tata power
-
టాటా సంస్థల త్రైమాసిక ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ నికర లాభం సుమారు రెండు శాతం తగ్గి రూ.157 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో ఇది రూ.162 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం రూ.1,269 కోట్ల నుంచి రూ.1,296 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,086 కోట్ల నుంచి రూ.1,095 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన సర్వీసుల వ్యాపార విభాగం పుంజుకుందని, 2 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసిందని సంస్థ సీఈవో వారెన్ హ్యారిస్ తెలిపారు. ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉందని, ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉండగలదని ఆయన వివరించారు. టాటా పవర్.. ఫర్వాలేదుటాటాపవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగి రూ.1,093 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,017 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.16,029 కోట్ల నుంచి రూ.16,211 కోట్లకు చేరింది. ‘ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రెన్యువబుల్ వ్యాపారం స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అన్ని విభాగాలు చెప్పుకోతగ్గ మేర పనితీరు చూపించాయి. దీంతో వరుసగా 20వ త్రైమాసికంలోనూ నికర లాభాన్ని నమోదు చేశాం. భారత్‌లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా తమిళనాడులో మేము చెపట్టిన 4.3 గిగావాట్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా.. 2 గిగావాట్ సెల్ తయారీ సెప్టెంబర్ క్వార్టర్లో మొదలైంది. వచ్చే నెల చివరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తయారీ పెరగనుంది’ అని టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!పూర్తి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్ల మూలధన వ్యయాల ప్రణాళిక ప్రకటించగా.. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.9,100 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ తయారీ, హైడ్రో ప్రాజెక్టులపై తాము చేస్తున్న పెట్టుబడులతో దేశ ఇంధన సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. బీఎస్ఈలో టాటా పవర్ 1 శాతం లాభపడి రూ.445 వద్ద ముగిసింది. -
పచ్చని కొలువులు తోడుంటే..!
2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలనేది భారత్ లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు పడుతున్నాయి. దిగ్గజ కంపెనీలు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులకు తెరతీయడంతో.. గ్రీన్ జాబ్స్‌కు ఫుల్ డిమాండ్ నెలకొంది.పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కంపెనీలు ఇప్పుడు నిపుణులకు రారామ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తోడు మరిన్ని కొత్త ప్రాజెక్టులు జతవుతుండటంతో భారీగా సిబ్బంది కొరత నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, విక్రమ్ సోలార్, జెన్సాల్ గ్రూప్ తదితర సంస్థలు నియామకాల జోరు పెంచిన వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్, వాతావరణ విశ్లేషణ, సోలార్ సెల్–మాడ్యూల్ తయారీ, కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ నిర్వహణ, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో నిపుణులకు భారీగా అవకాశాలున్నాయనేది పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు, హెచ్ఆర్ ఏజెన్సీల మాట! సౌర, పవన విద్యుత్‌తో పాటు జల, అణు విద్యుత్ ఇతరత్రా హైబ్రీడ్ ప్రాజెక్టులు రెన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తాయి. అదానీ.. 50 గిగావాట్లు బహుముఖ రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. పునరుత్పాదక ఇంధనంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. సౌర, పవన, హైబ్రీడ్ ప్రాజెక్టుల విస్తరణకు అనుగుణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రధాన కార్యకలాపాలు, మెయింటెనెన్స్‌లో నిపుణుల నియమాకాలపై దృష్టి పెట్టినట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. 2030 నాటికి 50 గిగావాట్ల (జీడబ్యూ) రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని అదానీ లక్ష్యంగా పెట్టుకుంది. డేటా సైంటిస్టులు, ఎలక్ట్రికల్–సివిల్ ఇంజినీర్లు, బిజినెస్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, సరఫరా వ్యవస్థల స్పెషలిస్టులతో పాటు పరికరాల ప్రొక్యూర్మెంట్లో అనుభవం గల వారికి కూడా కంపెనీ పెద్దపీట వేస్తోంది.హైరింగ్‌లో టాటా ‘పవర్’ ఇక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ; సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్స్–మెయింటెనెన్స్, ఇంజినీరింగ్–టెక్నాలజీ తదితర ఉద్యోగాల భర్తీలో తలమునకమైంది. భారీ ప్రాజెక్టులకు తోడు, రూఫ్‌టాప్ సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 2,500 పైగా సిబ్బంది ఉన్నారు. ‘పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు ఫాస్ట్‌ట్రాక్‌లో నడుస్తున్నాయి. ఈ మేరకు అనేక ఎంఓయూలు కుదుర్చుకున్నాం. గుజరాత్లో 10,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయి. వీటిద్వారా అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ భారీ విస్తరణ, వృద్ధికి అనుగుణంగా హైరింగ్ జోరు పెంచుతున్నాం’ అని టాటా పవర్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ హిమల్ తివారీ పేర్కొన్నారు. ఇక జెన్సాల్ గ్రూప్ బ్యాటరీలు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్–ల్యాండ్ డెవలప్మెంట్, పర్యావరణం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో నిపుణుల వేటలో ఉంది. 2024–2032 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన మార్కెట్ వార్షికంగా 8.7 శాతం వృద్ధి (సీఏజీఆర్) చెందుతుందని అంచనా. → 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించాలనేది భారత్ లక్ష్యం. → ప్రస్తుతం భారత్‌లో గ్రీన్ ఎనర్జీ (భారీ జలవిద్యుత్, అణు విద్యుత్‌తో సహా) ఉత్పత్తి సామర్థ్యం 208 గిగావాట్లు. మొత్తం విద్యుదుత్పత్తిలో ఇది దాదాపు 46%. గత 9 ఏళ్లలో 400 శాతం ఎగబాకడం విశేషం. → సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత 9 ఏళ్లలో 30 రెట్లు ఎగసి 89.4 గిగావాట్లకు చేరింది. → పవన విద్యుత్ సామర్థ్యం 2014 నుంచి ఇప్పటిదాకా రెట్టింపునకు పైగా ఎగసి 47.19 గిగావాట్లకు చేరుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
చైనా నిపుణులకు వీసాల జోరు పెంచండి
న్యూఢిల్లీ: చైనా నిపుణుల కొరత దేశీ కంపెనీలను వేధిస్తోంది. ముఖ్యంగా టాటా పవర్ సోలార్, రెన్యూ ఫోటోవోల్టాయిక్ , అవాడా ఎలక్ట్రో వంటి సోలార్ మాడ్యూల్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చైనా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల వీసా అప్లికేషన్లను వేగంగా అనుమతించాలంటూ ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా నుంచి నిపుణుల రాక ఆలస్యం కావడంతో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను పెంచలేకపోతున్నామని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మూడు కంపెనీలు తమ సోలార్ మాడ్యూల్ ప్లాంట్లలో అవసరమైన 36 మంది చైనా నిపుణుల కోసం బిజినెస్ వీసాల కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేయగా.. ఇప్పటిదాకా వాటికి అనుమతులు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో టాటా పవర్ సోలార్ అత్యధికంగా 20 మంది చైనా నిపుణుల కోసం వీసాలివ్వాల్సిందిగా కోరింది. ఈ కంపెనీ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 4 గిగావాట్ల (జీడబ్ల్యూ) గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, 4 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. దీనికోసం సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇక రెన్యూ పవర్ గుజరాత్‌లోని ధోలెరాలో, అవాడా కంపెనీ ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 500 జీడబ్ల్యూ లక్ష్యం.. 2030 నాటికి దేశంలో సౌరశక్తి, గాలి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా 500 జీడబ్ల్యూ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అధునాతన పరికరాలు, సాంకేతికత కోసం చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీ ఎగుమతుల్లో చైనా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు ముదరడంతో పాటు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు చైనా యాప్‌లను నిషేధించింది. పెట్టుబడులపై కూడా డేగకన్ను వేస్తోంది ప్రభుత్వం. చైనీయులు భారత్‌లో రాకపోకలను కూడా కఠినతరం చేసింది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యంతో పాటు వ్యయాలు పెరిగిపోయేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
టాటా పవర్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో భారీ పెట్టుబడులు వెచ్చించనుంది. కంపెనీ 105వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వాటాదారులకు పెట్టుబడి సంబంధిత అంశాలను వెల్లడించారు.వీటి ప్రకారం కంపెనీ ఈ ఏడాది రూ. 20,000 కోట్ల పెట్టుబడి వ్యయాలకు సిద్ధంగా ఉంది. వీటిలో అధిక శాతం పెట్టుబడులను పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోకు కేటాయించనుంది. మిగిలిన నిధులను విద్యుత్ ప్రసారం, పంపిణీ బిజినెస్‌పై వెచ్చించనుంది. గతేడాది కేటాయించిన రూ. 12,000 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు దాదాపు 67 శాతం అధికంకావడం గమనార్హం!కంపెనీ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల తయారీలోగల అవకాశాలను అన్వేషించనున్నట్లు టాటా సన్స్‌కు సైతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వీటికి ప్రభుత్వం అవసరమైన అనుమతులను మంజూరు చేసిన అనంతరం ఇందుకు సన్నాహాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను 15 గిగావాట్లకు పెంచుకునే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం 9 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుత, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా లక్ష్యాన్ని చేరుకోనుంది.అంతేకాకుండా తమిళనాడులో 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంటును ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క ఈవీ చార్జింగ్ విభాగంపై దృష్టి పెట్టిన కంపెనీ 530కుపైగా పట్టణాలలో 5,500 పబ్లిక్, సొంత అవసరాల చార్జర్లను ఏర్పాటు చేసింది. ఈ బాటలో 86,000కుపైగా హోమ్ చార్జర్లను సైతం నెలకొల్పింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
న్యూఢిల్లీ: టాటా పవర్ చివరి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభం 11% పుంజుకుని రూ. 1,046 కోట్ల ను తాకింది. మొత్తం ఆదాయం రూ. 13,325 కోట్ల నుంచి రూ. 16,464 కోట్లకు జంప్‌చేసింది. షేరుకి రూ. 2 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.ఇందుకు జులై 4 రికార్డ్ డేట్. పూర్తి ఏడాదికి టాటా పవర్ నికర లాభం రూ. 3,810 కోట్ల నుంచి రూ. 4,280 కోట్లకు బలపడింది. ఆదాయం సైతం రూ. 56,547 కోట్ల నుంచి రూ. 63,272 కోట్లకు ఎగసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం.కంపెనీ ప్రకటన ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.4 లక్షల కోట్లను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 61,542 కోట్ల అత్యధిక ఆదాయాన్ని, రూ. 12,701 కోట్ల ఎబిటాను సాధించింది. -
ఒక్క నిర్ణయం.. ఈవీ ఛార్జింగ్ సమస్యలకు చెక్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, పెరుగుతున్న వాహనాలకు కావలసినన్ని 'ఛార్జింగ్ స్టేషన్స్' మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (TPEVCSL).. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పవర్ అనుబంధ సంస్థ TPEVCSL దేశంలో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను పెంచడానికి IOCLతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండూ కలిసి దేశవ్యాప్తంగా సుమారు 500 కంటే ఎక్కువ హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయనున్నాయి. త్వరలో ఇన్స్టాల్ చేయనున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే కాకుండా.. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే, సేలం-కొచ్చి హైవే, గుంటూరు-చెన్నై హైవే వంటి ప్రధాన రహదారులపై ఉన్న 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' అవుట్లెట్లలో ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో లాంగ్ జర్నీ చేయాలనుకునే వారికి ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, 'టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్' యాప్ ద్వారా లేదా 'ఇండియన్ ఆయిల్ ఈ-ఛార్జ్' మొబైల్ యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చని టాటా పవర్ బిజినెస్ డెవలప్మెంట్-ఈవీ చార్జింగ్ హెడ్ వీరేంద్ర గోయల్ తెలిపారు. ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా? ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి పెరుగుతున్న సమయంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 6000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు, వీటి సంఖ్యను 2024 నాటికి 10000 చేర్చడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్యలు దాదాపు తొలగిపోతాయని స్పష్టంగా తెలుస్తోంది. -
టాటా పవర్, ఐవోసీ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 500 ఫాస్ట్, అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే దిశగా టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్, ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చేతులు కలిపాయి. ఇందుకు సంబంధించి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం (ఎంవోయూ) ఐవోసీ రిటైల్ అవుట్‌లెట్స్‌లో టాటా పవర్ చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేస్తుంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు గుంటూరు–చెన్నై హైవే, సేలం–కొచ్చి హైవే వంటి జాతీయ రహదారుల వెంట వీటిని నెలకొల్పుతుంది. దీనితో సుదూర ప్రయాణాలు చేసే ఎలక్ట్రిక్ వాహనదారులు రేంజి (మైలేజి)పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం తప్పుతుందని టాటా పవర్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్ – ఈవీ చార్జింగ్) వీరేంద్ర గోయల్ తెలిపారు. చార్జర్ల లభ్యత గురించి టాటా పవర్ ఈజెడ్ చార్జ్, ఇండియన్ఆయిల్ ఈ–చార్జ్ మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 2024 నాటికి 10,000 పైచిలుకు ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ ఈడీ సౌమిత్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
బ్రిడ్జ్‌స్టోన్ డీలర్‌షిప్‌లలో ఈవీ చార్జర్లు
న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా తమ డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జర్ల ఏర్పాటు కోసం టాటా పవర్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం గంట వ్యవధిలోనే కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలను చార్జింగ్ చేసే సామర్ధ్యం ఉండే ఫాస్ట్ చార్జర్లను టాటా పవర్ ఇన్స్టాల్ చేస్తుంది. తద్వారా ఒక్కో చార్జరుతో రోజులో 20–24 వాహనాలను చార్జింగ్ చేయడానికి వీలవుతుందని బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాజర్షి మొయిత్రా తెలిపారు. బ్రిడ్జ్‌స్టోన్ కస్టమర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనదారులందరికీ దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో ఈ చార్జర్లు 24 గంటలూ అందుబాటులోకి ఉంటాయన్నారు. ఇన్స్టాలేషన్, చార్జింగ్, మెయింటెనెన్స్, ఈ–పేమెంట్స్ మొదలైన వాటికి సంబంధించి టాటా పవర్ సహాయ, సహకారాలు అందిస్తుంది. -
జూమ్‌కార్, టాటా పవర్ ఈవీ జోడీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ తాజాగా కార్ షేరింగ్ కంపెనీ జూమ్‌కార్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జూమ్‌కార్ ప్రస్తుత, కొత్త ఈవీ కస్టమర్లు టాటా పవర్ ఈజీ చార్జ్ పాయింట్లను వినియోగించుకోవచ్చు. వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా 25,000 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని టాటా పవర్ లక్ష్యంగా చేసుకుంది. భారత్, ఇండోనేíÙయా, ఈజిప్ట్‌లో జూమ్‌కార్‌కు 20,000 పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు. -
అమెజాన్‌ను మించి.. ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్ ఏంటో తెలుసా?
ముంబై: దేశీయంగా అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ (ఉద్యోగాలు కల్పించే సంస్థ) బ్రాండ్‌గా టాటా పవర్ కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ వరుసగా రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. మానవ వనరుల సర్వీసుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా తమ వార్షిక నివేదిక ‘రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2023‘లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక స్థితి, మంచి పేరు, కెరియర్లో పురోగమించేందుకు అవకాశాలు కల్పించడం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా రాండ్‌స్టాడ్ ర్యాంకులు ఇచ్చింది. దీని ప్రకారం 2022లో 9వ స్థానంలో ఉన్న టాటా పవర్ తాజాగా నంబర్ వన్ స్థానానికి చేరింది. నివేదిక ప్రకారం ఉద్యోగులు అత్యంత ఆకర్షణీయమైన రంగంగా ఆటోమోటివ్‌కు (77 శాతం) ఓటేశారు. ఐటీ, ఐటీఈఎస్, టెలికం (76 శాతం) .. ఎఫ్ఎంసీజీ, రిటైల్, ఈ–కామర్స్ (75 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని విశేషాలు.. టాప్ 10 కంపెనీల్లో నాలుగో స్థానంలో టీసీఎస్.. ఆ తర్వాత వరుసగా మైక్రోసాఫ్ట్, శాంసంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐబీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయ స్టార్టప్ ఎంప్లాయర్‌గా బిగ్ బాస్కెట్ నిల్చింది. ఎంప్లాయర్‌ను ఎంచుకునేటప్పుడు ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం, కంపెనీకి ఉన్న పేరు ప్రతిష్టలు, ఆకర్షణీయమైన జీతభత్యాలకు ఉద్యోగార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదనపు ఆదాయం కోసం వేరే అసైన్మెంట్లు లేదా అదనంగా మరో ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు అనుమతించే కంపెనీలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయని 91 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. సిబ్బంది ఆధారంగానే వ్యాపారంలో విజయం సాధించగలమని, పెట్టుబడి ఒక్కటే సరిపోదని ప్రపంచవ్యాప్తంగా సంస్థలు గుర్తిస్తున్నాయి. అలాగే, ఉద్యోగులు కూడా తాము ఏ బ్రాండుతో కలిసి పని చేయాలి, దీర్ఘకాలికంగా పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఎలా ఉంటుంది అనే అంశాలపై మరింతగా ఆలోచిస్తున్నారు. -
టాటా పవర్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 1,052 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 552 కోట్లు మాత్ర మే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,019 కోట్ల నుంచి రూ. 14,402 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో హరిత ఇంధనం, విద్యుత్ ప్రసారం, పంపిణీ తదితర విభిన్న బిజినెస్‌లలో ప్రస్తావించదగ్గస్థాయిలో అడుగులు వేసినట్లు కంపెనీ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా పేర్కొన్నారు. పునరుత్పాదకాలు, ఒడిషా వి ద్యుత్ పంపిణీలలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. రూఫ్‌టాప్ సోలార్, ఈవీ చార్జింగ్ విభాగాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ రూ. 15,440 కోట్ల విలువైన 3.9 గిగావాట్ల థర్డ్‌పార్టీ ప్రాజెక్టులతో కలిపి ఆర్డర్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం నీరసించి రూ. 206 వద్ద ముగిసింది. -
టాటా పవర్ నిధుల సమీకరణ
ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా 10,000 అన్సెక్యూర్డ్, రీడీమబుల్, ట్యాక్సబుల్, లిస్టెడ్, రేటెడ్, ఎన్సీడీలను జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. రూ. 500 కోట్ల విలువైన సిరీస్–1 ఎన్‌సీడీలకు 2030 జనవరి 8న, మరో రూ. 500 కోట్ల విలువైన సిరీస్–2 ఎన్‌సీడీలకు 2032 డిసెంబర్ 29న గడువు ముగియనున్నట్లు తెలియజేసింది. ఈ బాండ్లను బీఎస్ఈలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్సీడీల జారీ వార్తల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 206 వద్ద ముగిసింది. -
టాటా పవర్.. డబుల్ ధమాకా!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. రూ. 884 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 466 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,310 కోట్ల నుంచి రూ. 14,639 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 9,480 కోట్ల నుంచి రూ. 14,660 కోట్లకు భారీగా పెరిగాయి. ఈ ఏడాది రూ. 14,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. వీటిలో రూ. 10,000 కోట్లను పునరుత్పాదక ఇంధన విభాగంపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. సోలార్ సెల్ ప్లాంట్ 4 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంటు ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు టాటా పవర్ తాజాగా తెలియజేసింది. ఇందుకు రూ. 3,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 5,524 మెగావాట్లుకాగా.. దీనిలో స్థాపిత సామర్థ్యం 3,634 మెగావాట్లు. మరో 1,890 మెగావాట్ల యూనిట్లు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాలలో 75,000 సోలార్ పంపులను ఏర్పాటు చేసింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ విభాగంలో ఎన్ఆర్ఎస్ఎస్ ట్రాన్స్‌మిషన్‌ను(100 శాతం వాటా) సొంతం చేసుకుంది. ఫలితాల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం నష్టంతోరూ. 226 దిగువన ముగిసింది. చదవండి: అక్రమ నిర్మాణం..వందల కోట్లకు ఇంటిని అమ్మేసిన మార్క్ జుకర్ బర్గ్! -
టాటా పవర్ విండ్ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: దేశీయంగా తీరప్రాంత పవన్ విద్యుత్(ఆఫ్‌షోర్ విండ్) ప్రాజెక్టుల అభివృద్ధివైపు టాటా పవర్ తాజాగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా జర్మన్ కంపెనీ ఆర్‌డబ్ల్యూఈ రెనెవబుల్స్ జీఎంబీహెచ్‌తో కలసి పనిచేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు పూర్తి అనుబంధ సంస్థ టాటా పవర్ రెనెవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వెరసి ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీకి ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలలో ఒకటైన ఆర్డబ్ల్యూఈతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు టాటా పవర్ తెలియజేసింది. దేశీయంగా 7,600 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉండటంతో ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్టుల అభివృద్ధికి అత్యంత వీలున్నట్లు వివరించింది. 2030కల్లా 30 గిగావాట్ల ఆఫ్‌షోర్ విండ్ సామర్థ్య ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు తమ ఎంవోయూ మద్దతివ్వనున్నట్లు తెలియజేసింది. రెండు సం స్థలకుగల సామర్థ్య వినియోగం ద్వారా దేశీయంగా పోటీపడేస్థాయిలో ఆఫ్‌షోర్ విండ్ మా ర్కెట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. ఎన్ఎస్ఈలో టాటా పవర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 225 వద్ద ముగిసింది. -
సత్తా చూపిన టాటా పవర్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 74 శాతం జంప్‌చేసి రూ. 552 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 318 కోట్లు మాత్రమే ఆర్జించింది. వెరసి వరుసగా 9వ క్వార్టర్లోనూ కంపెనీ నికర లాభాల్లో వృద్ధిని సాధించింది. ఇక మొత్తం ఆదాయం సైతం 42 శాతం ఎగసి రూ. 11,015 కోట్లకు చేరింది. ఇందుకు ఒడిశా డిస్కమ్‌ల విస్తరణ, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్(టీపీఎస్ఎస్ఎల్) పూర్తిచేసిన అధిక ప్రాజెక్టులు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. సోలార్ సెల్ తయారీ అనుబంధ సంస్థ టీపీఎస్ఎస్ఎల్ 4 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా పేర్కొన్నారు. ఇందుకు రూ. 3,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనం, పంపిణీ, రూఫ్‌టాప్ సోలార్, ఈవీ చార్జింగ్ తదితర వృద్ధికి వీలున్న కీలక విభాగాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కంపెనీ తాజాగా 289 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. దేశవ్యాప్తంగా 1200కుపైగా ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. జేవీలు, అనుబంధ సంస్థలతో కలిపి కంపెనీ మొత్తం 13,171 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ తీపికబురు -
ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలో ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడం కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ, టాటా పవర్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎమ్ఒయులో భాగంగా భారతదేశం అంతటా టీవీఎస్ మోటార్ ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(ఈవీసీఐ) నిర్మించడం కోసం రెండు కంపెనీలు అంగీకరించాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడం కోసం పెద్ద డెడికేటెడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. టీవిఎస్ మోటార్ కస్టమర్ కనెక్ట్ యాప్, టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ యాప్ ద్వారా దేశంలో విస్తృతంగా ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ నెట్ వర్క్ స్టేషన్లు దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అనేది ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తెలుసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం రెగ్యులర్ ఎసీ ఛార్జింగ్ నెట్ వర్క్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయాలని చూసేవారికి ఈ భాగస్వామ్యం మరింత సహాయపడుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్య నేపథ్యంలో సౌర శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఉద్దేశ్యంతోనే రెండు కంపెనీలు తమ ప్రయాణంలో ఎంపిక చేసిన ఛార్జింగ్ స్టేషన్ల వద్ద సౌర శక్తి ద్వారా పవర్ ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా అన్వేషిస్తున్నాయి. (చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!) -
ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్ శుభవార్త!
ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్‌పీసీఎల్ శుభవార్త తెలిపింది. రాబోయే మూడేళ్లలో 5,000 ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) యోచిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 84 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. గత కొన్ని నెలలుగా హెచ్‌పీసీఎల్ తన రిటైల్ అవుట్ లెట్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఇఎస్ఎల్), టాటా పవర్, మెజెంటా ఈవీ సిస్టమ్స్ అనే మూడు సంస్థలతో జతకట్టింది. రూ.65,000 కోట్ల పెట్టుబడులు.. "హెచ్‌పీసీఎల్ గ్రీన్ పవర్, గ్రీన్ హైడ్రోజన్ అవకాశాలకు సంబంధించి సమీక్షిస్తోంది" అని హెచ్‌పీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంకె సురనా కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలిపారు. వివిధ ప్రాజెక్టుల కింద వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో హెచ్‌పీసీఎల్ తన స్టార్ట్-అప్ అభివృద్ధి కార్యక్రమం కింద మెజెంటా ఈవీ సిస్టమ్స్ సహకారంతో మొట్టమొదటి ఈవీ(ఎలక్ట్రిక్ వేహికల్) ఛార్జర్ కేంద్రాన్ని ప్రారంభించింది. "ఛార్జ్ గ్రిడ్ ఫ్లేర్" అని పేరుతో పిలిచే ఈ ఈవీ ఛార్జర్ తక్కువ ధరకు ఛార్జింగ్ సౌకర్యాలను కలిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ అవుట్ లెట్లలో "ఛార్జ్ గ్రిడ్ ఫ్లేర్" శ్రేణి ఛార్జర్లను ఇన్ స్టాల్ చేయాలని హెచ్‌పీసీఎల్ యోచిస్తోంది.(చదవండి: అథర్ బంపర్ ఆఫర్.. ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్ ఫ్రీ) ఈ-మొబిలిటీ వాహనాల కొనుగోలుకు వినియోగదారులను ప్రోత్సహించడం కోసం, ఈవీ రంగంలో ద్విచక్ర, కార్ల వాహన యాజమానుల బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలను పరిష్కరించడం కోసం హెచ్‌పీసీఎల్ మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేస్తోంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) యాజమాన్యంలోని సబ్సిడరీ అయిన సీఇఎస్ఎల్తో హెచ్‌పీసీఎల్ ఒప్పందం చేసుకుంది. రాబోయే 10 సంవత్సరాలలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కతా, పూణేతో వంటి నగరాల్లో ఎంపిక చేసిన రిటైల్ అవుట్ లెట్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. -
సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్
సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పరంగా టాటా పవర్ దూసుకెళ్తుంది. టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్(టీపీఆర్ఈఎల్) రాజస్థాన్‌లోని లోహర్కి గ్రామంలో 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును నిర్మించింది. రాజస్థాన్‌లోని ఈ ప్రాజెక్టుతో టాటా పవర్ మొత్తం పునరుత్పాదక వ్యవస్థాపన సామర్థ్యం 2,947 మెగావాట్ల(2,015 మెగావాట్ల సోలార్, 932 మెగావాట్ల విండ్ పవర్)కు చేరుకుంది. ఇంకా 1,084 మెగావాట్ల పునరుత్పాదక టాటా పవర్ ప్రాజెక్టు పనులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. 756 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 350 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి ఏడాది 3.34 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 6.5 లక్షల మాడ్యూల్స్, 48 ఇన్వర్టర్లు, 720 కిలోమీటర్ల డీసీ కేబుల్, 550 మ్యాన్ పవర్ ఉపయోగించారు. "రాజస్థాన్‌లోని లోహర్కిలో నిర్మించిన 150 మెగావాట్ల ప్రాజెక్టు, సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థలో ఒకటిగా మా స్థానాన్ని సుస్థిరం చేసింది. భారతదేశంలో పునరుత్పాదక శక్తి వృద్ధిని ఇదేవిధంగా మేము కొనసాగిస్తాము" అని టాటా పవర్ సీఈఓ, ఎండి డాక్టర్ ప్రవీర్ సాహా తెలిపారు. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా టీపీఆర్ఈఎల్ ఈ ప్రాజెక్టును నిర్ణీత సమయంలోనే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: డిసెంబరే టార్గెట్.. ఎయిరిండియాను అమ్మేయడానికే) -
అత్యంత ఎత్తులో పవర్ స్టేషన్... టాటా వరల్డ్ రికార్డు
సాక్షి, వెబ్‌డెస్క్: ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న టాటా మరో రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమైంది. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని ఏర్పాటు చేయనుంది. సోలార్‌లోకి టాటా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో కార్పోరేటు కంపెనీలు సౌర విద్యుత్తుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా టాటా సంస్థ సైతం దేశంలో వివిధ ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్లు నిర్మాణం చేపడుతోంది. మన అనంతపురంలో 150 మెగావాట్ల పవర్ ప్లాంటుతో పాటు కేరళలోని కాసర్గోడ్లో 50 మెగావాట్లు, ఒడిషాలోని లపంగాపలో 30 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం టాటా పవర్ చేపట్టింది. అయితే వీటి లేని ప్రత్యేకత తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టులో చోటు చేసుకోనుంది. వరల్డ్ రికార్డు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన లదాఖ్‌లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంటును నిర్మించనుంది టాటా పవర్ సంస్థ, లదాఖ్ ప్రధాన పట్టణమైన లేహ్ సమీపంలో లైంగ్ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్‌ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్ పవర్ స్టేషన్‌గా స్విట్జర్లాండ్‌లోని జుంగ్ఫ్రాజోక్ గుర్తింపు ఉంది. 1991లో ఈ పవర్ స్టేషన్‌ని భూమి నుంచి 3,454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. ముప్పై ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. 2023 మార్చికి పూర్తి లేహ్ సమీపంలో నిర్మించే సోలార్ పవర్ స్టేషన్ నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తి కానుంది. పవర్ స్టేషన్‌కు అనుసంధానంగా 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని సైతం టాటా పవర్ నెలకొల్పనుంది. దీని కోసం రూ.386 కోట్లు వెచ్చించనుంది. ఇండియా వేగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోందని అనడానికి లేహ్‌లో చేపడుతున్న కొత్త సోలార్ పవర్ ప్రాజెక్టు ఉదాహరణ అని టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా అన్నారు. -
హెచ్‌పీసీఎల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి వాణిజ్య ప్రాతిపదికన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్ పెట్రోలియంతో (హెచ్‌పీసీఎల్) టాటా పవర్ జట్టు కట్టింది. హెచ్‌పీసీఎల్ రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతరత్రా ప్రాంతాల్లో కూడా ఈవీ చార్జింగ్ స్టేషన్స్‌ను ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని టాటా పవర్ వెల్లడించింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, రిక్షాలు, బైక్‌లు, బస్సులు మొదలైన వాహనాల చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం తదితర అంశాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. ప్రతిపాదిత చార్జింగ్ స్టేషన్స్ ద్వారా దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరిగేందుకు తోడ్పడగలమని టాటా పవర్ సీఈవో సిన్హా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి చార్జింగ్ సమస్యలే ప్రధాన అవరోధంగా ఉంటున్నాయని, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో ఈ సమస్య పరిష్కారం కాగలదని హెచ్‌పీసీఎల్ ఈడీ రజనీష్ మెహతా పేర్కొన్నారు. -
టాటా పవర్ లాభం రూ.612 కోట్లు
న్యూఢిల్లీ: టాటా పవర్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.612 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సాధించిన నికర లాభం, రూ.619 కోట్లతో పోల్చితే 1 శాతం తగ్గిందని టాటా పవర్ తెలిపింది. ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.7,096 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ అనిల్ సార్దానా పేర్కొన్నారు. పునరుత్పాదన విద్యుదుత్పత్తి విభాగం లాభం రూ.14 కోట్ల నుంచి రూ.72 కోట్లకు పెరిగిందని వివరించారు. అన్ని అనుబంధ విభాగాలతో కలుపుకొని ఈ క్యూ3లో మొత్తం 12,402 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని తెలిపారు. అంతేకాకుండా తమ మొత్తం విద్యుదుత్పత్తికి 227 మెగావాట్ల సౌర విద్యుత్తు, 5.4 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి జత అయ్యాయని వివరించారు. పునరుత్పాదన విద్యుదుత్పత్తి వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా పవర్ షేర్ 0.2 శాతం లాభపడి రూ.87 వద్ద ముగిసింది. -
రూపాయికే 51 శాతం వాటా!
♦ ముంద్రా పవర్ ప్రాజెక్టులో ♦ ఆఫర్ చేస్తున్న టాటా పవర్ న్యూఢిల్లీ: నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న ముంద్రా పవర్ ప్రాజెక్టును గట్టెక్కించేం దుకు టాటా పవర్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టులో 51% వాటాలను రూ.1 కే విక్రయిస్తామంటూ తమ దగ్గర్నుంచి విద్యుత్ కొనుగోలు చేసే గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఆఫర్ ఇచ్చింది. మరికాస్త అధిక రేటుకు విద్యుత్‌ను కొనుగోలు చేసే హామీ లభిస్తే కేవలం 49% వాటా మాత్ర మే ఉంచుకుని, నిర్వహణకు మాత్రమే తాము పరిమితం అవుతామని ప్రాజెక్టును నిర్వహిస్తున్న టాటా పవర్ విభాగం కోస్టల్ గుజరాత్ పవర్ (సీజీపీఎల్) పేర్కొంది. గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్‌కి ఈ మేరకు లేఖ రాసింది.రూ. 2.26కే యూనిట్‌ను విక్రయించేలా 2006లో ప్రాజెక్టును టాటా దక్కించుకుంది. అయితే, బొగ్గు విషయంలో అంచనాలు తప్పడంతో అధిక ధర కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ముంద్రా నష్టాలు రూ. 6,457 కోట్లు కాగా, రుణభారం రూ. 10,159 కోట్లు. కంపెనీ చెల్లింపు మూలధనం రూ. 6,083 కోట్లు. -
రూపాయికే ముంద్రా ప్లాంట్ వాటా విక్రయం
ముంబై: తీవ్ర నష్టాల్లతో టాటా పవర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసిన ముంద్రా ప్లాట్ విషయంలో సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్‌లోని వాటా విక్రయం విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసింది. 4 వేల మెగావాట్ల ముంద్రా యూపీఎంపీ (అల్టా మెగా పవర్ ప్రాజెక్టు)లో 51 శాతం ఈక్విటీ వాటాను కేవలం ఒక్క రూపాయికి విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటాను కొనుగోలు చేయాలని గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ కు టాటా పవర్ అధికారులు లేఖ రాశారు. ఈ ప్రతిపాదన లేఖ కాపీలను విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, గుజరాత్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శికి కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్‌కూడా అందించింది. ఈ లేఖలో రెండు ఆప్షన్స్ ను ప్రస్తావిస్తూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, లేకుంటే ఈక్విటీని కొనుగోలు చేసి ప్లాంటును నిర్వహించుకోవాలని కోరినట్టు సమాచారం. ప్లాంటు నిర్వహణ పెనుభారం కావడంతో నష్టాల నుంచి కోలుకునేందుకు ప్రభుత్వమే ముందుకు రావాలని, 49 శాతం వాటాదారుగా, ప్లాంటుకు అవసరమైన అన్ని రకాల అవసరాలనూ తీర్చేందుకు తాము సిద్ధంగా ఉంటామని ఈ లేఖలో టాటా పవర్ అధికారులు పేర్కొన్నారు. 2008లో వేసిన అంచనా వ్యయాల ప్రాతిపదికన ఇప్పుడు ప్లాంటును నడిపించడం ఎలా సాధ్యమని టాటా సన్స్ బోర్డు ప్రశ్నిస్తూ, ముంద్రా ప్లాంటు విస్తరణ పెట్టుబడులను అడ్డుకున్న వేళ, టాటా పవర్ ఈ లేఖను రాయడం గమనార్హం. కాగా టాటా పవర్ ముంద్రా యుఎంపిపి ప్రాజెక్టు కోసం రూ.18,000 కోట్లు పెట్టుబడి పెట్టగా 2013-14లో ఈ ప్రాజెక్టుపై టాటా పవర్ రూ.1,500 కోట్ల నష్టాలు చవి చూసింది. ఈ ప్లాంటుకు మొత్తం సేకరించిన మొత్తం రు. 15000-16000 కోట్లు. ముంద్రా ప్లాంట్ బ్యాంకుల నుండి రూ .10,000 కోట్లు, టాటా గ్రూపు నుంచి 5000 కోట్ల రూపాయలను తీసుకుంది. మొత్తం రుణ 42,000-43,000 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్న ఐదు రాష్ట్రాలతో (రాజస్థాన్, హర్యానా, పంజా, మధ్యప్రదేశ్, గుజరాత్) దీనికి అనుమతించాల్సి ఉంది. -
టాటా గ్రూపులో మరో కీలక నియామకం
ముంబైటాటా -మిస్త్రీ బోర్డ్ వార్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా పవర్ ఛైర్మన్ గా ఎస్.పద్మనాభన్ నియమితులయ్యారు. 34 సంవత్సరాలుగా టాటా గ్రూప్ తో అనుబంధం ఉన్న పద్మనాభన్ ను ఈ కీలక పదవికి టాటా గ్రూపు నామినేట్ చేసింది. ఈ రోజునుంచే (జనవరి 4 2017) ఈ నియామకాలు అమల్లోకి రానున్నట్టు టాటా పవర్ ప్రకటించింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో టాటా పవర్ అడిషనల్ డైరెక్టర్ గా ఉన్న పద్మనాభన్ ను నామినేట్ చేసినట్టుగా టాటా పవర్ బిఎస్ఇ ఫైలింగ్ లో చెప్పింది. కాగా గత డిసెంబర్ లో పద్మనాభన్ ను టాటాపవర్ అదనపు డైరెక్టర్ నియమించింది.టాటా పవర్ బోర్డ్ లో చేరక మునుప ఆయన టాటా బిజినెస్ ఎక్స్‌లెన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా ఉన్నారు. మరోవైపు ఇటీవల టాటా సన్స్ గ్రూప్ హెచ్ ఆర్ హెడ్ అదనపు బాధ్యతను టాటా అప్పగించింది. సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో కంపెనీ డైరెక్టర్ గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలింకింది టాటా గ్రూపు. అనంతర పరిణామాల నేపథ్యం, తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసే యోచనలో టాటా గ్రూపులోని ఆరు లిస్టెడ్ కంపెనీలకు సైరస్ మిస్త్రీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
నాకు సపోర్టు ఇవ్వండి ప్లీజ్ : మిస్త్రీ
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్‌గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని పీకేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్‌హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించారు. టాటా పవర్ బోర్డు నుంచి తనను పీకేయకుండా ఉండేందుకు వారి మద్దతును కోరారు. బోర్డు నుంచి తనను వైదొలగించే ప్రతిపాదనను వ్యతిరేకించాలని అభ్యర్థిస్తూ ఆయన షేర్హోల్డర్స్కు ఓ లేఖ రాశారు. తన కాలంలో టాటా పవర్, పోటీదారులకంటే మెరుగైన ప్రదర్శనను కనబరిచిందని మిస్త్రీ ఆ లేఖలో పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఈబీఐటీడీఏలు మెరుగుపడ్డాయని, దేశీయ పవర్ సెక్టార్లో కంపెనీకి పునఃరేటింగ్ కల్పించానని చెప్పారు. 2006లో మిస్త్రీ సన్స్ బోర్డులో చేరారు. తర్వాత 2012 డిసెంబర్లో బోర్డు చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన టాటా పవర్ చైర్మన్‌గా ఉన్నారు. కాగ, సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి తొలగించడానికి టాటా పవర్ కంపెనీ 2016 డిసెంబర్ 26న అసాధారణ జనరల్ మీటింగ్ నిర్వహిస్తోంది. ఈ భేటీలో సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి వైదొలగించే ప్రతిపాదనను తీసుకొస్తోంది.