Western Railway Zone
-
వైరల్ : ప్రాణాలు కాపాడుతానంటున్న యమరాజు
ముంబయి : సాధారణంగా మన ప్రాణాలను హరించేందుకు యముడి రూపంలో వస్తాడని మన పురాణాలు చెబుతుంటాయి. కానీ అదే యముడు ప్రాణాలు కాపాడడానికి వస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఇక్కడ చూడండి. రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదాల భారీన పడుతున్న వారికి అవగాహన కల్పించడానికి పశ్చిమ రైల్వే విభాగం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఒక వ్యక్తికి యముని వేషదారణ వేసి రైల్వే ట్రాక్ దాటుతున్న కొంతమందిని ఎత్తుకొని ప్లాట్పామ్ మీదకు తీసుకువచ్చి ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. పశ్చిమ రైల్వే విభాగం చేసిన వినూత్న ప్రయత్నానికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 'తరచూ రైల్వే పట్టాలు దాటుతూ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలిసిన విషయమే. వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించడానికే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక మీదట ఎవరు ప్రమాదాల భారీన పడకుండా సబ్వే లేదా రైల్వే బ్రిడ్జిని ఉపయోగించేలా ప్రయాణికులను ప్రోత్సహిస్తామని' పశ్చిమ రైల్వే విభాగం ట్విటర్లో పేర్కొంది. 'ప్రయాణికులు ప్రమాదాల భారీన పడకుండా పశ్చిమ రైల్వే విభాగం చేస్తున్న వినూత్న కార్యక్రమం చాలా బాగుంది అంటూ' నెటిజన్లు తమ సంతోషాన్నివ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల భారీన పడకుండా కాపాడుతున్న యమరాజు రూపంలో ఉన్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. అయితే గతంలోనూ బెంగుళూరు, గుర్గావ్ నగరాల్లో ప్రయాణికులకు రోడ్ సేప్టీ అవేర్నెస్ కల్పించడానికి ఆయా రాష్ట్రాల ట్రాపిక్ విభాగం ఇలాంటి వినూత్న కార్యక్రమాలనే చేపట్టింది. This Yamraj ji saves lives. He catches people who are endangering their lives by trespassing the railway tracks, but to save them. This Yamraj picks people to release them safely. Please do NOT cross tracks, it's dangerous. pic.twitter.com/PT81eYVajL — Western Railway (@WesternRly) 7 November 2019 -
‘మహా’ రైళ్లకు గుజరాత్ విద్యుత్
సాక్షి, ముంబై: విద్యుత్ కొరతతో అవస్థలు పడుతున్న పశ్చిమ రైల్వే జోన్ అధికారులు ఆ సమస్యకు విరుగుడు కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు గుజరాత్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి సం బంధించి ఇప్పటికే అక్కడి అధికారులకు లేఖ రాయగా, వారు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. రైల్వేల నిర్వహణకు సంబంధిం చి ఆయా జోన్లకు కేంద్రం పూర్తి అధికారాలు దఖ లుపర్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరి ష్కరించేందుకు పక్కరాష్ట్రం నుంచి విద్యుత్ కొనాలని అధికారులు నిర్ణయించారు. ముంబై సబర్బన్‌లో రైళ్లను నడిపేందుకు చవక ధరలో విద్యుత్ కొనుగోలు చేయాలన్నది అధికారుల ప్రతిపాదన. ప్రస్తుతానికి వారు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెం దిన విద్యుత్ పంపిణీ సంస్థ , టాటా పవర్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా విద్యుత్ కొనుగోళ్ల వ్యయం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఈ భారాన్ని అదు పు చేసేందుకు గుజరాత్ నుంచి కేవలం యూని ట్‌కు ఐదు రూపాయల చొప్పున కరెంటును కొనాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత 50 మెగావాట్లను గుజరాత్ నుంచి కొనుగోలు చేయాలని, ఆ తరువాత దీన్ని మరింత పెంచాల ని భావిస్తున్నారు. గుజరాత్‌లోని టిట్వాలా విద్యు త్ ప్రాజెక్టు త్వరలోనే వినియోగంలోకి రానున్నందున, అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును తాము కొనుగోలుచేస్తామని పశ్చిమ రైల్వే ప్రతి పాదించింది. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం.