న్యూఢిల్లీ: దేశంలో ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడం కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ, టాటా పవర్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎమ్ఒయులో భాగంగా భారతదేశం అంతటా టీవీఎస్ మోటార్ ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(ఈవీసీఐ) నిర్మించడం కోసం రెండు కంపెనీలు అంగీకరించాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడం కోసం పెద్ద డెడికేటెడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.
టీవిఎస్ మోటార్ కస్టమర్ కనెక్ట్ యాప్, టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ యాప్ ద్వారా దేశంలో విస్తృతంగా ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ నెట్ వర్క్ స్టేషన్లు దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అనేది ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తెలుసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం రెగ్యులర్ ఎసీ ఛార్జింగ్ నెట్ వర్క్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయాలని చూసేవారికి ఈ భాగస్వామ్యం మరింత సహాయపడుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్య నేపథ్యంలో సౌర శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఉద్దేశ్యంతోనే రెండు కంపెనీలు తమ ప్రయాణంలో ఎంపిక చేసిన ఛార్జింగ్ స్టేషన్ల వద్ద సౌర శక్తి ద్వారా పవర్ ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా అన్వేషిస్తున్నాయి. (చదవండి: ఫేస్‌బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!)
Comments
Please login to add a commentAdd a comment