Farmers Bank
-
రుణ ప్రణాళిక @ రూ. 8,713 కోట్లు
సుభాష్‌నగర్ : జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.8,713.34 కోట్లుగా నిర్ధేశించారు. అందులో పంట రు ణాల లక్ష్యం రూ.4,062.20 కోట్లు కాగా, ఏటీఎల్ (అగ్రికల్చ ర్ టర్మ్ రుణాలు) రూ.2,506 కోట్లు లక్ష్యంగా పెట్టుకు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు లింకేజీ (ఐకేపీ) లక్ష్యం రూ.653 కోట్లు, అర్బన్ ప్రాంతంలో (మెప్మా) రూ.100 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ధేశించుకున్నారు. ఇతర విభాగాలు ఎంఎస్ఎంఈకు రూ.1,646.87 కోట్లు, ఓపీఎస్‌కు రూ.298.17 కోట్లు, ఎన్పీఎస్కు రూ.200 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా 2023–24వ ఆర్థిక సంవత్సరానికి రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వివిధ విభాగాలకు కలిపి రూ.914.96 కోట్లు (11.74శాతం) ప్రజలకు రుణాల రూపంలో అందజేశారు. గతేడాది 71.72 శాతం.. గతేడాది రుణ ప్రణాళిక లక్ష్యం రూ.7798.38 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రుణాలు రూ.13,690.37 కోట్లు (175. 56శాతం) అందజేశారు. కానీ పంట రుణాలు లక్ష్యం చేరలే దు. పంటరుణాలు రూ.3,846.9 కోట్లు లక్ష్యంగా పెట్టుకో గా, రూ.2,758.68 కోట్లు (71.72శాతం) మాత్రమే పంపిణీచేశారు. రూరల్ ప్రాంతాల్లో బ్యాంకు లింకేజీ 249.4 శాతం, అర్బన్ ప్రాంతంలో 187.47శాతం వరకు రుణాలిచ్చారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకరించాలి లక్ష్యం మేరకు పంట రుణాలు మంజూరు చేసి రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకరించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశమందిరంలో బ్యాంకుల వారీగా రుణాల మంజూరుపై బ్యాంకు మేనేజర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా చిత్రామిశ్రా మాట్లాడుతూ జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు బ్యాంకుల వారీగా పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు, రుణాలు సకాలంలో మంజూ రు చేయాలన్నారు. వీధి రుణాలు అర్హులందరికీ మంజూరు చేయాలన్నారు. ఈ సందర్భంగా 2023–24కు గాను జిల్లా రుణ ప్రణాళికను విడుదల చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ చందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, మెప్మా పీడీ రాములు, ఆర్బీఐ అధికారి అనిల్‌కుమార్, నాబార్డు డీడీఎం ప్రవీణ్‌కుమార్, అన్ని బ్యాంకుల అధికారులు, గ్రా మీణాభివృద్ధిశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నదాతల ముంగిటకే బ్యాంకు.. రూ.25వేల వరకు విత్‌డ్రా
సాక్షి, అమరావతి: అన్నదాతలకు రకరకాల సేవలందిస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో సేవకు శ్రీకారం చుడుతోంది. ఇక నుంచి బ్యాంకింగ్ సేవలను కూడా వీటి ద్వారా రైతుల ముంగిటకే తీసుకురానుంది. దీంతో ఇన్నాళ్లూ బ్యాంకులో నగదు తీసుకోవాలన్నా.. జమ చేయాలన్నా.. రుణం పొందాలన్నా.. రుణాలు రీషెడ్యూలు చేసుకోవాలన్నా అన్నదాతలుసుదూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లేందుకు ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడీ కష్టాలకు తెరపడనున్నాయి. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఈ సేవలు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనుంది. సీఎం చొరవతోనే బ్యాంకులూ సై గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలున్నాయి. వీటిలో 234 అర్బన్ ప్రాంతంలోనూ..10,544 గ్రామీణ ప్రాంతంలో రైతులకు సేవ లందిస్తున్నాయి. సీజన్లో రుణాల మంజూరు, రీషెడ్యూల్‌లతో పాటు వివిధ రకాల సేవల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా రైతుల ముంగిటకే బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలందించేందుకు బ్యాంకర్లు సైతం ముందుకొచ్చారు. ఆర్‌బీకేకో బ్యాంకు కరస్పాండెంట్.. శాఖల్లేని ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సుమారు 11,500 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకున్నాయి. వీరిలో 8,500 మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరు రోజూ నాలుగైదు గ్రామాలకు వెళ్లి అక్కడ అకౌంట్లు లేని వారితో ఖాతాలు తెరిపించడం, బ్యాంకు-ఆధార్ సీడింగ్, కేవైసీ అప్డేషన్, నగదు ఉపసంహరణ వంటి సేవలందిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఆర్బీకేల్లో వీరి ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఆర్బీకేలతో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను మ్యాపింగ్ చేస్తున్నారు. కరస్పాండెంట్లు అందించే సేవలివే.. ⇒ వీరి వద్ద ఉండే మొబైల్ స్వైపింగ్ ⇒ మిషన్ ద్వారా గరిష్టంగా రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ⇒ కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ⇒ ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చు. ⇒ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే సాగు ఉత్పాదకాలతో పాటు యాంత్రీకరణ, కూలీలకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ⇒ పంట రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ⇒ కొత్త రుణాల మంజూరు, రీషెడ్యూల్ చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు చేరువలో బ్యాంకింగ్ సేవలు సీఎం వైఎస్ జగన్ చొరవతో ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకర్లుముందుకొచ్చారు. డిపాజిట్లు, విత్‌డ్రాలతో పాటు ఇన్పుట్స్, పండించిన పంటల కొనుగోళ్లు వంటి వాటి విషయంలో నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు రైతులకు తోడ్పాటునందిస్తారు. సమీప భవిష్యత్‌లో పంట రుణాల మంజూరు, రీషెడ్యూల్ కూడా ఆర్బీకేల్లో అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
సామాన్యుల అవసరాలు తీర్చడమే లక్ష్యం
రాజమహేంద్రవరం సిటీ/అమలాపురం: ‘సామాన్యులు మనల్ని కోట్లు అడగడం లేదు. బంగారం.. మేడలు అడగడం లేదు. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామీణులు మెరుగైన వైద్యం అడుగుతున్నారు. అభివృద్ధి కోసం భూమి ఇచ్చిన రైతులు పరిహారం..యువత ఉద్యోగాలు.. అడుగుతున్నారు. మహిళలు రక్షణ కల్పించాలని, ఉద్యోగాలు చేసే మహిళలు వాళ్ల పిల్లలకు శిశుసంరక్షణ కేంద్రాలు అడుగుతున్నారు. వారి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా జనసేన మేనిఫెస్టో రూపొందించాము’అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్‌కల్యాణ్ తమ పార్టీ అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చింది చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తి అని నమ్మానని, కానీ ఆయన పాలనంతా ఇసుక మాఫియా, జన్మభూమి కమిటీల దోపిడీల పరంపరగా సాగిందన్నారు. ‘నన్ను తిడితే పట్టించుకోను. కానీ సామాన్యుల జోలికొస్తే మాత్రం తాట తీస్తానని’తన సహజ ధోరణిలో మండిపడ్డారు. తనకు లోకేశ్, జగన్‌పై వ్యక్తిగత కోపం లేదని, వారి విధానాలపైనే నా పోరాటమని అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా మోసం చేశారన్నారు. ‘సీఎం చంద్రబాబు మీద కోపం ఉంటే.. ఆయన మీద చూ పించండి. మా రాష్ట్రం మీద ఎందుకు చూపిస్తారని’ప్రశ్నించారు. చంద్రబాబు ఆరు నెలలకు ఒకమాట మాట్లాడతారని ఎద్దేవా చేశారు. పవన్ సోదరుడు సినీనటుడు నాగేంద్రబాబు, ఎంపీ అభ్యర్థులు ఆకుల సత్యనారాయణ, డీఎమ్మార్ శేఖర్, సినీనటుడు జి.ఎన్.నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ తన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. -
ఇన్పుట్ సబ్సిడీ విడుదల
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ప్రభుత్వం ఎట్టకేలకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. 2011, 2012 సంవత్సరాల్లో అనావృష్టి పరిస్థితులతో పంట కోల్పోయిన రైతులకు త్వరలో పెట్టుబడి రాయితీ లభించనుంది. ఈ మేరకు జీవో విడుదలైనా.. వ్యవసాయ శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి ఇన్పుట్ సబ్సిడీ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడానికి మరో నెల రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. 2011వ సంవత్సరంలో అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ చాలా వరకు పంపిణీ చేసినా.. చివరన రూ.21.91 కోట్లను ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు మళ్లించింది. 2012 నవంబర్ నెల నుంచి వేలాది మంది రైతులు ఇన్పుట్ సబ్సిడీ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా జీవోతో వీరికి ఊరట లభించనుంది. 2012లోనూ వర్షాభావ పరిస్థితులతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రూ.239 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఈ మేరకు రైతుల పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు, ఇన్పుట్ సబ్సిడీ వివరాలను హైదరాబాద్‌కు పంపితే పరిహారం విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా మొదటి దశలో పంపిన వివరాల మేరకు రూ.198 కోట్లు విడుదల చేయగా.. ఆయా ఖాతాలకు జమ చేశారు. రెండో విడతలో 22,100 మంది రైతులకు రూ.14,13,23,194, మూడో విడతలో 17,217 మంది రైతులకు రూ.10,46,02,189, నాల్గో విడతలో 3,470 మంది రైతులకు రూ.2,13,90,160 పరిహారం కోసం ప్రతిపాదనలు పంపారు. పెండింగ్‌లోని మూడు విడతలకు సంబంధించి 42787 మంది రైతులకు రూ.26,73,15,543లు మంజూరైంది. వారం, పది రోజుల్లో ట్రెజరీ ప్రక్రియను పూర్తి చేసి బ్యాంకుల వారీగా డీడీలు ఇచ్చి రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తామని జేడీఏ ఠాగూర్ నాయక్ తెలిపారు. ఇదిలాఉండగా 2010 జల్ తుపాను నుంచి 2013 అక్టోబర్ నెల భారీ వర్షాల వరకు ఇన్పుట్ సబ్సిడీ రూ.7.60 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.