చెరుకు సాగులో జాగ్రత్త | Beware of sugarcane growers | Sakshi
Sakshi News home page

చెరుకు సాగులో జాగ్రత్త

Published Thu, Nov 6 2014 2:34 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM

Beware of sugarcane growers

ఈ పురుగులతో జర భద్రం
 పొలుసు పురుగు
 కణుపు ఏర్పడినప్పటి నుంచి చెరుకు నరికే వరకూ పొలుసు పురుగు ఆశిస్తుంది. నీటి ఎద్దడి ఉంటే మరింత నష్టపరుస్తుంది. నివారణకు విత్తనపు దవ్వను పొలుసు పురుగు అశించని తోటల నుంచి సేకరించాలి. మూ డు కాళ్ల చెరుకు గడలను మలాథియన్ 2.0 మిల్లీలీటర్ల లేదా థైమిథోయేట్ 1.7 మిల్లీలీట ర్ల మందును లీటర్ నీటిలో కలిపి 15 నిమిషాల్లో ముంచి నాటాలి. చెరుకులో పురుగు వ్యాప్తిని అరికట్టడానికి ఆకులు తుంచి(మొవ్వలో 8 ఆకులు ఉంచి) ైడె మిథోయేన్ 3 మిల్లీలీటర్ల నీటిలో పిచికారీ చేయాలి.

 కాండం తొలుచు పురుగు
 చెరుకు నాటినప్పటి నుంచి నరికే వరకు ఈ పురుగు సోకి పంట నష్టపరుస్తుంది. చెరుకు బాల్య దశలో పీక పురుగుగా పంటకు నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు ఎక్కువగా వర్షాధార పంటపై సోకుతుంది. నివారణకు లోతైన కాలువలో చెరుకు గడలు నాటాలి. నాటే ముందు మిథైల్ పారాథియాల్ పొడి మందును ఎకరాకు 10 కిలోల చొప్పున వేయాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గరదగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. ఎండోసల్ఫాన్ రెండు మిల్లీలీటర్ల మందును లీటరు నీటిని కలిపి నాటిన 4,6,9 వారాల్లో పిచికారీ చేయాలి.

 కాటుక తెగులు
 ఈ తెగులు సోకిన చెరుకులో మొక్కలోని మొవ్వ పొడవైన నల్లని కొరడాగా మారుతుంది. దిగుబడి, రసం నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు విత్తనపు గెనువుల ద్వారా వ్యాపిస్తుంది. మూడు కాళ్ల గెనువులను వేడి నీటిలో మూడు నిమిషాలు లేదా తేమతో మిళితమైన గాలిలో 2 గంటలు విత్తనశుద్ధి చేయాలి.

 గుడ్డిదుబ్బు తెగులు
 ఈ తెగులు ఆశించిన మొక్కల మొదళ్ల నుంచి సన్నని తెల్లని పిలకలు అధికంగా వస్తాయి. ఆకులు పొలిపోయి చిన్నవిగా కనిపిస్తాయి. మొక్కలు గడ్డిదుబ్బలు మాదిరి గా ఉంటాయి. నివారణకు తెగులు సోకిన మొక్కలను తోటల నుంచి వేరు చేయరాదు. దుబ్బలను తవ్వి తగులపెట్టాలి. విత్తనపు ముచ్చెలను వేడి నీటిలో గానీ, తేమతో మిళి తమైన వేడి గాలిలో గానీ శుధ్ది చేయాలి. కీట కాలను నివారించడానికి మలాథియాన్ లేదా డైమిథోయేట్ రెండు మిల్లీలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేయాలి.

 అడవి పందుల నుంచి రక్షణ
 కందకాల తవ్వకం
 పొలం చుట్టూ రెండు అడుగుల వెడల్పు. ఒకటిన్నర అడుగుల లోతులో కందకాన్ని తవ్వినట్లుయితే అడవి పందులు పొలంలోకి రాకుండా నిరోధించవచ్చు. అలాగే వర్షాభావ సమయంలో కందకాల్లో నిల్వ ఉన్న నీరు పొలాన్ని తేమగా ఉంచుతుంది. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగతాయి.
 
విషపు ఎరలు
     గోధుమ పిండిలో ఉల్లిపాయ, వెల్లుల్లిని మొత్తగా చూర్ణం చేసి కలిపి పొలం చుట్టూ పెట్టాలి.
     ఈ ఉండలను పందులు తినడం అలవాటు చేసుకుంటాయి.
     ఆ తర్వాత సోడియం మోనోప్లోరో ఎసిటేట్ లేదా వార్‌ఫెరిన్ కలిపిన ఉండలను పెట్టాలి.
     వీటిని తిన్న పందులు అజీర్ణానికి లోనై దరిదాపులకు రావు.
 
రసాయనిక పద్ధతులు
     ఫోరేట్ గుళికలను ఇసుకలో కలిపి చిన్నచిన్న సంచుల్లో కట్టి పంట చూట్టూ అక్కడక్కడ కర్రలను నాటి వేలాడదీయాలి.
     గాలితో పంట చుట్టూ పరిసరాల్లో ఫోరేట్ గుళికల నుంచి ఘాటైన వాసన వస్తుంది. ఈ వాసనకు అడవి పందులు పంటలోకి వచ్చేందుకు జంకుతాయి.
     కుళ్లిన కోడిగుడ్ల ద్రావణాన్ని తీసుకుని నీటిని కలిపి పొలం చుట్టూ చల్లడం ద్వారా దుర్గంధం వచ్చి పందులు ఆవైపు రావు.

 వెంట్రుకలు వెదజల్లాలి
     క్షౌరశాలలో దొరికే వ్యర్థ వెంట్రుకలను సేకరించి పంట పొలం గట్లపై ఒక అడుగు వెడల్పులో చల్లాలి.
     పంటను తినేందుకు వచ్చిన పందులు వీటి వాసన చూడగానే వెంట్రుకలు ముక్కులోకి వెళ్లి శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతాయి.
     ఊర పందుల విసర్జనాలను పొలం చుట్టూ చల్లితే వచ్చే దుర్వాసనకు అడవిపందులు దూరంగా ఉంటాయి.
     అలాగే వేటకుక్కలతో పందులను తరమడం, టపాసుల పేల్చడంతో వంటి పద్ధతులతో కూడా పందులు రాకుండా నివారించవచ్చు.
 
జీవ కంచెలు
     ఒక రకమైన పంట పొలాన్ని కాపాడుకోవాలంటే దాని చుట్టూ నాలుగు వరుసుల్లో మరో పంట మొక్కలను పెంచడంతో పందుల బారి నుంచి రక్షించుకోవచ్చు.
     వేరుశెనగ పంట చుట్టూ నాలుగు వరుసల్లో కుసుమ పంటను వేయడం ద్వారా ఆ మొక్కకు ఉన్న ముళ్లు అడవి పందులను గాయపర్చే అవకాశం ఉంది.
     అలాగే కుసుమ ఘాటుగా ఉండటంతో పం దులు వేరుశెనగ మొక్కను గుర్తించలేవు.
     మొక్కజొన్న పంట చుట్టూ అముదం వేసి రక్షించు కొవచ్చు.
 
ఇనుప కంచే ఏర్పాటుతో
     పంట చుట్టూ బలమైన కర్రలు పాతి వీటికి ఒక అడుగు ఎత్తులో ముళ్లను కలిగి ఉన్న ఇనున తీగను ఏర్పాటు చేయాలి.
     ఒక ఎకరా పొలం చుట్టూ ముళ్ల కంచె వేయడానికి సూమారు రూ.10 వేల నుంచి రూ 15 వేల వరకు ఖర్చవుతుంది.
     వలయాకారంలో ఉండే ముళ్ల కంచెను కూడా వేయవచ్చు.
     పందులు కంచెను దాటే సమయంలో పదునుగా కంచె ముళ్లు పందిని గాయపరుస్తాయి.
     ఒకసారి గాయపడిన పంది మళ్లీ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించవు.
 
సోలార్ ఫెన్సింగ్
     పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కంచెను ఏర్పాటు చేసి పందుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు.
     సోలార్ ప్లేట్ల నుంచి సూమారు 12 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
     పందులు కంచెను తాకినప్పడు షాక్‌కు గురువుతాయి. ఈ దెబ్బతో అడవిపందులు పారిపోతాయి.
     తక్కువ సామర్థ్యం గల విద్యుత్‌తో ఇలా చేయడంతో మనుషులకు, జంతువులకు ఎలాంటి ప్రాణహాని ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement