ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో కళాకారులు, నేత కార్మికులు, మహిళలు & గ్రామీణ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల సమర్థ్ ప్రయాణ మైలురాయిని చేరుకుంది. ఈ ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్థ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి 250 మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాల వారు పాల్గొన్నారు.
ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమం భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి ఉద్దేశించింది. ఇందులో మంత్రి జయంత్ చౌదరి, అతుల్ కుమార్ తివారీ (IAS), సోనాల్ మిశ్రా (IAS) వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ (SCOA) భారతదేశం అంతటా వేలాది మంది యువతకు నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సమర్థ్ ఈవెంట్‌లో నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద, ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం అంతటా వేలాది మంది యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం, సప్లై చైన్ రంగాలలో వారి ఉపాధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్లిప్‌కార్ట్ బృందం అభ్యర్థులకు 7 రోజుల ఇంటెన్సివ్ క్లాస్‌రూమ్ శిక్షణతో పాటు 45 రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ సౌకర్యాల వద్ద హ్యాండ్-ఆన్ ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్‌తో ట్రైనింగ్ వంటివి అందిస్తుంది. యువతకు ఉపాధి పెరిగితే దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా పెరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో, స్థిరమైన జీవనోపాధిని సృష్టిస్తూ దేశ ప్రగతికి దోడపడతామని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment