సాక్షి, ముంబై: విద్యుత్ కొరతతో అవస్థలు పడుతున్న పశ్చిమ రైల్వే జోన్ అధికారులు ఆ సమస్యకు విరుగుడు కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు గుజరాత్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి సం బంధించి ఇప్పటికే అక్కడి అధికారులకు లేఖ రాయగా, వారు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. రైల్వేల నిర్వహణకు సంబంధిం చి ఆయా జోన్లకు కేంద్రం పూర్తి అధికారాలు దఖ లుపర్చింది.
ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరి ష్కరించేందుకు పక్కరాష్ట్రం నుంచి విద్యుత్ కొనాలని అధికారులు నిర్ణయించారు. ముంబై సబర్బన్‌లో రైళ్లను నడిపేందుకు చవక ధరలో విద్యుత్ కొనుగోలు చేయాలన్నది అధికారుల ప్రతిపాదన. ప్రస్తుతానికి వారు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెం దిన విద్యుత్ పంపిణీ సంస్థ , టాటా పవర్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా విద్యుత్ కొనుగోళ్ల వ్యయం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఈ భారాన్ని అదు పు చేసేందుకు గుజరాత్ నుంచి కేవలం యూని ట్‌కు ఐదు రూపాయల చొప్పున కరెంటును కొనాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా తొలుత 50 మెగావాట్లను గుజరాత్ నుంచి కొనుగోలు చేయాలని, ఆ తరువాత దీన్ని మరింత పెంచాల ని భావిస్తున్నారు. గుజరాత్‌లోని టిట్వాలా విద్యు త్ ప్రాజెక్టు త్వరలోనే వినియోగంలోకి రానున్నందున, అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును తాము కొనుగోలుచేస్తామని పశ్చిమ రైల్వే ప్రతి పాదించింది. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం.
‘మహా’ రైళ్లకు గుజరాత్ విద్యుత్
Published Mon, Jul 21 2014 1:03 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement