మేక్ మై ట్రిప్ ట్విటర్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ ‘మేక్ మై ట్రిప్’ బంపర్ ఆఫర్ ప్రకటించింది. విమాన ప్రయాణీకుల సౌలభ్యం కోసం వినూత్న ఆఫర్‌ను శుక్రవారం ప్రకటించింది. ప్రయాణీకుల చెల్లింపులకు సంబంధించి 'పే లేటర్' అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ అవకాశాన్ని ఇంకా విస్తరించే వ్యూహంలో భాగంగా వివిధ వ్యాపార సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్టు వెల్లడించింది.
గోఐబిబో, రెడ్‌బస్ లాంటి అన్ని ఫ్లాట్‌ఫాంలలో పే లేటర్ ఫీచర్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నామని మేక్‌మై ట్రిప్ ఒక ప్రకటనలో తెలిపింది. 'పే లేటర్' ఫీచర్‌తో తమకు అత్యంత విలువైన వినియోగదారుల కోసం ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ అనుభవంలో సౌలభ్యాన్ని విశ్వాసాన్ని, పటిష్టం చేయడంతో పాటు క్రెడిట్ యాక్సెస్ అవసరాన్ని నెరవేర్చడమే లక్ష్యమని మేక్ పై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఇండియా రాజేష్ మాగో అన్నారు. దేశీయ అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్‌కంపెనీగా తాము అడ్వాన్స్‌స్డ్ మెషీన లెర్నింగ్ ద్వారా టార్గెట్ సెగ్మెంట్స్‌ను గుర్తించే సామర్ధ్యాన్ని, కస్టమర్ల కొనుగోలు శైలిని గమనించే ఇంటర్నల్ డేటాను కలిగి ఉన్నామని పేర్కొన్నారు. పలు విమానయాన సంస్థల విమాన టికెట్ బుకింగ్‌లో విశిష్ట సేవలను అందిస్తున్న మేక్ మై ట్రిప్ ..దేశవ్యాప్తంగా 45వేల హోటళ్ళు, 13,500 ప్రత్యామ్నాయ వసతి గృహాలతోపాటు, 5లక్షలకు పైగా విదేశీ హోటళ్ళ బుకింగ్ సదుపాయం, ఇంకా ఇతర సేవలను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment