న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 74 శాతం జంప్‌చేసి రూ. 552 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 318 కోట్లు మాత్రమే ఆర్జించింది. వెరసి వరుసగా 9వ క్వార్టర్‌లోనూ కంపెనీ నికర లాభాల్లో వృద్ధిని సాధించింది. ఇక మొత్తం ఆదాయం సైతం 42 శాతం ఎగసి రూ. 11,015 కోట్లకు చేరింది. ఇందుకు ఒడిశా డిస్కమ్‌ల విస్తరణ, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్(టీపీఎస్‌ఎస్‌ఎల్) పూర్తిచేసిన అధిక ప్రాజెక్టులు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది.
సోలార్ సెల్ తయారీ
అనుబంధ సంస్థ టీపీఎస్‌ఎస్‌ఎల్ 4 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా పేర్కొన్నారు. ఇందుకు రూ. 3,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనం, పంపిణీ, రూఫ్‌టాప్ సోలార్, ఈవీ చార్జింగ్ తదితర వృద్ధికి వీలున్న కీలక విభాగాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కంపెనీ తాజాగా 289 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. దేశవ్యాప్తంగా 1200కుపైగా ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. జేవీలు, అనుబంధ సంస్థలతో కలిపి కంపెనీ మొత్తం 13,171 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
జిగేల్‌మన్న టాటా పవర్
Published Thu, Feb 10 2022 8:18 AM | Last Updated on Thu, Feb 10 2022 11:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment