
పసుపుబోర్డు కార్యదర్శి బాధ్యతల స్వీకరణ
సుభాష్‌నగర్: జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ నగరంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో చైర్మన్ పల్లె గంగారెడ్డి సమక్షంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో బోర్డు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మానసిక ఒత్తిడికి గురికావొద్దు
● ఇంటర్ విద్యాధికారి
రవికుమార్ సూచన
నిజామాబాద్ అర్బన్: ఈనెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ ఒక ప్రకటనలో సూచించారు. సెంటర్‌లలో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఎవరికై నా హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావొచ్చని, హాల్ టికెట్ పైన ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల ముద్ర అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో పటిష్టమైన బందోబస్తుతోపాటు ప్రతి క్షణం నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని, బయట ఎలాంటి పుకార్లు వ్యాపించినా నమ్మొద్దన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.
ఎయిడ్స్ పరీక్షలకు
‘అంబులెన్స్’
నిజామాబాద్ నాగారం: ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలకు అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో పనిచేసే అంబులెన్స్ సేవలను సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో హెచ్‌ఐవీ ఎయిడ్స్ అధికంగా ప్రబలడానికి అవకాశం ఉన్న హైరిస్క్ ప్రాంతాల్లో ముందుగా ఈ అంబులెన్స్ సేవలను ప్రణాళికా ప్రకారం నిర్వహిస్తారన్నారు. ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్, ఐఈసీ తదితర వాటిపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అంబులెన్స్‌లో ఒక ల్యాబ్ టెక్నీషియన్, కౌన్సిలర్‌తోపాటు ఏరియా ఎయిడ్స్ విభాగ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం సుధాకర్, సీపీవో మోయిజ్, నవీన్, స్రవంతి, రాజేందర్, నాగరాజు పాల్గొన్నారు.

పసుపుబోర్డు కార్యదర్శి బాధ్యతల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment