కిరాతకం
కరాచీ: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన దారుణ ఘటన పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. ఘోట్కి జిల్లాలోని దాహార్కి పట్టణంలో గతవారాంతంలో ఈ కిరాతక ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు తన కుమార్తెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని, తర్వాత పెట్రోల్ పోసి ఆమెను సజీవదహనం చేశారని బాలిక తల్లి(40) స్థానిక మీడియాతో చెప్పింది.
తనను కూడా లాక్కెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆమె తెలిపింది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆదివారం ఆమె తొలిసారిగా మీడియాతో మాట్లాడింది. ఈ ఘోరకృత్యంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో బాలిక సోదరుడు సోమవారం ఘోట్కి సెషన్స్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.