న్యూఢిల్లీ: దేశీయంగా తీరప్రాంత పవన్ విద్యుత్(ఆఫ్‌షోర్ విండ్) ప్రాజెక్టుల అభివృద్ధివైపు టాటా పవర్ తాజాగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా జర్మన్ కంపెనీ ఆర్‌డబ్ల్యూఈ రెనెవబుల్స్ జీఎంబీహెచ్‌తో కలసి పనిచేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు పూర్తి అనుబంధ సంస్థ టాటా పవర్ రెనెవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వెరసి ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీకి ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలలో ఒకటైన ఆర్‌డబ్ల్యూఈతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు టాటా పవర్ తెలియజేసింది.
దేశీయంగా 7,600 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉండటంతో ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్టుల అభివృద్ధికి అత్యంత వీలున్నట్లు వివరించింది. 2030కల్లా 30 గిగావాట్ల ఆఫ్‌షోర్ విండ్ సామర్థ్య ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు తమ ఎంవోయూ మద్దతివ్వనున్నట్లు తెలియజేసింది. రెండు సం స్థలకుగల సామర్థ్య వినియోగం ద్వారా దేశీయంగా పోటీపడేస్థాయిలో ఆఫ్‌షోర్ విండ్ మా ర్కెట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది.
ఎన్‌ఎస్‌ఈలో టాటా పవర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 225 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment