burnt to death
-
వరంగల్‌లో విషాదం.. వ్యక్తి సజీవ దహనం
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాపయ్యపేటలో మొక్కజొన్న కొయ్యాలు కాల్చుతూ ప్రమాదావశాత్తు మంటల్లో చిక్కుకొని ఓ రైతు సజీవ దహనమయ్యారు.గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు(65)తన వ్యవసాయ బావి వద్ద మొక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టాడు. అనుకోకుండా మంటలు వ్యాపించి పక్కనే మరో రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు వ్యాపించాయి.దీంతో మంటలను ఆర్పేందుకు వెళ్లిన పాపారావు ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక సజీవ దహనమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆత్రికి తరలించినట్లు ఎస్ఐ అరుణ్‌కుమార్ తెలిపారు. పాపారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఢిల్లీ హత్యాచార ఘటన: రాహుల్ చేష్టలపై సీరియస్
Delhi Dalit Minor Case: ఢిల్లీ మైనర్ హత్యాచార ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పరస్పర రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బాధితురాలి తల్లిదండ్రుల ఫొటోల్ని తన ట్విటర్లో రాహుల్ పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సీరియస్ అయ్యింది. శ్మశాన వాటికలో మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై అక్కడున్న కొందరు హత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై తల్లిదండ్రుల సమ్మతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించారన్న కేసు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ తరుణంలో తొమ్మిదేళ్ల దళిత మైనర్ బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ తన ట్విటర్లో ఫొటో పోస్ట్ చేశాడు. అయితే జువెనైల్ జస్టిస్-పోక్సో చట్టాల ప్రకారం.. అలా ఫొటోల్ని, వివరాల్ని బయటపెట్టడానికి వీల్లేదు. తద్వారా బాధితురాలి ఐడెంటిటీ బయటపడే అవకాశం ఉంది. ఇది చట్ట విరుద్ధం కూడా. ఈ నేపథ్యంలోనే బాలల కమిషన్ స్పందించింది. రాహుల్ పోస్ట్‌పై మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ట్విటర్‌కు ఎన్సీపీసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విటర్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌కు సదరు ట్వీట్‌ను తొలగించాలంటూ ఓ లేఖ కూడా రాసింది. ఇక రాహుల్ చర్యలపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ డీసీపీ(నైరుతి విభాగం)కి మరో ప్రత్యేక లేఖలో కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని 48 గంటల డెడ్‌టైన్ విధించింది ఎన్సీపీసీఆర్. ఇక ‘ఓటేసే ముందు నిర్భను గుర్తు తెచ్చుకోండి’ అంటూ గతంలో మోదీ చేసిన ప్రచారాన్ని తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్.. తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్‌పై కౌంటర్ దాడులు చేస్తోంది. -
నీ కూతురిని ఇంటికి తీసుకెళ్లు.. లేదంటే చంపేస్తాం!
వరకట్న వేధింపులకు మరో మహిళ బలైపోయింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిని దారుణంగా హతమార్చారు. డబ్బుపై మొహంతో కట్టుకున్న భర్త, అత్తమామలలే కాలయములై వివాహితను కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ అమానుష ఘటన పంజాబ్ రాష్ట్రంలో మంగళరం వెలుగు చూసింది. లుధియానా జిల్లాలోని సమ్రాలా ప్రాంతంలో సురిందర్ పాల్ కుటుంబం నివాసముంటోంది. పాల్ తన కుమార్తె మణ్‌దీప్ కౌర్‌ను కాకోవాల్ మజ్రా గ్రామానికి చెందిన బలరాం సింగ్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరికి ఏడాది వయసున్న కూతురు ఉంది. పెళ్లైనప్పటి నుంచే మహిళపై అత్తాంటివారి వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల అదనపు కట్నం కావాలని మహిళపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో మంగళవారం వివాహిత ఒంటినిండా కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తన కూతురిని అత్తింటివారే చంపారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. కూతురిని పుట్టింటికి తీసుకెళ్లకుంటే ఆమెను చంపేస్తామని అల్లుడు ముందుగానే హెచ్చరించాడని తెలిపాడు. ఒకవేళ తన కూతురిని ముందుగానే ఇంటికి తీసుకువచ్చినట్లయితే, ఆమె ఈ రోజు సజీవంగా ఉండేదని సురిందర్పాల్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘అల్లుడి తండ్రి కాల్ చేసి నా కూతురికి కాలిన గాయాలయ్యాని, ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. నేను వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి నుంచి నా కూతురిని రాజీంద్ర హస్మిటల్కు రిఫర్ చేశారు. అక్కడికి వెళ్తుండగానే మధ్యలోనే నా కూతురు చనిపోయింది. నేను చివరికి నా కూతురు శవాన్ని చూడాల్సి వచ్చింది. ఆమె తలపై గాయాలు చూసి షాకయ్యాను. శరీరమంతా కాలిన గాయాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన అప్పటినుంచి అత్తారింటివారు తన కూతురిని కట్నం వేధింపులకు గురిచేసేవారని బాధితురాలి తండ్రి వాపోయాడు. ఆమె భర్త బలరాం, వాళ్ల తల్లిదండ్రులు కూతురిపై దాడికి పాల్పడుతున్నారు. మేము ఈ విషయాన్ని గ్రామ పంచాయతీతో లేవనెత్తాము. గ్రామంలోని పంచాయతీ పెద్దలు సమస్యను పరిష్కరించారు. అయినా నా కుమార్తెకు అత్తమామల వేధింపులు తగ్గేలేదని మహిళ తండ్రి ఆరోపించారు. కాగా మన్దీప్ భర్త బలరాం సింగ్, బావ చంద్ సింగ్, అత్త రాజ్వంత్ కౌర్, బావ రాజ్వీందర్ కౌర్, బావమరిది కుల్బీర్ సింగ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. -
దారుణం: మంచానికి కట్టేసి తగలబెట్టారు!
లక్నో : మంచానికి కట్టిపడేసి ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో లభ్యమైంది. బిజ్నూర్ జిల్లాలోని గజ్రోలా అనే గ్రామంలోని మామిడితోటలో పూర్తిగా కాలిపోయి ఉన్న మహిళ శవాన్ని పోలీసులు గుర్తించారు.అస్థిపంజరం మాత్రమే కనిపించేలా పాశవికంగా ఆమెను తగులబెట్టారని పేర్కొన్నారు. తోటమాలి అందించిన సమాచారం మేరకు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో రెండు తుపాకీ గుండ్లు లభ్యమయ్యాయని.. అందులో ఒకటి బాధితురాలిపై ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళను తుపాకీతో కాల్చి చంపి.. అనంతరం తగల బెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటన జరిగిన మామిడితోట నోయిడాకు చెందిన వ్యక్తిదని పోలీసులు తెలిపారు. అయితే మృతి చెందిన మహిళ ఎవరనే విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదని.. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. -
హైదరాబాద్‌లో అమానుషం..
సాక్షి, హైదరాబాద్ : పిల్లలకు చిన్నదెబ్బ తగిలితేనే తల్లి ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది తన కళ్లముందే తన బిడ్డలు మంటల్లో కాలి పోతుంటే.. ఆ మాతృమూర్తి కడుపుకోత వర్ణణాతీతం. తన కళ్ల ముందే కాలి బూడిదయిపోతున్న బిడ్డల్ని కాపుడుకోలేక.. సాయం చేసేవారు రాక.. నిస్సహయంగా చూస్తూ మూగగా రోదిస్తున్న ఆ తల్లి కుక్కను చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తోంది. మానవత్వం లేని ఆ రాక్షసులను కసితారా తిట్టాలనిపిస్తుంది. విచక్షణ మరిచిన వారేవరో తమ రాక్షసానందం కోసం నాలుగు చిన్న కుక్కపిల్లలను మంటల్లో పడేసి సజీవ దహనం చేసిన దారుణమైన సంఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పాపం వాటి తల్లి ముందే ఆ చిన్న పప్పీలను మంటల్లో పడేశారు. బిడ్డలు కళ్ల ముందే కాలిపోతుంటే రక్షించుకోలేక నిస్సహయంగా చూస్తూ ఏడుస్తూ ఉన్న కుక్కకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఈ దారుణానికి ఒడిగట్టిందేవరో.. అసలు ఏ ఉద్దేశంతో ఇంతటి అమానవీయ సంఘటనకు పాల్పడ్డారో తేలీదు. కుక్కప్లిలలు మంటల్లో కాలిపోతున్న వీడియో.. ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఇది గమనించిన స్థానికులు ఈ దారుణం గురించి ఆ ప్రాంతంలో ఉండే ఓ జంతు ప్రేమికుడికి సమాచారం ఇచ్చారు. సదరు వ్యక్తి సంఘటన స్థలానికి చేరేలోపే నాలుగు కుక్కపిల్లలో మూడు మంటల్లో కాలి మరణించగా ఒకటి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. ఇది గమనించిన సదరు వ్యక్తి వైద్యం నిమిత్తం ఆ పప్పిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ సాయంత్రానికి అది కూడా మరణించింది. జరిగిన దారుణం గురించి ‘పీపుల్స్ ఫర్ యానిమల్ ప్రొటెక్టర్’ కార్యకర్త ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ దారుణం చోటుచేసుకున్న ప్రాంతానికి సంబంధించిన సీసీ టీవీ ఫూటేజిని పరిశీలిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం 2016, జులైలో కొంతమంది యువకులు కొన్ని కుక్కపిల్లలని మంటల్లో పడేసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. -
ప్రేమించిందని ప్రాణాలు తీసిన తల్లిదండ్రులు
జైపూర్: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిందనే కారణంతో కని పెంచిన తల్లిదండ్రులే తమ కూతురికి నిప్పంటించి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్‌లోని జైపూర్‌కి సమీపంలోని ఫగీ గ్రామానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన ఓ బాలుడ్ని ప్రేమించింది. ఇది సహించలేకపోయిన బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఆమెకు నిప్పంటించి సజీవ దహనం చేశారు. అంతేకాకుండా తమ కూతురికి పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వల్లే ఆత్మహత్యకు పాల్పండిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి ఫిర్యాదుపై అనుమానం రావడంతో పోలీసులు ఈ కేసుపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణల సహాయంతో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు.. చివరకు అది ఆత్మహత్య కాదని నిర్ధారణకు వచ్చారు. తగిన ఆధారాలు సేకరించి బాలిక తల్లిదండ్రులను విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. ‘మా కూతురు ఓ వ్యక్తిని ప్రేమించడంతో.. గ్రామస్థులు తమ పెంపకం గురించి చాలా రకాలుగా మాట్లాడేవారు. దీంతో మా పరువు నిలుపుకోవడం కోసమే బాలికను హత్య చేశామ’ని బాలిక తల్లిదండ్రులు పోలీసుల విచారణలో తెలిపారు. -
వృద్ధురాలి సజీవ దహనం
కొరాపుట్ : వంట గ్యాస్ మంటల్లో ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. స్థానిక పండా కాలనీలో గల పి.జగన్నాథ్ ఘడయ్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గ్యాస్ స్టౌ నుంచి వెలువడుతున్న మంటలను అదుపుచేయడం కోసం వచ్చిన మెకానిక్ డి. మణిపాత్రో చెక్ చేస్తుండగా మంటలు గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించి భారీగా అగ్ని ప్రమాదం వాటిల్లింది. ఆ మంటలకు ఇంట్లో ఉన్న జగన్నాథ్ తల్లి పి.సాయిబాని 90 శాతం మేర ఆహుతై ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు జగన్నాథ్ ఘడయ్ శరీర భాగాలు కూడా చాలా చోట్ల కాలిపోయాయి. ప్రస్తుతం ఆయన కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెకానిక్ మణిపాత్రో కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. -
రాజధానిలో మరో ఘోరం
-
ముగ్గురి సజీవ దహనం
రాంచి: ముగ్గురికి నిప్పంటించి హత్య చేసిన కేసులో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. జార్ఖండ్ కు 80 కి.మీ దూరంలో ఉన్న చిప్పో థెక్కా గ్రామంలో ఈఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..గోవర్ధన్ భగత్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఒక బాలున్ని అపహరించి బలిచ్చాడనే అనుమానంతో 50మంది గ్రామస్థులు అతని ఇంటిపై దాడి చేశారు. ఆసమయంలో ఇంట్లో ఉన్న వారిని వేధించి వారికి నిప్పంటించారు. ఇందులో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు. కాలిన గాయాలతో భగత్ దాడి నుంచి తప్పించుకున్నాడు. గతంలో హత్య కేసులో భగత్ జైలుకెళ్లొచ్చాడు. Three family members, burnt to death, Jharkhand, ముగ్గురు కుటుంబ సభ్యులు, సజీవ దహనం, జార్ఖండ్ -
బరువైన 'బుల్లెట్' ప్రాణం తీసింది
న్యూఢిల్లీ: ఢిల్లీలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం బీభత్సం సృష్టించింది . ఒకవైపు అతి వేగం, మరోవైపు బరువైన వాహనం మానిక్ గౌర్(32) ప్రాణాలు తీసింది. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని శంకర్ విహార్ దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రత్యక్ష సాక్షులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్రేజీ బైక్ బుల్లెట్ పై రైడ్ అంటే యువకులకు మహా ఉత్సాహం. ఈ ఉత్సాహంలోనే మానిక్ మితిమీరిన వేగంతో బుల్లెట్ పై వెడుతూ పక్కనే ఉన్న టెంపోను ఢీకొట్టాడు. అక్కడితో అది ఆగలేదు.. కొన్నిమీటర్ల దూరం వాహనాన్ని ఈడ్చుకెళ్లి పోవడంతో మంటలు చెలరేగాయి. బండి పూర్తిగా అదుపు తప్పి, అతను కిండపడిపోయాడు. అతనిపై బుల్లెట్ పడిపోయింది. పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో మానిక్ మంటల్లో చిక్కుకు పోయాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు అతణ్ని ఆసుపత్రి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే బుల్లెట్ బరువు ఎక్కువగా ఉండడంతో అతను తప్పించుకోలేకపోయాడని పోలీస్ అధికారులు తెలిపారు. సుమారు 200 కిలోల వెయిట్ వున్న వాహనాన్ని లేపలేకపోయాడని , మంటలు బాగా వ్యాపించడంతో తాము కూడా ఏమీ చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు. -
కిరాతకం
కరాచీ: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన దారుణ ఘటన పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. ఘోట్కి జిల్లాలోని దాహార్కి పట్టణంలో గతవారాంతంలో ఈ కిరాతక ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు తన కుమార్తెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని, తర్వాత పెట్రోల్ పోసి ఆమెను సజీవదహనం చేశారని బాలిక తల్లి(40) స్థానిక మీడియాతో చెప్పింది. తనను కూడా లాక్కెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆమె తెలిపింది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆదివారం ఆమె తొలిసారిగా మీడియాతో మాట్లాడింది. ఈ ఘోరకృత్యంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో బాలిక సోదరుడు సోమవారం ఘోట్కి సెషన్స్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
రాహుల్‌కు ముద్దు పెట్టిన మహిళ హత్య
-
బస్సు- లారీ ఢీ: 11 మంది మృతి
అర్జెంటీనా లోని మెండోజా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఓ లారీ ఢీకొనడంతో 11 మంది మరణించారు, మరో 20 మంది వరకు గాయపడ్డారు. బస్సులో ఆ సమయానికి 28 మంది ప్రయాణిస్తున్నారు. అది కార్బోడా నుంచి మెండోజాకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ దాన్ని ఢీకొంది. దాంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ రెండు వాహనాలూ పూర్తిగా కాలిపోయాయని, అసలు వాటిలో మరణించిన వారి మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టే పరిస్థితిలో లేవని గాబ్రియేలా సోసా అనే పాత్రికేయురాలు తెలిపింది. క్షతగాత్రులలో ఇద్దరు పిల్లలతో పాటు కొంతమంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మెండోజా లోని ఆస్పత్రులకు తరలించారు. -
పలమనేరులో ముగ్గురు సజీవ దహనం