మిస్త్రీని తొలగించండి.. | Tata Sons asks Tata Power to call EGM; Tata Chem sets date | Sakshi
Sakshi News home page

మిస్త్రీని తొలగించండి..

Published Wed, Nov 23 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

మిస్త్రీని తొలగించండి..

మిస్త్రీని తొలగించండి..

టాటా పవర్‌ను కోరిన  టాటా సన్స్
డిసెంబర్ 23న టాటా కెమికల్స్ ఈజీఎం  

 న్యూఢిల్లీ: టాటా గ్రూపును పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకునే చర్యలను మాతృసంస్థ టాటా సన్‌‌స ఉధృతం చేసింది. సైరస్ మిస్త్రీని డెరైక్టర్‌గా తొలగించేందుకు వాటాదారుల సమావేశం నిర్వహించాలని గ్రూపు కంపెనీ టాటా పవర్‌ను తాజాగా కోరింది. అదే సమయంలో సైరస్ మిస్త్రీ, నుస్లీ వాడియాలను డెరైక్టర్లుగా తొలగించేందుకు టాటా కెమికల్స్ వచ్చే నెల 23న వాటాదారుల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించనుంది. టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్‌‌స గత నెలలో తప్పించగా, గ్రూపు కంపెనీలు కొన్నింటికి ఆయన చైర్మన్‌గా, డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. దీంతో మిస్త్రీని పూర్తిగా గ్రూపు నుంచి పంపించే చర్యలను టాటా సన్‌‌స ముమ్మరం చేసింది. ఇందుకోసం ఈజీఎంలను నిర్వహించాలని గ్రూపు కంపెనీలను కోరింది. మిస్త్రీని డెరైక్టర్‌గా తొలగించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఈజీఎం నిర్వహించాలని ప్రమోటర్ టాటా సన్‌‌స నుంచి ప్రత్యేక నోటీసు అందుకున్నట్టు టాటా పవర్ బీఎస్‌ఈకి తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement