమర్లకు అందించేందుకు నిర్ణయించామని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) అధికారి తెలిపారు. ఏ ఎక్స్ ప్రెస్ రైల్లో నైనా ఈ సేవలను పొందవచ్చని చెప్పారు. దీనికి సంబంధించింది ముంబై ఆధారిత సంస్థ ఈ పే లేటర్ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు ఐఆర్సీటిసి అధికార ప్రతినిధి సందీప్ దత్తా చెప్పారు. ఇలా టికెట్ రిజర్వ్ చేసుకునే వారు తమ ఆధార్, పాన్ కార్డు, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సేవను ఉపయోగించుకోవడానికి వీలుగా ఒన్ టైం పాస్వర్డ్ కూడా వస్తుంది. వినియోగదారుల గత చెల్లింపుల విధానం ఆధారంగా ఆ సంస్థ ఈ అవకాశం కల్పిస్తుంది. ముందు ప్రయాణించి తర్వాత డబ్బులు చెల్లించే ఈ పథకం ద్వారా ప్రస్తుతం 58 శాతం ఉన్న ఆన్లైన్ టికెట్ బుకింగ్ మరింతగా పెరుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. -
ముందు చదవండి.. తర్వాత చెల్లించండి
ఖరగ్‌పూర్: ఐఐటీలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోత విధించడంతో ఐఐటీ-ఖరగ్‌పూర్ నిధుల కోసం కొత్తదారి వెతుక్కుంది. విద్యార్థులు ఫీజు కోసం ఇబ్బందులు పడకుండా, సంస్థ ఆర్థిక భారంతో సతమతమవకుండా, ‘నేర్చుకోండి-సంపాదించండి-చెల్లించండి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగం వచ్చాక డబ్బులు విరాళంగాఇచ్చేందుకు విద్యార్థులు సుముఖంగా ఉంటే పథకంలో చేరొచ్చు. ఫీజు మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. ‘ఉద్యోగమొచ్చాక ఏడాదికి కనీసం రూ.10 వేలు చెల్లించాలి. ఒక్కో మాజీ విద్యార్థి కనీసం రూ.30 వేలిచ్చినా ఏడాదికి రూ.30 కోట్లు అవుతుంది’ అని ఐఐటీ-కేజీపీ డెరైక్టర్ పార్థ ప్రతీమ్ చక్రవర్తి చెప్పారు.