
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ తాజాగా కార్ షేరింగ్ కంపెనీ జూమ్‌కార్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జూమ్‌కార్ ప్రస్తుత, కొత్త ఈవీ కస్టమర్లు టాటా పవర్ ఈజీ చార్జ్ పాయింట్లను వినియోగించుకోవచ్చు.
వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా 25,000 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని టాటా పవర్ లక్ష్యంగా చేసుకుంది. భారత్, ఇండోనేíÙయా, ఈజిప్ట్‌లో జూమ్‌కార్‌కు 20,000 పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment