PMSGMBY: పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల లోన్ | Get Collateral Free Loans of Up To Rs 2 Lakh PM Surya Ghar Yojana | Sakshi
Sakshi News home page

PMSGMBY: పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల లోన్

Published Sat, Mar 15 2025 4:31 PM | Last Updated on Sat, Mar 15 2025 4:54 PM

Get Collateral Free Loans of Up To Rs 2 Lakh PM Surya Ghar Yojana

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన (PMSGMBY) కింద ఇప్పటికే 10 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలనే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి మొత్తం కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన.. ఈ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన కింద 10 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ 'ప్రహ్లాద్ జోషి' వెల్లడించారు.

డాక్యుమెంట్స్ అవసరం లేకుండా రూ.2 లక్షల లోన్
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకం కింద.. ఇళ్లలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు. దీనికోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ. 2 లక్షల వరకు లోన్ అందిస్తాయి. ఇందులో రూ. 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.

ఏడాదికి 6.75 శాతం వడ్డీ రేటుతో.. రూ. 6 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే రూ. 2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం వరకు బ్యాంక్ ఫైనాన్సింగ్ సదుపాయం ఎంచుకోవచ్చు.

ఎవరు అప్లై చేసుకోవచ్చు
➤భారతీయ పౌరుడై ఉండాలి.
➤సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఉండాలి.
➤చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
➤ఇప్పటివరకు సౌర ఫలకాలను సంబంధించిన ఎలాంటి ఇతర సబ్సిడీలను పొంది ఉండకూడదు.

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌.. వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

ఎలా అప్లై చేసుకోవాలి?
➤అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, అక్కడే కనిపిస్తున్న కన్స్యూమర్ ట్యాబ్‌కి వెళ్లి, అందులో 'అప్లై నౌ' ఎంచుకోండి.
➤లాగిన్ డ్రాప్‌డౌన్ మెనుని ఓపెన్ చేసి కూడా కన్స్యూమర్ లాగిన్ ఎంచుకోవచ్చు.
➤మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయి.. ద్రువీకరించండి. పేరు, రాష్ట్రం మరియు ఇతర వివరాలను అందించండి. 
➤మీ ఈమెయిల్ ఐడీని ధ్రువీకరించిన తరువాత.. మీ ప్రొఫైల్‌ను సేవ్ చేయండి. 
➤విక్రేత కోసం, మీ అవసరాన్ని బట్టి అవును లేదా కాదు సెలక్ట్ చేసుకోండి.
➤'సోలార్ రూఫ్‌టాప్ కోసం అప్లై చేసుకోండి'పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా డిస్కామ్ వంటి ఇతర వివరాలను అందించండి.
➤అన్ని పూర్తి చేసిన తరువాత విక్రేతను ఎంపిక చేసుకుని మీ బ్యాంక్ వివరాలను అందించండి.
➤మీ సబ్సిడీ మంజూరైన తర్వాత సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement