కస్టమర్‌ కంప్లైంట్‌.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం! | Flipkart Has To Pay Fine Rs 42000 For Not Delivering Mobile Phone After Payment | Sakshi
Sakshi News home page

కస్టమర్‌ కంప్లైంట్‌.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం!

Published Wed, Jan 4 2023 7:30 PM | Last Updated on Wed, Jan 4 2023 8:16 PM

Flipkart Has To Pay Fine Rs 42000 For Not Delivering Mobile Phone After Payment - Sakshi

ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌కు వినియోగదారుల ఫోరం షాక్‌ ఇచ్చింది. ఓ యూజర్‌ డబ్బులు చెల్లించినా మొబైల్‌ డెలివరీ చేయనందుకు రూ. 42,000 జరిమానా చెల్లించాలని బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా విధించింది. అందులో కస్టమర్‌ పేమెంట్‌ చేసిన రూ. 12,499 లకు 12 శాతం వార్షిక వడ్డీ, రూ. 20,000 జరిమానా,  చట్టపరమైన ఖర్చుల కోసం రూ. 10,000 చెల్లించాలని అధికార యంత్రాంగం తెలిపింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని రాజాజీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యూజర్‌ ఫ్లిప్‌కార్ట్‌పై ఫిర్యాదు చేశారు. ‘తాను జనవరి 15, 2022న మొబైల్‌ని బుక్ చేసుకున్నాను. వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా పూర్తి నగదుని చెల్లించి రోజులు గడుస్తున్నా కంపెనీ తనకు మొబైల్ డెలివరీ చేయలేదు. సర్వీసు విషయంలో ఫ్లిప్‌కార్ట్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఫిర్యాదులో ’పేర్కొంది. కస్టమర్‌ కేర్‌ సెంటర్‌కు ఎన్ని సార్లు కాల్‌ చేసినా ఫలితం లేకపోయేసరికి చివరికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపింది.

చదవండి: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్‌బీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement