టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్ కొత్త మైలురాయి | Tata Power Solar rooftop crosses 150000 installations | Sakshi
Sakshi News home page

టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్ కొత్త మైలురాయి

Published Sat, Mar 22 2025 9:21 PM | Last Updated on Sat, Mar 22 2025 9:26 PM

Tata Power Solar rooftop crosses 150000 installations

దేశంలోనే నంబర్ వన్ రూఫ్‌టాప్ సోలార్ ప్రొవైడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ టాటా పవర్ దేశవ్యాప్తంగా 1,50,000 రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ల మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ల మొత్తం సామర్థ్యం ఇప్పుడు సుమారు 3 గిగా వాట్లకు చేరింది. భారతదేశ పునరుత్పాదక విద్యుత్ పరివర్తనలో కంపెనీ పోషిస్తున్న కీలక పాత్రకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

దేశంలోని 700 పైచిలుకు నగరాల్లో కార్యకలాపాలతో టాటా పవర్ రెన్యువబల్ ఎనర్జీ లిమిటెడ్‌లో (TPREL) భాగమైన టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్, సుస్థిరమైన, విద్యుత్తును ఆదా చేసే భవిష్యత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రస్థానంలో ముందువరుసలో ఉంటోంది.కంపెనీ తమ తమిళనాడు ఫ్యాక్టరీలో ఏఎల్‌ఎంఎం ఆమోదిత సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సహా 20 పైగా ఆర్థిక భాగస్వాముల ద్వారా టాటా పవర్ సరళతరమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. తద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత చౌకగా, అందరికీ అందుబాటులోకి తెస్తోంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాలు, తమ ఫ్లాగ్‌షిప్ ‘ఘర్‌ఘర్ సోలార్’ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల అమల్లో కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది.

టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్ కంపెనీకి దేశవ్యాప్తంగా 300 పైచిలుకు నగరాల్లో 575 పైగా చానల్ పార్ట్‌నర్లు, 400 పైగా నగరాల్లో 225 పైగా అధీకృత సర్వీస్ భాగస్వాములు ఉన్నారు. రెసిడెన్షియల్ రంగంలో 1,22,000 పైగా వినియోగదారులు సహా 1.5 లక్షలకు పైగా కస్టమర్ల బేస్‌తో కంపెనీ పటిష్టమైన స్థానాన్ని దక్కించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement