ముందు చదవండి.. తర్వాత చెల్లించండి
ఖరగ్‌పూర్: ఐఐటీలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోత విధించడంతో ఐఐటీ-ఖరగ్‌పూర్ నిధుల కోసం కొత్తదారి వెతుక్కుంది. విద్యార్థులు ఫీజు కోసం ఇబ్బందులు పడకుండా, సంస్థ ఆర్థిక భారంతో సతమతమవకుండా, ‘నేర్చుకోండి-సంపాదించండి-చెల్లించండి’ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఉద్యోగం వచ్చాక డబ్బులు విరాళంగాఇచ్చేందుకు విద్యార్థులు సుముఖంగా ఉంటే పథకంలో చేరొచ్చు. ఫీజు మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. ‘ఉద్యోగమొచ్చాక ఏడాదికి కనీసం రూ.10 వేలు చెల్లించాలి. ఒక్కో మాజీ విద్యార్థి కనీసం రూ.30 వేలిచ్చినా ఏడాదికి రూ.30 కోట్లు అవుతుంది’ అని ఐఐటీ-కేజీపీ డెరైక్టర్ పార్థ ప్రతీమ్ చక్రవర్తి చెప్పారు.