
చివరాయకట్టుకు నీరందేలా చర్యలు
నిజామాబాద్ అర్బన్: చివరాఆయకట్టు వరకు సా గు నీరందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరుపై సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు వచ్చే పది రోజులు కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సాగు రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో అవసరం మేర నీరు అందుబాటులో ఉందని, ప్రతి నీటి చుక్కనూ పూర్తిస్థాయి లో వినియోగించుకుంటూ చివరాయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గురుకులాలపై..
గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీల తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, పిల్లలకు అందించే ఆహార నాణ్యత పెరిగిందని, కామన్ మెనూ డైట్ పక్కాగా అమలు అవుతోందని సీఎస్ శాంతికుమారి అన్నారు. సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ నిషేధంలో ప్రజలను భాగస్వామ్యం చేయాల న్నా రు. కలెక్టర్ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
రానున్న 10 రోజులు
అప్రమత్తంగా ఉండాలి
వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శాంతికుమారి
Comments
Please login to add a commentAdd a comment