
న్యూఢిల్లీ: టాటా పవర్ చివరి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభం 11% పుంజుకుని రూ. 1,046 కోట్ల ను తాకింది. మొత్తం ఆదాయం రూ. 13,325 కోట్ల నుంచి రూ. 16,464 కోట్లకు జంప్‌చేసింది. షేరుకి రూ. 2 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.
ఇందుకు జులై 4 రికార్డ్ డేట్. పూర్తి ఏడాదికి టాటా పవర్ నికర లాభం రూ. 3,810 కోట్ల నుంచి రూ. 4,280 కోట్లకు బలపడింది. ఆదాయం సైతం రూ. 56,547 కోట్ల నుంచి రూ. 63,272 కోట్లకు ఎగసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం.
కంపెనీ ప్రకటన ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.4 లక్షల కోట్లను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 61,542 కోట్ల అత్యధిక ఆదాయాన్ని, రూ. 12,701 కోట్ల ఎబిటాను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment