
న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా తమ డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జర్ల ఏర్పాటు కోసం టాటా పవర్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం గంట వ్యవధిలోనే కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలను చార్జింగ్ చేసే సామర్ధ్యం ఉండే ఫాస్ట్ చార్జర్లను టాటా పవర్ ఇన్‌స్టాల్ చేస్తుంది.
తద్వారా ఒక్కో చార్జరుతో రోజులో 20–24 వాహనాలను చార్జింగ్ చేయడానికి వీలవుతుందని బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాజర్షి మొయిత్రా తెలిపారు. బ్రిడ్జ్‌స్టోన్ కస్టమర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనదారులందరికీ దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో ఈ చార్జర్లు 24 గంటలూ అందుబాటులోకి ఉంటాయన్నారు. ఇన్‌స్టాలేషన్, చార్జింగ్, మెయింటెనెన్స్, ఈ–పేమెంట్స్ మొదలైన వాటికి సంబంధించి టాటా పవర్ సహాయ, సహకారాలు అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment